ఒకావిడ తల్లి పాత్రలు వేస్తుంటుంది… ఒళ్లూ, కాళ్లూ డ్యాష్ డ్యాష్ బాగా కనిపించేలా డాన్సులు చేస్తూ ఓ వీడియో ఇన్‌స్టాలో పెడుతుంది… హేమిటీ అంటే, నేను ఇంకా ఫిట్టేనోయ్, చూడు కాస్త అని నిర్మాతలకు గట్రా ఓ మెసేజ్… మరొకావిడ పెళ్లీడుకొచ్చిన తన బిడ్డతో కలిసి షార్ట్స్‌లో డాన్సులు చేస్తూ, ఇన్‌స్టాలో పెట్టేస్తూ, నేను కూడా మస్తు ఫిట్టుగా ఉన్నానోయ్ అని సంకేతాలు పంపిస్తుంటుంది… ఎవరి వృత్తిగతం వాళ్లది… ఓ సింగర్ ఎదిగిన పిల్లల సాక్షిగా రెండో పెళ్లి చేసుకుంటుంది… అది ఆమె వ్యక్తిగతం… తిట్టేవాడు ఎప్పుడూ తిడతాడు, వాళ్లను పట్టించుకుంటే కుదరదు… అలాంటోళ్లను పక్కకు తోసేస్తూ సాగాలి… అంతే… సేమ్, ఈ కథ ఇంకా విభిన్నం… ఇది కేరళలోని రజినీ చాంది అనే డెబ్బయ్ ఏళ్ల ఓ లేట్ వయస్సు సెలబ్రిటీ కథ…
ఈమే రజినీ చాంది… కొచ్చిలో పుట్టింది… డిగ్రీ దాకా చదువుకుంది అప్పట్లోనే… తండ్రి స్కూల్ హెడ్ మాస్టర్, అయిదుగురు పిల్లల్లో ఈమె ఒకతి… తన అక్కలు నన్స్‌గా మారిపోయారు… 1970లోనే వర్గీస్ చాంది అనే ఓ స్టాక్ మార్కెట్ బ్రోకర్‌ను పెళ్లి చేసుకుంది… అంటే యాభై ఏళ్ల క్రితం… ఓ బిడ్డ… సీనా థామస్… పెళ్లి చేసుకుని, అమెరికా వెళ్లిపోయి, సెటిల్ అయిపోయింది అక్కడే… ఈమె పెళ్లయ్యాక 21 ఏళ్లపాటు భర్తతో కలిసి ముంబైలో ఉండేది… తరువాత కేరళ వచ్చేశాక తన ఫిట్నెస్ కాపాడుకోవడం కోసం చాలా కష్టపడేది… బ్యాడ్మింటన్ ప్లేయర్, డ్రమ్స్ బాగా వాయించగలదు… రోజూ పొద్దున్నే జిమ్ వెళ్తుంది… అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇష్టపడుతుంది… మంచు కొండల్లో స్కీయింగ్ చేస్తుంది… ఏరోజుకారోజు యంగ్ అండ్ ఎనర్జిటిక్… నాన్ వెజ్, వైన్ లవర్…
Ads
కొన్నాళ్లు రియల్ ఎస్టేట్ ఫీల్డులో పనిచేసింది… కొన్నాళ్లు ట్యూషన్స్ చెప్పేది… కొన్నిరోజులు స్టిచింగ్ సెంటర్… ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకం కావాలి తనకు… 2016లో ఒరు ముత్తాసి గాథ అనే సినిమాలో ఓ నిర్మాత చాన్స్ ఇచ్చాడు… అప్పటికే 65 ఏళ్లు… సో వాట్..? ఆమెకు వయస్సు అనేది ఓ అంకె మాత్రమే… ఎంచక్కా నటించింది, మస్తు పేరొచ్చింది… గాంధీనగరిల్ ఉన్నియార్చ అని మరో సినిమా… యాక్టింగును ఎంజాయ్ చేస్తోంది… హైపర్ యాక్టివ్ బామ్మ కదా, ఊరుకోదు కదా… గత ఏడాది మొదట్లోనే మళయాళం బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది… హహహ… మన గంగవ్వ అడుగుపెట్టలేదా ఏం..?
ఇప్పుడు సమస్య ఏమొచ్చిందయ్యా అంటే..? ఓ ఫోటోషూట్ చేసింది… అదిరిపోయే జీన్స్ వేసుకుని, సగటు హీరోయిన్లు పెట్టే ఫోజులతో కనిపిస్తున్న ఈ ఫోటోలు చూసి సహజంగానే సంప్రదాయవాదులకు చిర్రెత్తింది… అలాంటోళ్లు కూడా ఉంటారు కదా… ఇక ట్రోలింగు మొదలుపెట్టారు… కొందరైతే ‘‘నువ్వింకా బతికే ఉన్నావా’’ అనడిగారు… దారుణం… ఈ వయసులో నీకు ఈ వేషాలు అవసరమా అంటారు ఇంకొందరు… ఒరే నాయనా… నా జీవితం, నా ఇష్టమొచ్చినట్టు బతికితే నీకేం నష్టం..? ఫోటోలు దిగినా తప్పేనా అని వివరణ ఇచ్చింది… ముసలామె అందంగా కనిపిస్తే ఓర్వలేవా అనడిగింది… ఊహూఁ… ట్రోలింగ్ సాగుతూనే ఉంది… మొన్నమొన్నటిదాకా మంచి సంప్రదాయ వస్త్రధారణతో కనిపించేదానివి, నీకు ఇదేం రోగం అంటారు కొందరు… నిజానికి ఆమెకు మోడరన్ డ్రెస్సింగు కొత్తేమీ కాదు… కాకపోతే ట్రోలర్లకు తాజాగా ఆమె దొరికింది, అంతే… లాక్ డౌన్ తరువాత అందరికీ వేషాలు తగ్గాయి, చాలామంది కొత్త ఫోటోషూట్లు చేయించి సోషల్ మీడియాలో పెడుతున్నారు… ఆమె కూడా అదే చేసింది, అంతే, అదే ఆమె చేసిన తప్పు… అవునూ, అరవై దాటితే మోడరన్ డ్రెస్సులకు పనికిరారా ఆడవాళ్లు..? ఆమె ఫోటోల్లో అశ్లీలమో, అసభ్యమో ఏముంది తిట్టడానికి..? థూమీబచె..!!
Share this Article