Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఉమైర్ సంధు… బాబోయ్ ఇవేం సినీ గాసిప్స్… కంపుకొడుతున్నాయోయ్…

April 17, 2023 by M S R

ఉమైర్ సంధు… ఈ వ్యక్తి పేరు తెలియని సినిమా ప్రియులు ఉండరు… మన యూట్యూబర్లు, మన సైట్లు, చివరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా తనను అంత పాపులర్ చేసింది… అప్పట్లో కేవలం సినిమాకు ఫస్ట్ రివ్యూలు రాసేవాడు… కాకపోతే తను హిట్ అని రాసేవి బోల్తా కొట్టేవి… డాం అని రాసినవి కాస్తా హిట్టయ్యేవి… పెద్ద అపశకునం పక్షి అని వ్యాఖ్యానిస్తూనే అందరూ… ఇదుగో తొలి రివ్యూ అంటూ వార్తలు రాసేవి సైట్లు, చానెళ్లు…

ఇదో గందరగోళం తిక్కమేళం అనుకుని చాలామంది చదివి నవ్వేసేవాళ్లు… ఐనాసరే చానెళ్లు, సైట్లు ‘‘తొలి రివ్యూ’’ అని రాయడం మాత్రం మానలేదు… ఇండియాలో గాకుండా అక్కడెక్కడో కువైట్‌‌లో ఉంటాడు, ఏదో రాస్తాడు… అయితే హఠాత్తుగా కేవలం రివ్యూలు రాయడం గాకుండా ఇప్పుడు నోటికొచ్చిన పిచ్చి గాసిప్స్ ట్వీటుతున్నాడు… తొలి రివ్యూయర్ అనే పేరు చెడగొట్టుకుంటున్నాడు… పైగా ఓ సెన్సార్ మెంబర్ ఇలా ఏదిపడితే అది రాయొచ్చా, కూయొచ్చా..?

@UmairSandu అనే హ్యాండిల్ ఇప్పుడు వాసన కొడుతోంది… ఇది తన కొత్త ఖాతా అట… Google me, My New Account !! Member of Overseas Censor Board. Most Controversial No.1 South Asian Film Critic & Bollywood Adult Gossip Journalist… అని ట్విట్టర్ ఖాతా పరిచయం కనిపిస్తుంది… ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ అట… వోకే… కానీ తనకు తానే మోస్ట్ కంట్రవర్షియల్ ఫిలిమ్ క్రిటిక్ అని రాసుకుంటాడా ఎవడైనా..? పైగా బాలీవుడ్ అడల్ట్ గాసిప్ జర్నలిస్టు అట… ఇదుగో ఈ రాతలు చూశాకే డౌటొస్తోంది… ఇది అసలు ఖాతాయేనా అని… 

Ads

sandhu

ఈ తాజా ట్వీట్ చూశారా..? అమీషా పటేల్ చాలా గిరాకీ ఉన్న నటి అట… ‘గిరాకీ’ అంటే అర్థమైంది కదా… గోవా, బహ్రెయిన్, శ్రీలంక, ఖతార్‌‌లలో ఆమె హవా నడుస్తోందట, ఒక్క రాత్రికి 50 లక్షలు తీసుకుంటుందని రాసిపారేశాడు… హయ్యెస్ట్ రేటెడ్ నైట్ వుమన్ అని ముద్ర వేసేశాడు… (ఆ ఫోటో బాగాలేదు, అందుకే ఇక్కడ పబ్లిష్ చేయడం లేదు…) నువ్వేం రివ్యూయర్‌వు, నువ్వేం సెన్సార్ బోర్డు మెంబర్‌వు..? ఏదో తేడా కొడుతోంది… ఇంకా ఈ నిర్వాకానికి నన్ను ఇన్‌స్టాలో కూడా ఫాలో కావాలంటూ అప్పీల్ చేసుకుంటున్నాడు…


#SamanthaRuthPrabhu is in severe depression after Disaster Result of #Shaakuntalam. She switched her phone since yesterday. Her brand & market value is also DOWN in just one day. pic.twitter.com/xsnKvA6OzD

