Murali Buddha………. పీఎం, సీఎంల మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారో రాధాకృష్ణకు ఎలా తెలుస్తుంది..? జగన్ , నరేంద్ర మోడీల్లో ఎవరో ఒకరు ఆయన సోర్స్ కావచ్చు, ఆ సంగతి నాకు తెలియదు … కానీ ఆయన రిపోర్టర్ గా తిరిగేప్పుడు … ఆయనకు తెలియంది, ఓ సామాన్య జర్నలిస్ట్ కు తెలిసింది ఓ వార్త… ఓ జ్ఞాపకం ఉంది చెబుతాను…
ఓ జ్ఞాపకం- కొన్ని గంటల పాటు ముఖ్యమంత్రి వద్ద… పొలిట్ బ్యూరో సభ్యులు, బాబు సన్నిహిత జర్నలిస్ట్ రాధాకృష్ణలతో సహా ఉన్నారు…. వీరికన్నా ఆ మీటింగు విషయాలు ఎక్కువ తెలిసిన వారు ఎవరుంటారు ? ఈ రోజు ఇంతకు మించి ఏమీ ఉండదు అనుకుని, ఆఫీస్ కు వెళ్లి, వార్త రాసి హాయిగా నిద్ర పోయి, తెల్లవారగానే వేరే పత్రిక చూస్తే, మనం రాసినదానికన్నా, మనకు తెలిసినదానికన్నా జరిగింది వేరే ఉంటే, అది వేరే పత్రికలో చదివితే మన అతి విశ్వాసంపై ఎవరో కొట్టినట్టే ఉంటుంది .
బాబు తొలిసారి సీఎం అయ్యాక వచ్చిన రాజ్యసభ ఎన్నికలు అవి … ఐదుగురిని ఎంపిక చేయాలి … అర్ధరాత్రి వరకు పొలిట్ బ్యూరో భేటీ… నాలుగు పేర్లు బయటకు వచ్చాయి… మీటింగ్ తరువాత నలుగురైదుగురు జర్నలిస్ట్ లు బాబుతో సమావేశం … అందులో ఒకరు రాధాకృష్ణ … ఆయన రిపోర్టర్ గా రంగంలో తిరిగే రోజులు అవి … నాలుగు పేర్లు ఫైనల్ అయ్యాయి. ఐదవ పేరు రేపు అని బాబు చెప్పాడు వాళ్లతో … బాబుగారే చెబుతున్నారు కదా ఇక వెళ్లిపోదాం అని రాధాకృష్ణ అంటున్నాడు … హేమాహేమీలైన్ పొలిట్ బ్యూరో నేతలు సైతం అదే మాట …
Ads
సరే అని అంతా వారి వారి ఆఫీస్ లకు వెళ్లిపోయారు … తెల్లవారాక జ్యోతితో పాటు అన్ని పత్రికల్లోనూ ఆ నాలుగే పేర్లు …. కానీ ఒక్క వార్త దినపత్రికలో తప్ప …. అందులో ఐదు పేర్లూ వచ్చాయి … ఐదూ కరెక్ట్ పేర్లే …! అర్రె, బాబు ఆత్మకు …. హేమాహేమీలకు తెలియని ఆ అయిదో పేరు వార్త రిపోర్టర్ నాగేశ్వర రావుకు ఎలా తెలిసింది ..? పైగా ఆ రోజు అర్ధరాత్రి వరకు బాబు ఇంట్లో, బాబుతోనే ఉన్న రిపోర్టర్లలో అతను లేడు కూడా ….
మరుసటి రోజు అతన్ని పట్టుకొని ఎలా ? హౌ ? అని అడిగితే …. ‘‘మీరంతా బాబు ఇంట్లో ఉన్నారు కదా,. అప్పుడు నేను అక్కడికి రాకుండా, ఆ చౌరస్తాలో ఉన్నాను … పొలిట్ బ్యూరో అయిపోగానే నేతలు తిరిగి వెళ్లేప్పుడు దొరికాడు ఆయన …. చందూలాల్… మీరు అతన్ని నాయకుడిగానే చూడరు .. కానీ అతను పొలిట్ బ్యూరో మెంబర్ … వెళ్లి అతని కారులో కూర్చున్నాను ……పేర్లు తీసుకున్నాను….’’ అని చెప్పాడు…
బాబు , తరువాత నంబర్ టూ అనుకునే మంత్రుల కన్నా ఎవరూ పట్టించుకోని చిన్న మంత్రులు మనం పలకరిస్తే మురిసి పోయి చెబుతారు ….. జర్నలిస్ట్ లు ఆచరించాల్సిన పాఠం ఇది … చిన్న వారి వద్దే పెద్ద సమాచారం పొందడం ఈజీ … మరి జగన్, మోడీ రహస్యంగా మాట్లాడుకునేది రాధాకృష్ణకు ఎలా తెలుసో చెప్పనేలేదు అంటారా … అది చాలా ఈజీ… అక్కడ ఏం మాట్లాడుకున్నారో రాయాలి అంటే సోర్స్ ఉండాలి … మనం రాయాలి అనుకున్నది రాసేసేందుకు… సోర్స్ ఎందుకు ?
Share this Article