Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దాసరి పార్టీ పుట్టకముందే గిట్టింది… ఆ కథాక్రమంబెట్టిదనిన…

April 23, 2023 by M S R

Murali Buddha…………   దాసరి పార్టీ పుట్టక ముందే అలా గిట్టిపోయింది… షాకిచ్చిన గొనె ప్రకాష్ … ఓ జ్ఞాపకం ….

ఉదయం నాలుగు గంటలు కావస్తుంది … ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ కావడంతో ఈ టైంలో ఎవరు ఫోన్ చేసి ఉంటారు ? ఎందుకు చేసి ఉంటారు అని గాబరాగా ఫోన్ ఎత్తితే … అటు నుంచి గొనె ప్రకాష్ … మిమ్ములను నమ్మి వార్త చెబితే అలానేనా రాసేది .. సోర్స్ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి .. ఇలా రాస్తే ఇంకోసారి ఎలా చెబుతాం అంటూ అతను మాట్లాడుతూ పోతూనే ఉన్నాడు … నాకు షాక్ .. అతని మాటలకు కాదు .. తెల్లవారు జామున నాలుగు గంటలకు అతను ఆంధ్రభూమి చదవడం, వార్త పై స్పందించడం …. అతను అడిగిన వాటిని పట్టించుకోకుండా ఆశ్చర్యంగా… అదేంటి, ఇంత పొద్దున మీకు పేపర్ రావడం, చదవడం అయిపోయిందా ? అని అడిగాను …

అది దాదాపు 1997-98 ప్రాంతం … ఎన్టీఆర్ కు ముందు ఆ సామాజికవర్గం ప్రముఖులు కొందరు మనకంటూ ఓ పార్టీ ఉండాలి అని తీవ్రంగా ప్రయత్నించినట్టే … చిరంజీవికన్నా ముందు ఆ సామాజికవర్గం నుంచి కూడా ప్రయత్నాలు జరిగాయి .. అలా దాసరి నారాయణ రావు ఓ పార్టీ పెట్టాలి అనుకున్నారు … అంకెలు, చరిత్రతో మాట్లాడే గొనె ప్రకాష్ దాసరి వద్ద చేరారు … ఉమ్మడి రాష్ట్రంలో కాపు ఓట్లు ఎన్ని ? జిల్లా, నియోజకవర్గమే కాదు .. గ్రామాల వారీగా కూడా కులాలు, ఓట్ల లెక్కలు, చరిత్ర ఆయన నాలుక మీద ఉంటుంది .. మీరు పార్టీ పెట్టడమే ఆలస్యం, సీట్లు వచ్చి పడిపోతాయి అని దాసరికి లెక్కలు చెప్పారు. ఆ లెక్కలకు ఎవరైనా ఆశ్చర్య పోవలసిందే …

Ads

బసంత్ టాకీస్ లో దాసరి అభిమాన సంఘాల సమావేశం.. దాసరి పుట్టిన రోజు నాటికి కొత్త పార్టీ అన్నట్టుగా ప్రచారం .. పార్టీ ఎలా పెట్టాలి, అధికారం లోకి వచ్చాక ఏం చేయాలి అభిమాన సంఘాల విస్తృత చర్చ …. ఈ మీటింగ్ కన్నా ముందే పార్టీ పెడతారు అనే వార్తలు … అట్టహాసంగా మీటింగ్ జరిగినా పార్టీ పెట్టడానికి దాసరి జంకుతున్నారు అని చూచాయగా వినిపించింది .. ఆ సమాచారం కోసం ప్రయత్నిస్తుంటే గొనె ప్రకాష్ కలిసి మీకో వార్త చెబుతాను అన్నారు … పురజనుల కోరికపై దాసరి పార్టీ ఏర్పాటును వాయిదా అని రాయాలి అని చెప్పారు ..

పార్టీ ఏర్పాటు వాయిదా అని రాయాలి అని నేను చెబితే, పార్టీ ఏర్పాటు చేయడం లేదు అని మీరు రాశారు. మీరు సోర్స్ ను దూరం చేసుకున్నారు అంటూ గొనె చెబుతూనే పోతున్నారు. అది సరే, నాలుగు గంటలకు ఆంధ్రభూమి పాఠకుల వద్దకు వస్తుందా ? ఎలా సాధ్యం అయింది అని నేను అడిగాను మధ్యలో కష్టమ్మీద కలగజేసుకుని.. గొనె అవకాశం ఉంటే ప్రింటింగ్ అయి పత్రిక బయటకు రాగానే చదువుతారు అని తెలిసింది .. ప్రింటింగ్ వద్దకు వెళ్లే అవకాశం లేకపోతే, తెల్లవారు జామునే పేపర్ డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్లి చదువుతారు .

దాసరి పార్టీ వాయిదా ఎప్పటికీ కార్యరూపం దాల్చలేదు … తరువాత బాబు వద్ద ఓ సమావేశంలో మీరు మీడియాను కాదు, మా సినిమా వారిని నమ్ముకోండి. బోలెడు ప్రచారం కల్పిస్తాం అని సలహా ఇచ్చారు. అటుతరువాత కాంగ్రెస్ లో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. సరే మరి, సోర్స్ ను పోగొట్టుకున్నావు అని గొనె అడిగిన దానికి ఏం సమాధానం చెప్పానంటారా? దాసరి పార్టీ పెడితే మీరు సోర్స్ అవుతారు కానీ … అసలు పార్టీనే పెట్టనప్పుడు మీరు సోర్స్ ఏమిటీ అని నవ్వాను ….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions