తొమ్మిదో తరగతి వరకు చదువుకునే పిల్లలకు పరీక్షలు అవుతున్నాయి కదా. ఇప్పటి రోజులు బడ్డువి. మా అప్పుడు మేం బహు చదివేవాళ్ళం. ఇప్పటి వాళ్ళ మాదిరిగా కాపీలు కొట్టేవాళ్ల మసలే కాదు అని అంటాం కానీ నిజాయితీగా చెప్పాలంటే మనం కూడా సంప్రదాయ పద్దతుల్లో కాపీలు కొట్టినవాళ్ళమే… లాగు పట్టేను బ్లేడుతో కొద్దిగా కోసి, చిట్టీలు మలిచి దాచేవాళ్ళం.
అట్లనే అంగీ కాలర్ మధ్యలో, చెప్పులు కోసి చీటీలు దాచేవాల్లం. అవన్నీ అందరికీ ఎరుకున్న జాగలే.. రేపటి పరీక్ష కోసం చిన్నకాగితాల మీద రామకోటి రాసినంత చిన్నగా జవాబులు రాసుకొని పోయేది. నిజంగా అప్పుడు బడిలో పాఠం వినుడే తప్ప.. ఇంట్ల చదువుడెక్కడిది. పోద్దెక్కినాక్క లేశి, బడికి పోయి సాయంత్రం వచ్చి వాగులో ఉప్పు పందర, ఉప్పు తెచ్చుడు, కబడ్డీ , ఆలెంక ఈ లెంక ఆడుడు, బేతోరి బావుల్లో ఈత కొడుతానికే సరిపాయే.
సదువు లేదు. మన్ను లేదు. ఇగ పరీక్ష హాల్లో ముందట కూసున్న వాడి వీపులో మన పరీక్ష అట్టతో పొడుసుడు.. వాడు కసురుకొనుడు.. అబ్బా ఒక్కటి కూడా రాయలేదు జెర సూపియ్యవా అని బతిలాడుడు… నేను రాయొద్దా అనుడు. అన్నీ గుసగుస లే…
Ads
ఇగ ఒక సారు ఉండేది. ఆయనకు మెల్లకన్ను. ఇంకా అద్దాలు పెట్టుకునేది. ఆయన వస్తె మన పని ఖతం అనుకునేది. ఆయన ఎక్కడ చూస్తున్నాడో నరమానవుడికి తెలువకపోయేది. మధ్యమధ్య అరేయ్.. ఎటు చూస్తున్నానని అనేవాడు. నన్నే చూస్తున్నాడు. నన్నే అంటున్నడు అనుకునే వాళ్ళం. చివరి పావుగంటలో చిట్టీలన్నీ రాసేవాల్లం. ఆన్సర్ పేపర్ ఇచ్చే తప్పుడు ఆగంలో ఒక్కోసారి నకల్ చిట్టీ కూడా పేపర్ల మధ్యలో కుట్టి ఇచ్చి, రిజల్ట్ చెప్పేనాడు సార్తో సావుదెబ్బలు తినేది…
(ఇది Ramesh Sharma Vuppala ఫేస్ బుక్ వాల్ నుంచి సంగ్రహించబడింది…)
Share this Article