— Umair Sandhu (@UmairSandu) April 16, 2023


నటి సమంత శాకుంతలం సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో డిప్రెషన్‌లోకి జారిపోయింది, ఫోన్ స్విచాఫ్ చేసుకుంది.,. ఈ దెబ్బతో ఆమె బ్రాండ్, ఆమె మార్కెట్ బాగా డౌన్ అయిోయింది అని రాసుకొచ్చాడు నిన్న… ప్రియాంక, నిక్ జోనాస్ మోస్ట్ ఫేక్ కపుల్ అని రాస్తాడు మరో ట్వీట్‌లో… ఎందుకో…

‘‘హిందీ ప్రేక్షకులు రాజమౌళిని ప్రశంసిస్తారు… కానీ సౌత్ ప్రేక్షకులు మాత్రం రాజకుమార్ హిరానీ, సిద్ధార్థ్ ఆనంద్ వంటి హిందీ దర్శకులను మాత్రం అస్సలు ప్రశంసించరు… హిందీ వాళ్లకు డైరెక్టర్ అంటే కేవలం డైరెక్టరే… కానీ సౌత్ వాళ్లకు మాత్రం వాళ్ల కుల దర్శకుడే ముఖ్యం, తనే మంచి దర్శకుడు’’ అని మరో కంట్రవర్సీ గాసిప్ రాశాడు…

కిసీకాభాయ్ కిసీకాజాన్ అని సల్మాన్ సినిమా వస్తోంది కదా… తెలుగు నేటివిటీని కృతకంగా జొప్పించారు… అది చూశాడట, ఈ భూగ్రహం విడిచిపెట్టి వెళ్లిపోవడం బెటర్, పారాసెటమాల్ వేసుకున్నాను అర్జెంటుగా… ఇది మరో ట్వీట్… దిశా పటానీ, మౌనీరాయ్ బాలీవుడ్‌లో కొత్త లెస్బియన్ జంట అట… బాలీవుడ్ కోయినా మిత్ర స్లీపింగ్ పిల్స్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది, లక్కీగా బతికి బచాయించింది అని మరో ట్వీట్… ఆర్థికంగా కష్టాల్లో ఉంది, ఇంటి రెంట్ కూడా కట్టే స్థితిలో లేదని రాసుకొచ్చాడు మరో ట్వీట్‌లో…

సల్మాన్ ఖాన్ తన టీనేజీ గరల్ ఫ్రెండ్స్‌తో బెడ్ మీద ‘ఫిట్‌నెస్’ కోసం నాన్ స్టాప్ జిమ్ చేస్తున్నాడు అని ఇంకో ట్వీట్… డింపుల్ కపాడియా, సన్నీ డియోల్ ఈరోజుకూ రిలేషన్ షిప్‌లో ఉన్నారు… జుహూలో ఓ ఫ్లాట్‌ను ఈ అవసరం కోసమే కొన్నారు అని మరో ట్వీట్… షారూక్ ఖాన్ బిడ్డ సుహానాఖాన్‌తో జిస్మ్3 సినిమా చేయడానికి మహేష్ భట్ సంతకాలు చేశాడు అట… కైరా అద్వానీ రీసెంటుగా అబార్షన్ చేయించుకుందని ఒక ట్వీట్…

రెండు ట్వీట్లు చెప్పుకుందాం చివరగా… డిప్రెస్డ్, డ్రగ్గిస్ట్ ఫేస్ కలిగిన దీపిక పడుకోన్ తన ద్విలింగ సంపర్కుడైన మొగుడు రణవీర్ సింగ్‌తో విసిగిపోయిందట… మాధురీ దీక్షిత్ అమెరికా నుంచి వచ్చాక అయిదేళ్లలో రెండు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందట… అందులో ఒకటి వికటించి, ఇన్‌ఫెక్షన్ బారినపడిందట… https://twitter.com/UmairSandu  ఈ ఖాతా మొత్తం ఇలాంటి గాసిప్సే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions