పార్ధసారధి పోట్లూరి …….. హింసని నమ్ముకున్నవాడు చివరికి హింసకే బలవుతాడు ! లవలేష్ తివారీ, సన్నీ,అరుణ్ మౌర్య అనే ముగ్గురు కలిసి అతిక్ అహ్మద్ అతని తమ్ముడు అష్రాఫ్ ని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తలమీదకి బులెట్ల వర్షం కురిపించారు ! అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రాఫ్ సంఘటనా స్థలంలోనే చనిపోయారు !
యావజ్జీవ జైలు శిక్ష పడ్డ అతిక్ అహ్మద్ ని మరియు అష్రాఫ్ ని వైద్య పరీక్షల నిమిత్తం ప్రయాగ్ రాజ్ లోని MLN మెడికల్ కాలేజీ కి తీసుకొచ్చారు పోలీసులు గట్టి బందోబస్తు మధ్య. భద్రతా రీత్యా రాత్రి పూట హాస్పిటల్ కి తీసుకొచ్చారు పోలీసులు. సెంట్రల్ జైలుకి తరలించే ముందు శిక్ష పడ్డ నేరస్తులకి వైద్య పరీక్షలు చేయడం తప్పని సరి!
చుట్టూ పోలీసులు ఉన్నా మీడియా వారు అతిక్ అహ్మద్, అష్రాఫ్ ని ప్రశ్నలు వేస్తున్నారు కానీ పోలీసులు ఆగకుండా నడిపించుకుంటూ పోతూనే ఉన్న తరుణంలో… విలేఖరుల రూపంలో వచ్చిన లవలేష్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్య లు వెనక నుండి పాయింట్ బ్లాంక్ లో పిస్టల్ ని గురి పెట్టి తల మీద కాల్చారు ! ఒక వైపు పోలీసులు కాల్పులు జరుపుతున్న వారిని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నా ఒకరి తరువాత ఇంకొకరు కాల్పులు జరిపారు.
Ads
లవలేష్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్య లు అతిక్ అహ్మద్ ని కాలుస్తున్నప్పుడు జై శ్రీరామ్ అనే నినాదాలు చేశారు. అక్కడే ఉన్న ఒక విలేఖరి పిస్టల్ బుల్లెట్ రాసుకుంటూ పోవడంతో గాయపడగా కాల్పులు జరుపుతున్న వారిని వారించే ప్రయత్నంలో ఒక కానిస్టేబుల్ కూడా గాయపడ్డాడు.
పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు! పోలీసుల ప్రాధమిక విచారణలో అతిక్ అహ్మద్ ని చంపితే మాకు పబ్లిసిటీ వస్తుంది అని చంపేసాము అన్నట్లుగా తెలుస్తున్నది !
చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరకాల్సి ఉంది !
1. లవలేష్ తివారీ, సన్నీ,అరుణ్ మౌర్య ల దగ్గర నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్న పిస్టల్ Made in Turkey ది !
2. పంజాబ్ లో కానీ, కాశ్మీర్ సరిహద్దుల్లో కానీ చొరబాటు దారుల దగ్గర దొరికిన ఆయుధాలలో పిస్టల్, రివాల్వర్, హాండ్ గ్రనేడ్ లాంటివి Made in China వి దొరికాయి ఇప్పటివరకు!
3. అతిక్ అహ్మద్ హత్య కి వాడిన పిస్టల్ మాత్రం టర్కీ దేశంలో తయారు అయినది !
4. పోలీసులు ఇంతవరకు బయటపెట్టక పోయినా చాలా కాలం నుండి అతిక్ అహ్మద్ కి పాకిస్థాన్ గూఢచార సంస్థ ISI తో మరియు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా తో సంబంధాలు ఉన్నాయి.
5. లవలేష్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్య ల దగ్గర దొరికిన పిస్టల్ టర్కీ ది అవడం వలన అతిక్ అహ్మద్ హత్య ఐఎస్ఐ పనే అని అర్ధం అవుతున్నది !
6. ముంబై దాడుల సందర్భంగా అజ్మల్ కసబ్ కూడా చేతికి కాశీ దారం కట్టుకొని కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే !
7. అలాగే నిన్న రాత్రి లవలేష్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్య లు కూడా కాల్పులు జరిపే ముందు జై శ్రీరామ్ అని పెద్దగా అరుస్తూ కాల్పులు జరిపారు. రెండు సంఘటనలకి సారూప్యం ఉంది !
8. గత 15 రోజుల నుండి అతిక్ అహ్మద్ నన్ను చంపేస్తారు. నేను ఉత్తర ప్రదేశ్ వెళ్ళను, గుజరాత్ లోనే ఉంటాను, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించండి అంటూ పోలీసులని వేడుకుంటూ వచ్చాడు. గుజరాత్ లోని సబర్మతి జైలులో నాకు బాగుంది, నేను కనుక ఉత్తరప్రదేశ్ వెళితే నన్ను చంపేస్తారు అంటుంటే ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఎనకౌంటర్ లో చంపేస్తారు అనే భయంతో అంటున్నాడు కాబోలు అనుకున్నారు అంతా !
9. కానీ గుజరాత్ నుండి పోలీసు వాహనాలలోనే ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ రాజ్ కి తీసుకొచ్చారు పోలీసులు కానీ ఎలాంటి ఎనకౌంటర్ జరగలేదు. కోర్టు విచారణ జరిగింది యావజ్జీవ కారాగార శిక్ష పడింది !
10. అతిక్ అహ్మద్ కి తెలుసు తనని ఉత్తర ప్రదేశ్ పోలీసులు కాదు, హత్య చేసేది వేరే ఎవరో అని ! కానీ అసలు విషయం ఏమిటో బయటికి చెప్పలేకపోయాడు !
11. యావజ్జీవ కారాగార శిక్ష పడినా వేరే కేసుల్లో అతిక్ అహ్మద్ ని విచారించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 100 కి పైగా క్రిమినల్ కేసులు నమోదు అయి ఉన్నాయి అతిక్ అహ్మెద్, అష్రాఫ్ ల మీద !
12. ఇంకా విచారించాల్సిన కేసులు ఉన్నాయి కాబట్టి వాటి విచారణ సమయంలో పెద్ద తలకాయల పేర్లు బయటపెడతాడు అనే భయంతో సదరు పెద్ద తలకాయలు అతిక్ అహ్మద్ ని హత్య చేయించి ఉండవచ్చు !
13. కొంతమంది రాజకీయ నాయకుల బినామీ ఆస్తులు పాకిస్థాన్ లో ఉన్నాయి. వాటిని అతిక్ అహ్మద్ ద్వారా ISI సహకారంతో కొన్నట్లు తెలుస్తున్నది.
14. ఉత్తర ప్రదేశ్ లో ఏదన్నా విధ్వంసం సృష్టించాలన్నా లేదా ఎన్నికల వేళ నిధులు అవసరం అయిన పక్షంలో పాకిస్థాన్ లో ఉన్న ఆస్తులని అమ్మేసి, ఆ డబ్బుని హవాలా ద్వారా దుబాయ్ కి పంపించి అక్కడ నుండి భారత్ కి పంపేలా ఏర్పాట్లు చేసుకున్నారు ! వాటి వివరాలు అతిక్ అహ్మద్ కి మాత్రమే తెలుసు. వాటిని బయటపెడితే కొంతమంది రాజకీయ జీవితం శాశ్వతంగా ముగుస్తుంది !
15. ఒక్క పాకిస్థాన్ లో మాత్రమే కాదు టర్కీ, ఇతర గల్ఫ్ దేశాలలో కూడా బినామీ ఆస్తులు ఉన్నాయి కొందరికి. వాటిని డీల్ చేసింది అతిక్ అహ్మద్ ఒక్కడే కాదు అతని కొడుకు అసద్ మరియు సోదరుడు అయిన అష్రాఫ్ లు. ఇప్పుడు అందరూ చనిపోయారు కాబట్టి వివరాలు బయటపడే అవకాశం లేదు !
16. హంతకులు ప్లాన్ A, Plan B అనే రెండు ఆప్షన్లు పెట్టుకొని మరీ అతిక్ అహ్మద్ ని హత్య చేయడానికి వచ్చారు కానీ ప్లాన్ A వర్క్ అవుట్ అయ్యింది !
17. అతిక్ అహ్మద్ హత్య జరగగానే BBC వారు ఆ వార్తకి పెట్టిన హెడ్ లైన్ ఏమిటో తెలుసా ? Atiq Ahmed Former Indian MP and His Brother shot dead on live TV! ఈ హెడ్ లైన్ చదవగానే చదువరి ఎలా అర్ధం చేసుకుంటాడు విదేశాలలో ? ఓహో ! భారత దేశంలో లా మేకర్స్ కి కూడా భద్రత లేకుండా పోయింది అన్నమాట ! సదరు లింకు మీద క్లిక్ చేసి ఆ వార్త మొత్తం చదివే ఓపిక ఎవరికి ఉంటుంది కానీ బిబిసి కి కావాల్సిన సందేశం ప్రచారం అవుతుంది. ఇతర మీడియా సంస్థ Gangster turned plotician shot dead అని వ్రాసాయి కానీ బిబిసి మాత్రం ఇండియన్ లా మేకర్ హత్య అని హెడ్ లైన్ తో వార్తని ప్రచురించింది !
18. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి అతిక్ అహ్మద్ ని చంపడానికి కారణాలు లేవు. అతను బ్రతికి మిగతా విషయాలు బయటపెట్టాలి, అప్పుడే అసలు నేరస్థులకి కూడా శిక్ష పడుతుంది. అలాంటప్పుడు అతిక్ అహ్మద్ ని ప్రభుత్వమే హత్య ఎందుకు చేయిస్తుంది ? పైగా ఐఎస్ఐ, లష్కరే తోయిబా లింకులు ఎవరి వల్ల, ఎవరితో కలపబడ్డాయి అనే ప్రశ్నలకి జవాబులు ప్రభుత్వానికి కావాల్సి ఉండగా ప్రభుత్వమే హత్య ఎందుకు చేయిస్తుంది ?
19. యోగి ఆదిత్యనాథ్ పని తీరుని గమనిస్తున్న వారు ఎలాగయినా అతిక్ అహ్మద్ నుండి సమాచారం సేకరిస్తారు అనే భయంతో చేయించిన హత్య అది !
20. మరో ముఖ్య కారణం ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంది అది : అతిక్ అహ్మద్ రెండు రోజుల క్రితం తన కొడుకు అసద్ ఎనకౌంటర్ లో చనిపోయిన తరువాత తన విచారాన్ని ఇలా వ్యక్తం చేశాడు – నా కుటుంబం నాశనం అవడానికి నేనే కారణం ! So ! అతిక్ అహ్మద్ లో తన కొడుకుని కోల్పోయిన తరువాత శ్మశాన వైరాగ్యం ఆవహించింది. వైరాగ్యంలో ఉన్న వాడు నిజాలు చెప్పేస్తాడు అనేది ఎవరో సైకాలజిస్ట్ చెప్పక్కరలేదు! నిజాలు బయట పడితే ఎవరి రాజకీయ జీవితం నాశనం అవుతుందో వాళ్ళే హత్య చేయించారు.
21. అతిక్ అహ్మద్ ఎట్టి పరిస్థితి లోనూ బ్రతక కూడదు అనే నిర్ణయానికి వచ్చారు అంటే దానికి కారణం అతిక్ అహ్మద్ కి ఇక ఎలాంటి భవిష్యత్తు ఉండబోదు అని భయపడ్డ వాళ్ళే ఈ హత్య చేయించారు.
22. దొరికి పోతాము అని తెలిసీ పాయింట్ బ్లాంక్ లో కాల్చడానికి వచ్చారు అంటే వాళ్ళకి పిస్టల్ పేల్చడంలో ముందే శిక్షణ ఇచ్చారు అన్నమాట ! దొరికితే శిక్ష పడుతుంది అని తెలిసీ యువకులు ముందుకు వచ్చారు అంటే అది పేరు, ప్రతిష్టల కోసం అనేది అబద్ధం !
23. చివరి క్షణంలో పేలకుండా ఉండకూడదు అనే నిర్ణయంతోనే టర్కీ లో తయారుచేసిన పిస్టల్ ని కొన్నారు. హీన పక్షం 6 నుండి 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కో పిస్టల్ కి బులెట్ల కి.
24. టర్కీ కి చెందిన Tisas కంపనీది హంతకులు వాడిన పిస్టల్ ! దీనిని స్మగ్లింగ్ ద్వారా కొంటే 10 లక్షలు అవుతుంది కానీ భారత్ లో దీని మీద నిషేధం ఉంది !
అతిక్ అహ్మద్ హత్య జరిగిన తరువాత ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 17 మంది పోలీస్ అధికారులని సస్పెండ్ చేసింది ! ముగ్గురు సభ్యులు గల జ్యుడీషియల్ కమిషన్ ని ఏర్పాటు చేశారు యోగి ఆదిత్యనాథ్ విచారణ చేయమని ! రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ! యోగి ఆదిత్యనాథ్ ని చేతకాని వాడిగా నిరూపించే ఎలాంటి చర్య ని అయినా ఆయన గట్టిగానే ఎదుర్కుంటారు ! ఉత్తర ప్రదేశ్ లోని పోలీసు అధికారులతో అతిక్ అహ్మద్ కి ఉన్న సంబంధాలు కూడా హత్యకి కారణం అయి ఉండవచ్చు. కానీ ఎవరినీ వదిలే ప్రసక్తి ఉండదు !
Share this Article