బలమైన కేంద్రం… బలహీనమైన రాష్ట్రాలు……. ఈ ఫెడరల్ స్పూర్తి అనేది దేశాన్ని బలహీనపరిచేదే తప్ప మన అవసరాల్ని, సవాళ్లను పరిష్కరించేది కాదు.., ఇంకా రాబోయే రోజుల్లో మనకు థ్రెట్స్ పెరగనున్నాయి… ఈ స్థితిలో కీలకమైన రంగాల్ని మరింతగా కేంద్రం గుప్పిట్లోకి తీసుకోవడం… మన ప్రజాస్వామిక వాతావరణాన్ని, అధికారాలను మరింత కేంద్రీకృతం చేయడం…. అవును, బీజేపీ ప్రభుత్వం ఆ దిశలోనే వేగంగా అడుగులు వేస్తోంది… ఇంకా చాలా బిల్లులపై కసరత్తు సాగుతోంది… తాజాగా తెరపైకి వచ్చిన బిల్లు ‘‘ఇండియన్ పోర్ట్స్ బిల్లు’’… ఇది గనుక అమల్లోకి వస్తే దేశంలోని అన్ని పోర్టుల నిర్వహణ కేంద్రం చేతుల్లోకి పోతుంది… మరీ గుంభనం, మార్మికం ఎందుకులే గానీ… ఆదానీ గుప్పిట్లోకి పోతుంది… ఇలాంటివి ఇంకా చాలా వస్తాయి… రాజకీయ, ఆర్థిక, పాలనపరమైన చాలా అంశాల్లో… కాస్త వివరంగా చెప్పాలంటే…
ఒక్కసారి వరుసగా క్రోడీకరించుకొండి… జీఎస్టీ వచ్చాక ఆర్థిక వనరుల సమీకరణలో రాష్ట్రాలకు ఏ స్వేచ్చా లేకుండా పోయింది… కొత్త విద్యుత్తు చట్టం ప్రకారం లోడ్ డిస్పాచ్ నుంచి ప్రైవేటు కరెంటు కొనుగోళ్ల దాకా కేంద్రం గుప్పిట్లోకి వెళ్లిపోతున్నది అధికారం… త్వరలో కొత్తజలవిధానం వచ్చి, శాశ్వత ట్రిబ్యునళ్లు ఏర్పడబోతున్నాయి… అంతర్రాష్ట్ర జలవివాదాలపై వాటి పెత్తనం పెరగనుంది… కొత్త ప్రాజెక్టుల నిర్మాణమే కాదు, అవసరమైతే ప్రాజెక్టుల నిర్వహణ రాష్టాల నుంచి చేజారడం ఖాయం… వన్ నేషన్- వన్ రేషన్ వంటి పథకాలతో దేశాన్ని ఒకే పంపిణీ వ్యవస్థ కిందకు తీసుకురానున్నారు… రాష్ట్రాల సొంత స్కీములు ఆపేసి, ఆయుష్మాన్ భారత్ వంటి స్కీంలలో కలిపేయమంటున్నారు… వృత్తి విద్య ప్రవేశాలకు సంబంధించి జాతీయ స్థాయిలో కామన్ ఎంట్రన్సులు ఉంటాయి ఇకపై… కార్మిక చట్టాలు రాష్ట్రాల చేజారాయి… ఇవన్నీ ఒక్కొక్కటీ వివరంగా చెప్పుకుందాం… కానీ పోర్టుల విషయానికొస్తే…
Ads
మారిటైం పోర్టు రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటవుతుంది… వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్లు, అప్పిలేట్ ట్రిబ్యునళ్లు ఏర్పడతాయి… వీటి అవసరాన్ని జస్టిఫై చేయడం ఈజీ… 1) పోర్టులపై ఓ సమగ్ర, సమన్వయ నిర్వహణ అవసరం… లేకపోతే రాబోయే రోజుల్లో రక్షణపరమైన థ్రెట్స్ పెరుగుతాయి… 2) ప్రైవేటు రంగం పెట్టుబడులతో ఇంకా కొత్త పోర్టుల అభివృద్ధి సాగనుంది… అన్నింటికీ కలిపి ఓ సమగ్ర నిర్వహణ ప్రణాళిక అవసరం… ఆల్రెడీ కేంద్రం ఈ బిల్లు పట్ల సానుకూలత కోసం రాష్ట్రాలకు లేఖలు రాస్తోంది… ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సమాధానాన్ని కూడా పంపించింది…
నిజానికి పైపైన అన్ని పార్టీలూ మనది ఫెడరల్ స్పూర్తి కలిగిన అధికార వ్యవస్థ అని చెప్పుకోవడమే గానీ… అసలైన అధికారం కేంద్రానిదే… కేంద్రం ఇప్పటికే బలంగా ఉంది… రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు ఉత్త జుజుబీ టైపు… ఇంకా అధికారాల్ని కేంద్రీకృతం చేసే బిల్లులు వచ్చేకొద్దీ… కేంద్రం ఇంకా బలంగా తయారై… రాను రాను రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేసే యంత్రాంగాలుగా మారిపోతాయి… ఇప్పుడు మన పంచాయతీరాజ్ వ్యవస్థ దురవస్థను చూస్తున్నాం కదా, అలాగన్నమాట..! రీసెంట్రలైజేషన్, సెంట్రలైజేషన్ చట్టాలపై రాబోయే రోజుల్లో ఇంకా చర్చ తప్పదు… ప్రాంతీయ పార్టీలు కుల పార్టీలై, కుటుంబ పార్టీలై, అవినీతి పార్టీలై… ఏకంగా జాతీయ పార్టీలకే డబ్బులిచ్చి ఎన్నికల్ని ప్రభావితం చేసే ఆర్థిక స్థాయికి పెరుగుతున్నయ్… వాటి ప్రభావాన్ని తగ్గిస్తేనే బీజేపీకి దీర్ఘకాలిక ప్రాబల్యం వస్తుంది… అర్థమైంది కదా, అధికారాల కేంద్రీకరణ ఎందుకు వేగం పుంజుకున్నదో…!!
Share this Article