లబ్ధిప్రతిష్టులు… రంగమార్తాండ దీసిన కృష్ణవంశీ గానీ, శాకుంతలం తీసిన గుణశేఖర్ గానీ ఔట్ డేటెడ్… రంగమార్తాండతో ప్రూవయిన ఈ సత్యమే శాకుంతలంతోనూ నిరూపితమైంది…. మేం ప్రీమియర్లు వేస్తాం, మౌత్ టాక్‌తో దునియా దున్నేస్తాం అనేవి భ్రమలు… సినిమాలో దమ్ముండాలి… అది లేనప్పుడు, ఎవరెన్ని జాకీలు పెట్టి పైకిలేపినా సినిమా ఆడదు…
శాకుంతలం రిలీజు చాన్నాళ్లుగా వాయిదా పడుతుందీ అంటేనే అందులో సరుకు లేదని లెక్క… దాని నాసిరకం ఔట్‌పుట్ పై బయ్యర్లకు అవగాహన ఉంది కాబట్టే, నిర్మాత దిల్ రాజు అయినా సరే, ఆ సినిమా జోలికి రావడానికి భయపడ్డారు… మరి బయ్యర్ డబ్బు పెట్టేవాడు, రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటాడు కదా… ఫ్రీ షోలు వేసి జనానికి చూపించినా సరే, కనీసం రంగమార్తాండకు వచ్చిన భజన రివ్యూలు కూడా సోషల్ మీడియాలో శాకుంతలం సినిమాకు రాలేదు… మొహమాటం రివ్యూలు కూడా లేవు… సినిమాపై ఒక్క ప్రశంస రాసినా అది తీవ్ర నేరమనే ఆత్మచింతనే దానికి కారణం…
శాకుంతలం ప్రమోషన్ ప్రెస్‌మీట్‌లో విలేకరుల అడ్డదిడ్డపు ప్రశ్నలు జర్నలిజానికే మచ్చలు అనేది పక్కన పెడితే… ఏడుస్తూ, చీదుతూ, అనారోగ్యాన్ని బయటపెట్టుకుంటూ సమంత ‘సానుభూతి’ని గెయిన్ చేయడానికి ప్రయత్నించడం బాగాలేదు… ప్రెస్‌మీట్ పెట్టాలని ఎవరు అడిగారు..? ఆమెకు సిటడెల్ షూటింగ్ ఉంది కాబట్టి ముంబైలో ప్రమోషన్ మీట్ పెట్టాం, ఆమెకు ఖుషి సినిమా షూటింగ్ ఉంది కాబట్టి చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టాం, సిక్‌గా ఉన్నా సరే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాం అంటూ దిల్ రాజు ఏవేవో కథలు వినిపించాడు మొన్న…
Ads
ఆమె యాక్టివ్‌గా తిరగలేకపోతోంది కాబట్టి, వాటిని పరిమితం చేసుకుని, ప్రీమియర్ షోల ఎత్తుగడ వేశారు… అదీ హైప్ క్రియేట్ చేయలేకపోయింది… ఏమాత్రం పాజిటివ్ బజ్ రాలేదు… అన్నింటికీ మించి పాన్ ఇండియా సినిమా అన్నప్పుడు దాన్ని మార్కెటింగ్ చేసుకునే విధానం జోరుగా ఉండాలి… శాకుంతలం విషయంలో అదేమీ లేదు… సినిమా నాణ్యత మీద దిల్ రాజుకూ ఓ ఐడియా ఉంది కదా, ఇంకా ఈ మార్కెటింగ్ ఖర్చు దేనికిలే అనుకుని ఉంటాడు…
అసలు శకుంతల అంటేనే అపూర్వమైన అందగత్తె… శృంగార నాయిక… అంతటి దుష్యంతుడే మరులు గొని అప్పటికప్పుడు గాంధర్వ వివాహం చేసుకున్న అందం ఆమెది… వాళ్లిద్దరి లవ్ స్టోరీ తరాలుగా చదువుతున్నాం… తీరా సినిమా చూస్తే ఆమె రోగపీడితురాలిగా కనిపిస్తే ప్రేక్షకుడికి ఒక షాక్… పైగా ఇలాంటి కథలకు ప్రధాన పాత్రధారుల డబ్బింగ్ బాగుండాలి… సమంత ఈ విషయంలో కూడా ఫెయిల్… బహుశా ఆమె అనారోగ్యం ప్రభావం ఆమెపై బాగానే ఉన్నట్టుంది…
ఈ సినిమాకు ప్రధానంగా బలంగా ఉండాల్సింది… దుష్యంతుడు, శకుంతల నడుమ ప్రేమ… కథలో దానికి ప్రయారిటీ ఇవ్వలేదు సరికదా, సమంత-దేవ్ మోహన్ నడుమ కెమిస్ట్రీ కూడా లేదు… సమంత పక్కన అస్సలు ఆనలేదు… దేవ్ మంచి అందగాడు… కానీ నటనలో పూర్… మోహన్‌బాబు వర్తమానంలో ఏ సినిమాకైనా మైనసే తప్ప ప్లస్ కాలేడు ఇక… పైగా సీన్ల సాగదీత సరేసరి… మేనక అంటే రాజర్షులు, బ్రహ్మర్షులే సన్యాసాన్ని వదిలేసేంత అందగత్తె… ఫాఫం, ఈ సినిమాలో మేనకగా మధుబాల అస్సలు సూట్ కాలేదు…
ఆమధ్య త్రీడీ పనుల కోసం సినిమా రిలీజ్ అన్నారు… పరమ నాసిరకం త్రీడీ నాణ్యత… దేవ్ మోహన్ ప్లేసులో ఎవరైనా పాపులర్ నటుడిని తీసుకుంటే బాగుండేది… హిందీ మార్కెట్ కోసం ప్రయాసలో… సేమ్, రాధేశ్యామ్ సినిమాలోలాగా హిందీ పాటలు రాయించుకుని, హిందీలోనే ట్యూన్లు చేయించుకుని, తెలుగులోకి డబ్ చేసుకున్నట్టు కృతకంగా ఉన్నాయి పాటలు… ఇలాంటి సినిమాలకు పాటలే ప్రాణమవ్వాలి… అదీ లోపించింది…
ఈ సినిమాలో ఏకైక ప్లస్ పాయింట్… అల్లు అర్హ… ముద్దుగా ఉంది, తెలుగును స్పష్టంగా పలికింది… కొన్నిచోట్ల బాగా నటించింది… శకుంతల- దుష్యంతుల సంతానం పాత్ర… ఈ అభిమానంతో బన్నీ ఫ్యాన్స్, అల్లు క్యాంపు కాస్త పూనుకుంటే సినిమా నాలుగురోజులు థియేటర్‌లో ఉంటుంది… లేకపోతే అంతేసంగతులు… మన భారతీయ పురాతన సాహిత్యంలో అభిజ్ఞాన శాకుంతలం బెస్ట్… దాన్ని భ్రష్టుపట్టించిన దర్శకుడిగా గుణశేఖర్ చెడ్డపేరు తెచ్చుకున్నాడు…!
Share this Article