ఒకరేమో రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అంటాడు… అలాంటి రామోజీకి వేధింపులు నాన్సెన్స్ అంటాడు… యావత్ హిందూజాతికి ఓ సంఘం పెట్టి, దానికి ప్రధాన కార్యదర్శిత్వం నెరిపే మరొకరేమో చిట్‌ఫండ్ టర్నోవర్, ఉద్యోగుల సంఖ్య ఏకరువు పెడతాడు… కేసులు పెట్టొద్దు అని హితవు చెబుతాడు… ఇంకొకరేమో దిగ్రేట్ ప్రియా పచ్చళ్లు పెట్టిన వ్యక్తి మీద కేసా అని ఆశ్చర్యపోతాడు… మార్గదర్శి చట్టాలకు ఎందుకు అతీతమో ఎవరూ చెప్పరు అదేమిటో గానీ… మిత్రుడు Murali Buddha… ఈ ధోరణిపై ఏమంటాడంటే..?
ప్రియా పచ్చళ్ళు అంటే ఏమనుకున్నావ్ ! పచ్చళ్ళు తెలుగు వారి సంస్కృతి… పచ్చళ్ళు లేని తెలుగు వారి ఇంటిని ఊహించ గలమా ?
అమెరికా , కెనడా , ఆస్ట్రేలియా , జర్మన్ , ఇంగ్లాండ్ , దుబాయ్ ఆ దేశం ఈ దేశం అని కాదురా ! ప్రపంచంలో తెలుగు వాడు ఏ దేశం వెళ్లినా అమ్మా అని కొరియర్ లో తల్లిని ఏం పంపమంటాడో తెలుసా ? పచ్చళ్ళు పంపమంటాడు .
Ads
అమెరికాకు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే కొరియర్స్ లో ఎక్కువగా ఏముంటాయో తెలుసా ? పచ్చళ్ళురా … పచ్చళ్ళు … అలాంటి పచ్చళ్ళను అవమానించడం, అనుమానించడం అంటే తెలుగు ఆత్మ గౌరవాన్ని అవమానించడమే .
ప్రియా పచ్చళ్ళ ద్వారా ప్రపంచంలోని తెలుగు వారికి తెలుగునాడుతో అనుసంధానం చేసిన ప్రియా పచ్చళ్ళ ఓనర్ నే అనుమానిస్తావా ? పచ్చళ్ళు దొరకని చావు చస్తావు ….
ఏంటన్నా అంత కోపం ?
విజయవాడలో పేరు మోసిన న్యాయవాది మార్గదర్శి గురించి ప్రకటన చేశారు . చట్టపరంగా తప్పు అని ఉండవల్లి ఏం చెప్పాడో, వాటన్నిటికి పేరు మోసిన న్యాయవాది సమాధానం చెప్పారేమో అని వార్త మొత్తం చదివి చూశా … ప్రియా పచ్చళ్ళ ప్రాశస్తం గురించి, ప్రియా పచ్చళ్ళు తయారు చేసే కంపెనీ ఓనర్ ను తప్పు పట్టడం పాపం అనే వాదన తప్ప ఉండవల్లి లేవనెత్తిన అంశాలకు సమాధానం లేదు .
ఐనా న్యాయ నిపుణులు గారూ… ప్రియా పచ్చళ్ళు బాగా ఉండవు అని ఎవరూ అనడం లేదు … కదా ? పచ్చళ్ళ సంగతి ఎందుకు కానీ చట్టం ఏం చెబుతుందో చెప్పండి …
Share this Article