Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కళ్ళు తెరిపించిన వైఎస్ రాజారెడ్డి హత్య కేసు ముద్దాయి… ఓ జ్ఞాపకం…

April 18, 2023 by M S R

Murali Buddha………..   కళ్ళు తెరిపించిన ys రాజారెడ్డి హత్య కేసు లో ముద్దాయి… ఓ జ్ఞాపకం… టీడీపీ ఓడిపోయి ysr సీఎం ఐన కొత్తలో ఓసారి శాసనసభలో నేను మారాను, నా తండ్రిని చంపిన పార్థసారధి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, ఐనా ఏమీ చేయలేదు అని ఏదో ఉపన్యాసంలో చెప్పారు …

మరుసటి రోజు టీడీపీ నుంచి మీడియాకు సమాచారం వచ్చింది, సోమాజీగూడా ప్రెస్ క్లబ్ లో పార్థసారధి ప్రెస్ కాన్ఫరెన్స్ అని …. పార్టీ వాళ్లే మాట్లాడించినా, పార్టీకి సంబంధం లేదు అని చెప్పడానికి ఇలా బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిస్తారు … టీడీపీ హయంలో పార్థసారధి రెడ్డికి మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పదవి ఇచ్చారు … అతన్ని చూస్తే మార్కెట్ కమిటీలో క్లర్క్ అనిపించాడు కానీ సినిమాల్లోలా రాయలసీమ రాజకీయ నాయకుడు అనిపించలేదు…

Ysr తో నాకు ప్రాణభయం ఉంది … అందుకే శాసనసభలో నా గురించి చెప్పాడు అని టీడీపీ స్క్రిప్ట్ ప్రకారం ఏదో చెప్పాడు … బయటకు వచ్చాక అతనికి జ్ఞాన బోధ చేయాలి అనిపించింది ..

Ads

partha sarathy

నేను ఫలానా అని పరిచయం చేసుకొని, ‘‘చూడు బాబూ నీ భయం తప్పు … సీఎం అనే పదవి ముందు దేనిపైనా ఆసక్తి ఉండదు … అధికారం అనేది అన్నిటి కన్నా మించిన మత్తు … స్త్రీ, పాత కక్షలు, మద్యం, బంధుత్వాలు ఇవేవి అధికారం అనే మత్తు ముందు పనికి రావు … కాబట్టి ysr నన్ను చంపిస్తాడు అనే నీ భయం ఓ భ్రమ … చంపుమని నువ్వు ముందుకు వెళ్లి నిలబడ్డా చంపడు …. పదవి బాబూ పదవి ….

నిన్ను ఎవరు చంపినా అనుమానం ys పైకి వెళుతుంది … రాజకీయ ప్రయోజనం టీడీపీకి వస్తుంది … కాబట్టి నీ ప్రాణాలకు ఎవరితోనైనా ముప్పు ఉందా అంటే బాబు పార్టీ వల్ల ఉంది … ఎందుకంటే వారికే లాభం’’ అని చెప్పాక … అంతా విని, అంతే అంటారా అని ఆలోచనలో పడ్డాడు ….

అతన్ని వదిలేసి నా పనిమీద నేను వెళ్లి పోయాను … ప్రాణ భయంతో ఉన్నవాడికి భరోసా కల్పించాను అనుకుంటూ ….. ఇక ఆ విషయం మరిచి పోయాను …

ys rajareddy

ఓసారి ఎన్టీఆర్ భవన్ నుంచి బయటకు వస్తుంటే గేటు పక్క నుంచి సార్ … సార్ అని వినిపిస్తే చూశా …. పార్థసారధి రెడ్డి … మీరు ఆ రోజు చెప్పారు కదా అని విషయం అంతా గుర్తు చేశాడు … మీరు చెప్పాక బాబును కలిశాను … మీకు ysr తో ప్రాణ భయం లేదు … ఉంటే గింటే బాబుతోనే ఉంది అని మురళి చెప్పాడు అని బాబుకు వివరంగా చెప్పాను … ఆ మాటలు విని బాబు కంగారుగా నాకేం ఖర్మ అన్నారు అని వివరించాడు …

నేను కంగారుపడి నీ ముఖం చూస్తే పాపం అనిపించి చెప్పాను, అవన్నీ నా పేరుతో బాబుకు చెప్పడం తప్పు కదా ? అని ప్రశ్నిస్తే …. పార్థసారధి చిద్విలాసంగా నవ్వి … మీరు చెప్పాక బాగా ఆలోచించాను … నిజమే కదా అనిపించి, ఒకవేళ నన్ను ఏమైనా చేస్తారేమో …. మీడియా ఇలా కూడా ఆలోచిస్తుంది అని బాబుకు చెప్పడానికే అలా అన్నాను అని బదులిచ్చాడు ..

నువ్వు కనిపించేంత అమాయకుడివేమి కాదు … మీలాంటి వారి విషయంలో తొందరగా ఓ నిర్ణయానికి రావద్దు అనుకొని – అతను నా కళ్ళు తెరిపించాడు అనుకున్నాను …. మళ్ళీ హత్య, సిబిఐ అరెస్టులు అనే వార్తలు చూస్తే గుర్తుకు వచ్చింది … ఆ తరువాత పార్థసారధి రెడ్డి ఎప్పుడూ కలువలేదు …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions