Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎవరు ఆంధ్ర..? ఎవరు తెలంగాణ..? అంతా మన భ్రమ… లీడర్ల మాయ…!

April 18, 2023 by M S R

Murali Buddha……..   ఆంధ్రాలో చక్రం తిప్పుతున్న తెలంగాణ నేతలు …

నీది మరీ అత్యాశోయ్ … ఆంధ్రాలో తెలంగాణ నేతలు చక్రం తిప్పడమా ? ఎంత మాట..? అత్యాశకు కూడా ఓ హద్దు ఉండాలి కదా …

పూర్తి ఆధారాలతోనే చెబుతున్నాను బ్రో … ప్రముఖ తెలంగాణవాదులు అందరూ ఇప్పుడు ఆంధ్రాలోనే చక్రం తిప్పుతున్నారు …

Ads

1 హైదరాబాద్ లో నేను తిరిగినన్ని గల్లీలు ఎవరూ తిరగలేదు. నేనే పక్కా హైదరాబాదీని అని కిరణ్ కుమార్ రెడ్డి ఎంత బాగా చెప్పే వాడు, గుర్తుందా నీకు ? ఇప్పుడాయన ఆంధ్రా బీజేపీలో చేరారు … ఆంధ్రా బీజేపీకి ఇప్పుడాయనే ఆశా కిరణం … ఒకప్పుడు తెలంగాణ ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించి, చివరి బాల్‌కు సిక్స్ కొట్టబోయి తనే బోల్తా కొట్టాడు…

2. హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. ఇక్కడ పతంగులు ఎగురవేస్తూ పెరిగాను … నేనే సిసలైన తెలంగాణవాణ్ని అని లోకేష్ వచ్చీ రాని తెలుగులో ఎంత ముద్దుముద్దుగా చెప్పే వారు గుర్తుంది కదా ? ఇప్పుడాయన ఆంధ్రాలో టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి పాదయాత్ర కూడా చేస్తున్నాడు … ఆంధ్రా టీడీపీకి ఆశా జ్యోతి ఆయనే ….

3 నందమూరి సుహాసిని అలియాస్ చుండ్రు సుహాసిని గుర్తున్నారా ? తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజ్యసభ సభ్యత్వమే వదులుకున్న హరికృష్ణ కుమార్తె ఆమె… నేనూ తెలంగాణ మహిళనే అని మనకు అర్థం కాని ఏదో భాషలో మైకులో చెప్పినా, ఈనాడులో చక్కని తెలుగులో రాశారు… అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి పోటీ చేసి, నేనే సిసలు తెలంగాణ అని బలంగా వాయిస్ వినిపించారు … గుర్తుంది కదా … నిన్నటి వరకు ఈమె తెలంగాణ టీడీపీ కమిటీలో ఏదో పదవిలో ఉండేవారు … ఈసారి ఆంధ్రా నుంచి పోటీ చేయిస్తారట … అందుకే తెలంగాణ కమిటీ నుంచి తప్పించారు …

4. మరి షర్మిలక్క… నేనే తెలంగాణ …. తెలంగాణ అంటేనే నేను అంటున్న షర్మిలక్క అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆంధ్రా వెళ్లి … ఆంధ్రాలో తెలంగాణవాదిగా చక్రం తిప్పుతారు …. చూస్తూ ఉండండి… ఇప్పుడు చెప్పండి, తెలంగాణ వాళ్లు ఆంధ్రాలో చక్రాలు తిప్పుతున్నారా లేదా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions