ఈమధ్య ఏదో ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నట్టుగా దిగువ స్థాయి ప్రజాప్రతినిధి మొదలుకొని కేటీయార్ దాకా… ఏం వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్లకే తెలియని స్థితిలో ఉన్న విషయం గమనిస్తున్నదే… ప్రత్యేకించి విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బిడ్లలో పాల్గొనడానికి కేసీయార్ ఆసక్తి కనబర్చాడో అప్పటి నుంచి ఇక ఏపీ ప్రభుత్వం మీద తెలంగాణ మంత్రుల విసుర్లు మొదలయ్యాయి… అబద్ధాలు ప్రచారంలోకి తీసుకురావడంలో నాయకులు పోటీపడుతున్నారు…
సరే, రాజకీయాల్లో సహజమే అనుకుందాం… అబద్ధాలకు నిజాలు ముసుగులు వేసి, జనం కళ్లకు గంతలు కట్టడమే రాజకీయాల్లో ప్రధాన అర్హత అయిపోయింది కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారని అనుకుందాం… నిజానికి విశాఖ ప్టీల్ ప్లాంట్ పిలిచినవి ప్రైవేటీకరణలో భాగంగా అమ్మకపు బిడ్లు కావు, జస్ట్, బొగ్గు సరఫరా, దానికి బదులుగా స్టీల్ స్వీకరణకు ‘‘ఆసక్తి వ్యక్తీకరణ’’… వాస్తవానికి ప్రభుత్వం గానీ, ప్రభుత్వరంగ సంస్థ గానీ ఈ బిడ్లలో పాల్గొనడానికి వీలే లేదు…
సో, ఏ కోణంలో చూసినా కేసీయార్ ఈ బిడ్లలో ఎంట్రీ అయ్యే చాన్సే లేదు… అది కేసీయార్‌కు కూడా తెలుసు… కానీ బహుముఖ ప్రయోజనాల కోసం స్టీల్ ప్లాంట్ రక్షకుడిగా తెరపై తనను కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి విశ్వ, విఫల ప్రయత్నం చేస్తున్నాడు… అది పొలిటికల్ గడుసుదనం… ఇదంతా సరే, కానీ సీబీఐ వంటి ఓ జాతీయ దర్యాప్తు సంస్థకు జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసి…, జగన్, గాలి వంటి సీరియస్, ఫేమస్ కేసుల్ని డీల్ చేసిన జెడి లక్ష్మినారాయణ వంటి మాజీ అధికారుల వ్యాఖ్యలు అత్యంత ఆశ్చర్యంగా వినిపించాయి…
Ads
ఇలాంటివాళ్లా పెద్ద పెద్ద కేసుల్ని దర్యాప్తు చేసింది అనిపించింది… కేసీయార్ వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగిందంటూ లక్ష్మినారాయణ ధన్యవాదాలు చెప్పడం తనపై సానుభూతిని చూపించదగిన అంశమే… అసలు కేంద్ర మంత్రి ఏం అన్నాడో సరిగ్గా తెలుసుకోలేదు… కేసీయార్ పరిమితులు ఏమిటో తెలుసుకోలేదు… కేసీయార్ ఆశించే ప్రయోజనాలు ఏమిటో అర్థం చేసుకోలేదు.. ఒక మాట అనేముందు వెనకా ముందూ ఆలోచించాలనే బేసిక్ పాయింట్ విస్మరించాడు… జస్ట్, అలవోకగా, అనాలోచితంగా ఇదంతా కేసీయార్ పుణ్యమే అంటూ వ్యాఖ్యానించాడు…
ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రెటరీ, పాలనలో బాగా అనుభవమున్న రమాకాంత్‌రెడ్డి అప్పట్లో ఓ మాటన్నాడు… జగన్ కేసుల్ని దర్యాప్తు చేసిన అధికారికి అసలు బిజినెస్ రూల్సే తెలియవని…!! జేడీ లక్ష్మినారాయణ తాజా వ్యాఖ్యలు మరోసారి రమాకాంత్‌రెడ్డి వ్యాఖ్యల్ని గుర్తుచేస్తున్నాయి… కేంద్ర మంత్రి ఏమన్నాడో సరిగ్గా తెలియకుండా, ప్రభుత్వ విధానం సరిగ్గా తెలియకుండా ఎవరో ఏదో రాసేస్తే… ఇక దాన్ని పట్టుకుని కేసీయార్ అపూర్వ విజయం అంటూ బీఆర్ఎస్ ఓన్ చేసుకుంది… తీరా అసలు నిజాలు తెలిసి, షాక్‌తో తెల్లమొహం వేసింది…
కేంద్ర మంత్రి నిన్న మధ్యాహ్నం విశాఖ కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చల్లోనే స్పష్టం చేశాడు… ప్రభుత్వం ఒక నిర్ణయం తీసేసుకుంది, ఇక ఈ దశలో ప్రైవేటీకరణను ఆపలేం అని చెప్పాడు… ఈరోజు అదే మినిస్ట్రీ క్లారిటీ ఇష్యూ చేసింది… ప్రైవేటీకరణ ఆగబోదని చెప్పింది… మరి నిన్న అనాలోచితంగా వ్యాఖ్యలు చేసిన వాళ్లందరూ మొహాలు ఎక్కడ పెట్టుకోవాలి…?
దాన్ని డైవర్ట్ చేయడానికి బైలదిల్లా గనుల్ని ఆదానీకి కట్టబెడుతున్నారు, అందుకే సబ్జెక్టు డైవర్ట్ చేస్తున్నారని ఉల్టా దాడి మొదలుపెట్టబోయారు, అది మరింత హాస్యాస్పదం… బైలదిల్లా గనులు ఎన్ఎండీసీ సంస్థవి… అక్కడ మైనింగ్ పనిని ఆదానీకి ఇస్తున్నారు… ఆ బిడ్లలో ఆదానీ ఎల్ వన్… హేమిటో… ఈడీ కేసులో కవిత ఇరుక్కున్నాక బీఆర్ఎస్ ప్రముఖులు కూడా ఏవేవో మాట్లాడేస్తున్నారు… చివరకు హరీష్‌రావు కూడా…!!
Share this Article