బహుశా తెలుగు సినిమా చరిత్రలో మొదటిసారి కావచ్చు… ఏమో, ఇతర భాషల్లో కూడా…!! తన సొంత సమస్యను ఒక హీరో తనే నిర్మాతగా మారి, తనే నటిస్తూ, తన సొంత కథను, అందులోనూ తన పెళ్లిళ్ల కథను సినిమాగా తీయడం… ఎంతైనా సీనియర్ నరేష్ ఓ చరిత్ర తిరగరాస్తున్నాడు… ఈమధ్య బూతు సినిమాలకు ఎగబడిన ఒకప్పటి ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు ఈ సినిమాకు దర్శకత్వం అట… వావ్, అసలే నరేష్ తాజా ప్రియురాలు పవిత్ర… ఆమెను నాలుగో పెళ్లి చేసుకోబోతున్న నరేష్…
ట్రెయిలరో, టీజరో… అతను కన్నుగొట్టి లోపలకు పద అని సైగ చేస్తున్నాడు… ఆమె కూడా కన్నుగొట్టి, ఇంకెందుకు ఆలస్యం, పద మరి అన్నట్టు సైగ చేస్తోంది… అరవయ్యేళ్ల ఈ ముదురు మదనుడికే కాదు, నలభై నాలుగేళ్ల పవిత్రకు కూడా తొలి పెళ్లి ఏమీ కాదు… అందుకే ఈ సినిమాకు పెట్టిన పేరు ‘మళ్లీ పెళ్లి’ ఆప్ట్ టైటిల్…
పవిత్ర కన్నడ నటి కాబట్టి… ఈ సినిమాకు ఇంకా పాపులారిటీ కోసం కన్నడంలో కూడా తీస్తున్నారు… నరేష్‌కు తమిళంలోనూ మస్తు ఫాలోయింగ్ ఉందనుకుని బహుశా తమిళంలో కూడా డబ్ చేస్తారేమో… ఏమో, కమర్షియల్‌గా కూడా వర్కవుట్ అయ్యేట్టుంది అనుకుని హిందీలో కూడా డబ్ చేసేసి, కొంపదీసి పాన్ ఇండియా సినిమాగా మలుస్తారేమో… చేసినా చేస్తాడు హిజ్ ఎక్సలెన్సీ మాన్యశ్రీ నరేష్ గారు…
Ads
ఈ ప్రచార చిత్రం చూశాక అందరికీ అర్థమైంది ఏమిటంటే..? నరేష్ తన మూడో భార్య రమ్యను విలన్‌గా చూపించబోతున్నాడు ఇందులో… తనెంతటి ఉదాత్తుడో, ఆమె ఎంతటి సూర్యకాంతమో వివరంగా ఓ కథ చెబుతాడన్నమాట… పనిలోపనిగా పవిత్రతో తన లవ్వు, రొమాన్స్‌ను ఎంఎస్ రాజు తరహాలో హాట్‌గా చూపిస్తారేమో… ట్రెయిలర్ అలాగే చిలిపిగా కన్నుగొడుతోంది… (ఈ ట్రెయిలర్ చూశాక నెటిజనం నరేష్ మీదే చెణుకులు విసురుతున్నారు వెటకారం దట్టించి మరీ…)
సరే, రమ్యను విలన్‌గా చూపిస్తారు సరే… తనేమో పెద్దమనిషి, జెంటిల్‌మాన్, తన హీరోయిన్ పవిత్ర లోకోద్ధరిణి, ప్రేమస్వరూపిణిగా చూపిస్తారు సరే… మరి తన పరువు పోగొట్టి, తనను విలన్‌గా చూపిస్తే, తనను బ్యాడ్ లైట్‌లో ఫోకస్ చేస్తే ఆ రమ్య ఊరుకుంటుందా..? అసలే ఆమె అల్లాగప్పాగా ఊరుకునే భార్య కాదు… వాళ్లు ఎలా కలిసి ఉంటారో, ఎలా పెళ్లి చేసుకుంటారో చూస్తా, నేను విడాకులు ఇచ్చేది లేదు, ఏం చేస్తాడో చూస్తా అని బహిరంగంగానే సవాల్ చేస్తోంది ఆమె…
సో, నరేష్‌ను విలన్‌గా చూపిస్తూ… పాత పెళ్లాలు ఎందుకు వదిలేశారో వివరిస్తూ, పవిత్రను మొగుళ్లను వలలో వేసుకునే కేరక్టర్‌గా చూపిస్తూ ఆమె కూడా ఓ సినిమా తీస్తుందా..? ఆమె దగ్గర డబ్బు ఉంది, తను బదనాం అయ్యే సిట్యుయేషన్ వస్తే నిజంగానే తన వెర్షన్‌తో సినిమా తీయగలదు… కేజీఎఫ్ తీసి, ప్రభాస్‌తో సాలార్ తీస్తున్న ప్రశాంత్ నీల్ తనకు సమీపబంధువే… ఓ పదునైన దర్శకుడిని తనే సజెస్ట్ చేయగలడు… ఎలాగూ బజారున పడిన సంసారం, ఇక వెరపు దేనికి..? సరిగ్గా కథ వండితే… నరేష్‌కు తాట లేచిపోవడం ఖాయం… ఎటొచ్చీ రమ్య ఒక్కసారి ఆ సినిమా తీయడానికి ఫిక్సయిపోవాలి, అంతే…
Share this Article