ప్రేక్షకులకు చెత్త చెత్త సలహాలు, ఇంటర్వ్యూలతో వెగటు పుట్టించే ఓ చానెల్… ఓ సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేసింది… తను హాట్ డ్రెస్ వేసుకున్నప్పుడు తన కొడుకు (అయిదో ఆరో చదువుతున్నట్టున్నాడు) మమ్మీ నువ్వు ‘సె- గా’ అన్నావు అంటాడట.,.. మురిసిపోతూ చెప్పింది… అది ఆమె స్థాయి… అది ఆ ఛానెల్ స్థాయి… దీన్ని ప్రసారంలో పెట్టినవాడికి వేనవేల దండాలు… మోడరన్ జర్నలిజంలో అద్భుతమైన కీర్తిసంపదలు ఆర్జించు నాయనా…
మరొకటి చెప్పుకుందాం… ఇది ఉత్తరప్రదేశ్ వార్త… మన మెయిన్ స్ట్రీమ్ కవర్ చేసింది… విషయం ఏమిటంటే… ముజఫర్ నగర్‌లో మూడేళ్ల బాలికపై ఒకటో తరగతి బాలుడు లైంగిక దాడి చేశాడట… ఆ చిన్నారి వాడి స్కూల్‌లోనే ప్లేస్కూల్ చదువుతోందట… ఆ చిన్నారిని మాటల్లో పెట్టి, డాబా మీదకు తీసుకుపోయి లైంగిక దాడి చేశాడని అధికారులు చెప్పారుట…
Ads
నిజానికి ఒక్కసారి ఆలోచించండి… చిన్నారులపై లైంగిక దాడి జరగకూడదని ఏమీలేదు, జరిగిన ఉదంతాలు- ఘోరాలు మనం చదివాం… కానీ మరీ ఒకటో తరగతి కుర్రాడు లైంగిక దాడికి పాల్పడ్డాడా..? వాడి వయసెంతని..? మహా అయితే ఆరో, ఏడో… ఆ వయస్సులో లైంగిక ఆలోచనలు ఉంటాయా ఆ బాలుడిలో అసలు..? ఒకవేళ మన సినిమాలు చూసి, చిన్న వయస్సులో బుర్ర కుళ్లిపోయినా సరే, తన దేహం సంభోగానికి అనువైనదేనా..?
ఈ కేసు వెనుక ఏదో మర్మం ఉంటుంది… యూపీలో ఏదైనా జరగొచ్చు గానీ, మరీ ఇది నమ్మబుల్‌గా లేదు… కాదు… ఎవరో అధికారులు (పోలీసులు) చెప్పారట, వీళ్లు రాసేశారు… ఎంత దారుణం..? మరొక వార్త చదువుదాం…
ఇది వాషింగ్టన్ వార్త… గురు స్థానంలో ఉన్న మహిళా టీచర్లు తమ పిల్లలతో సంభోగాలకు అలవాటయ్యారట… థర్డ్ డిగ్రీ రే- కేసు అంటే ఏమిటో అర్థం కాలేదు… దాదాపు 30 ఏళ్లు దాటిన వీళ్లు 16, 17 ఏళ్ల పిల్లలతో లైంగిక బంధాలు పెట్టుకున్నారట… అది అమెరికన్ సమాజం… తల్లీ, చెల్లీ, గురువు, అక్క, పిన్ని వంటి వావివరుసలు ఏమీ పట్టని అరాచక సమాజం అది… టీచర్లు కక్కుర్తి పడ్డారంటే ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు…
వోకే, ఇది రాస్తే… క్రమేపీ మన సొసైటీకి కూడా ఈ జాఢ్యాలు వ్యాపిస్తాయా అనే ఆందోళన తలెత్తుతుంది… మన ఓటీటీలతో విశృంఖలత్వం స్వేచ్ఛగా ప్రసరిస్తోంది… పెద్ద హీరోలు సైతం బుద్ధి తప్పుతున్నారు… రానా, వెంకీ నటించిన రానానాయుడు గలీజు స్థాయి చూశాం కదా… ఇప్పటికే దరిద్రపు ప్రేమల పేరుతో పోరగాళ్లను భ్రష్టుపట్టిస్తున్నారు సినిమాల్లో, ఇంకా దాని స్థాయి ఏ రేంజుకు తీసుకుపోతారో మన సినీ ప్రముఖులు… ఈటీవీలో ప్రతి కామెడీ షోకు వెగటు వాసన… అఫ్‌కోర్స్, అన్ని చానెళ్లూ అలాగే ఏడ్చాయి… సో, ఆ ఉసురు తగిలి ఆ బాధ్యుల కుటుంబాల్లోనే బొచ్చెడు విడాకులు, అక్రమ సంబంధాలు గట్రా అదుపు తప్పిపోతుంటాయేమో…
తన కొడుకు తనను సె-గా కనిపిస్తున్నావని చెబితే మురిసిపోయే తల్లి గురించి ప్రసారం చేసినవాళ్లను ఏమందాం..? ఎవడో పోలీసు చెప్పాడని ఒకటో తరగతి పిల్లాడు ప్లేస్కూల్ పిల్లపై అత్యాచారం చేశాడని రాసిపారేసేవాళ్లను ఏమందాం..? ఇంత నెగెటివ్ వైబ్స్‌తో కుమ్మేస్తున్న, కమ్మేస్తున్న మీడియా హౌజులకు నియంత్రణ అక్కర్లేదా..? ఇదీ సమాధానం దొరకని ప్రశ్న…!!
Share this Article