ఇప్పుడు సోషల్ మీడియా పైత్యం పెచ్చుపెరిగాక, థంబ్ నెయిల్ జర్నలిజం జోరు పెరిగాక… పాత జర్నలిజం సూత్రాలు ఎవరికీ పట్టింపులేకుండా పోయాయి… పాత ప్రమాణాలను పాటించేవాడిని పకపక నవ్వుతూ వెక్కిరించే కాలం ఇది… ఈ ప్రకాష్ రాజ్ వార్త కూడా అలాంటిదే…
హఠాత్తుగా ‘‘మోడీ మళ్లీ ప్రధాని కావడం నాకిష్టం లేదు’’ అని ప్రకాష్ రాజ్ ఎక్కడో అన్నట్టుగా పబ్లిషయిన ఓ పేపర్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… అది ఏ పత్రికో, ఎప్పటిదో తెలిసేలా లేదు ఆ క్లిప్పింగ్… వెతగ్గా వెతగ్గా వివరాలు దొరికాయి… ఇది సరిగ్గా నాలుగేళ్ల క్రితం నాటి వార్త… ఏప్రిల్ 12, 2019…
సాధారణంగా విమర్శలు పబ్లిష్ చేసేటప్పుడు సదరు విమర్శలు చేసిన వారి స్థాయి ఏమిటో, ఏ స్థాయి నాయకుడిపై విమర్శలు చేస్తున్నారో చూడాలి… అది బేసిక్ జర్నలిజం ప్రిన్సిపుల్… ఉదాహరణకు ఓ ఎమ్మెల్సీ ప్రధానిపై విమర్శలు చేస్తే అర్థరహితం… స్థాయిరాహిత్యం… ఓ ఎంపీటీసీ లేదా సర్పంచి ముఖ్యమంత్రి మీద విమర్శలు చేసినా అవీ అర్థరహితమే…
Ads
ఈక్వల్ స్టేటస్ కాకపోయినా, ఓ మోస్తరు స్థాయిలో ఉన్నవారి స్టేట్‌మెంట్లు ఎంటర్‌టెయిన్ చేస్తారు… కానీ ఇప్పుడు జోన్ పేజీలు, జిల్లా పేజీలు, యూట్యూబ్ చానెళ్లు, సైట్లు, సోషల్ మీడియా విజృంభించాక ఈ పాత్రికేయ ప్రమాణం ఎటో కొట్టుకుపోయింది… అందుకే ప్రకాష్‌రాజ్ మోడీ మీద చేసిన విమర్శ ఏకంగా మెయిన్ పేజీలోకి ఎక్కింది… అసలు ప్రకాష్ రాజ్ ఎవరు..?
హఠాత్తుగా సోషల్ మీడియాలో ఎవరు, దేన్ని ఎందుకు ప్రచారంలోకి తీసుకొస్తారో అర్థం కాదు… నాలుగేళ్ల నాటి క్లిప్పింగుకు ఇప్పుడున్న రిలేటివిటీ ఏముంది..? ప్రకాష్‌రాజ్‌ను మళ్లీ తెరమీదకు ఎందుకు తీసుకురావడం..? కొందరు సోషల్ నెటిజన్ల ధోరణి చూస్తే ఇందుకే ఆశ్చర్యం, ఆగ్రహం…
తను పొలిటిషియనే కాదు… సర్పంచి కాదు, వార్డు సభ్యుడు కూడా కాదు… మరి ఎందుకింతగా పత్రికలు తన వార్తల్ని క్యారీ చేస్తున్నట్టు…? అదీ ఏకంగా మోడీ ప్రధాని కావడం తనకిష్టం లేదట… సాక్షి వాడు కళ్లుమూసుకుని అచ్చేశాడు… (ఇతర పత్రికలు శుద్ధపూసలని కాదు… ఉదాహరణకు, ఎవరో హిందూసభ కార్యదర్శి, ఆడిటర్లు మార్గదర్శికి వత్తాసుగా మాట్లాడితే ఈనాడు కాలాలకొద్దీ అచ్చేసింది… అసలు వాళ్లకూ మార్గదర్శికీ సంబంధం ఏమిటి..?)…
పోనీ, ప్రకాష్‌రాజ్‌కు ఏదేని ఆర్గనైజేషన్ ఉందా..? లేదు..! ప్రఖ్యాత రచయితా, సామాజిక కార్యకర్తా, మేధావా, సమాజ ప్రముఖుడా… ఏదీ కాదు… మసకేసిన ఓ నటుడు మాత్రమే… తనను చూడటం ఇప్పుడు ప్రేక్షకులకు పెద్ద ఇష్టంగా లేదు… తన ఓవరాక్షన్ రంగమార్తాండ సినిమాను భ్రష్టుపట్టించిన వైనం చూశాం… ఇక సినిమాలు తగ్గిస్తానని అంటున్నాడు… ప్రేక్షకులే తగ్గించారు కదా, ఈ కవరింగు దేనికి..?
మోడీ ప్రధాని కావడం నాకిష్టం లేదు అట… నీకిష్టం లేకపోతే ఏమిటట..? అసలు నువ్వెవరు..? ప్రజానీకానికి నీ కంట్రిబ్యూషన్ ఏమిటి..? నిజానికి ఇలాంటి స్థాయితప్పిన వ్యాఖ్యలను పబ్లిష్ చేసేవాడికి డ్యాష్ డ్యాష్ ఉండాలి… ఎస్, మోడీని విమర్శించాలంటే స్థాయి అవసరమా అనేవాళ్లు కూడా ఉంటారు… అందుకే ఈ వార్తల్ని వేసేవాడికి డ్యాష్ డ్యాష్ ఉండాలనేది…
సేమ్, కేసీయార్ మీద ఇష్టారాజ్యంగా ఎవరుపడితే వాళ్లు వ్యాఖ్యలు చేయడం కూడా సరికాదు… ఒక రేవంతుడో, ఒక బండి సంజయో అయితే పర్లేదు, వాళ్లు ప్రత్యర్థి పార్టీలకు రాష్ట్ర శాఖల అధ్యక్షులు కాబట్టి… ఏ యువజన కాంగ్రెస్ నాయకుడో, ఏ ఏబీవీపీ నాయకుడో కేసీయార్‌ను తిట్టేస్తే అవి అచ్చుకు అర్హం కాదు… పోనీ, రీడర్‌షిప్ కోణంలో చూసినా ప్రకాష్‌రాజ్ దానికీ యూజ్ కాడు కదా… మరెందుకీ వార్తల్ని ప్రముఖంగా పబ్లిష్ చేస్తున్నట్టు..?!
కొన్నాళ్లు కేసీయార్ తనను వెంటేసుకుని తిరిగాడు… నెత్తిన పెట్టుకున్నాడు… తరువాత ఝాడించి — … ! రంగమార్తాండ సినిమాలో బ్రహ్మానందం ఇదే ప్రకాష్‌రాజ్‌ను గట్టిగా ఒకటి పీకి… రేయ్ … నువ్వొక చెత్త నటుడివిరా … మనిషిగా అంతకంటే నీచుడివి… అంటాడు. పర్లేదు, ఆ వ్యాఖ్యలో నిజానిజాల గురించి చెప్పడం లేదు… ప్రకాష్‌రాజ్‌ను అంత మాట అనాలంటే బ్రహ్మానందం దీటైన స్థాయి అని చెప్పుకోవడం…!!
Share this Article