మణిరత్నం గొప్ప దర్శకుడే కావచ్చుగాక… తన అభిరుచి, చిత్రీకరణ శైలితో తమిళమే గాకుండా ఇతర భాషల్లోనూ మంచి పేరు సంపాదించి ఉండవచ్చుగాక… కానీ అది గతం… పొన్నియిన్ సెల్వన్‌తో తను పక్కా తమిళ దర్శకుడు మాత్రమే అనిపించుకున్నాడు… ఈ సినిమా విషయంలో కొన్ని ఫెయిల్యూర్లు ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చనీయాంశాలయ్యాయి…
అనేక సంపుటాల భారీ చరిత్ర గ్రంథాన్ని ఒక సినిమా వ్యవధికి కుదించుకోలేకపోవడం స్క్రీన్ ప్లే కోణంలో ఫెయిల్… వర్తమాన కాలపు ప్రేక్షకుడు ఎంత సేపు చూస్తాడు..? ఆ పెద్ద గ్రంథంలో ఏయే అంశాలు మాత్రమే ప్రేక్షకాసక్తిని కలిగి ఉన్నాయి..? వాటిని ఎలా తీయాలి..? ఎలా కుదించాలి..? సీన్ల క్రోడీకరణ, అనగా క్రొనాలాజికల్ సీక్వెన్స్ ఎలా అమర్చాలి అనే అంశాల్లో మణిరత్నం ఫస్ట్ ఫెయిల్యూర్…
త్రిష, ఇద్దరు ఐశ్వర్యలు, కార్తీక్, విక్రమ్ తదితర భారీ తారాగణం వరకూ వోకే… కానీ తమిళం దాటి ఎవరికీ తెలియని ఆ కథ ఇంట్రడక్షన్‌కే ఒక భాగం సినిమా అయిపోయింది… ఇప్పుడిక రెండో పార్ట్‌లో కథ చెప్పాలి… అదీ పెద్దదే… నో కుదింపు… మొదట్లో 4 గంటల రన్ టైమ్ లాక్ చేశారట, అరాచకం… మణిరత్నానికి ఏమైంది అసలు..? ఈ చర్చ స్టార్టయింది ఇండస్ట్రీలో…
Ads
అసలు ఒకే సినిమాలో మొత్తం కథ చెప్పలేకపోవడం ఒక ఫెయిల్యూర్ అయితే… డబ్బు కోసం, మొదట షూటింగ్ చేసిన పీడ్‌నే రెండు భాగాలు చేయాలని ప్లాన్ చేశారు… అదొక వల, అదొక స్ట్రాటజీ… పోనీ, అలా కూడా చూసే ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి, వోకే అనుకుందాం… రెండో భాగానికి ఫీడ్ నాలుగు గంటలు వస్తే, ఎడిటింగ్ చేతగాక, కుదింపు చేతగాక దాన్ని అలాగే జనం మీదకు వదలాలని అనుకోవడం మరో ఫెయిల్యూర్…
సరే, చివరకు 10 నిమిషాలు తక్కువ 3 గంటలుగా ఖరారు చేశారట… నిజానికి అదీ ఎక్కువే… నిజానికి ఆ నాలుగు గంటల ఫీడ్ అలాగే ఉంచేసి, పీఎస్-2, పీఎస్-3 అని రిలీజ్ చేస్తే అయిపోయేదనే చెణుకులు కూడా పడుతున్నయ్… నిజమే, చూసేది ఎలాగూ తమిళ ప్రేక్షకులే… వేరే భాషల్లో అట్టర్ ఫ్లాప్… తెలుగు ఉదాహరణే తీసుకుంటే ఫస్ట్ పార్ట్ వ్యాపారం 10 కోట్లకు జరిగితే, ఆ వసూళ్లే కష్టమయ్యాయి… ఇప్పుడు ఆ 10 కోట్లకూ రెండో పార్ట్ కొనేవాడు దిక్కులేడట…
ఇక హిందీ, కన్నడం గురించి అడక్కండి… కన్నడ ప్రేక్షకులకు తమళ సినిమా అంటే కాస్త జాతివ్యతిరేకత… హిందీ వాళ్లకు ఈ కథ ఎక్కదు… పైగా తమిళ ప్రైడ్, సౌత్ ప్రైడ్ కాబట్టి అస్సలు సహించరు… ఐనా తెలుగువాళ్లకే ఎక్కలేదు, ఇక వేరే భాషల ప్రేక్షకులను అనడానికి ఏముంది..? నిజానికి పీఎస్ సినిమా రివర్స్ కథ… బాహుబలి, కేజీఎఫ్ వంటివి ఫస్ట్ పార్టులకన్నా సెకండ్ పార్టులు ఇంకా ఎక్కువ సూపర్ హిట్… పీఎస్ రివర్స్… ఫస్ట్ పార్టుల్లోనే ఇంత బాగా వచ్చింది, ఇక సెకండ్ పార్టులు ఇంకెంత బాగుంటాయో అనే పాజిటివ్ వైబ్స్ ఆ సినిమాలకు… ఫస్ట్ పార్టే ఇలా విసిగించాడు, ఇక సెకండ్ పార్టు ఎంతగా విసిగిస్తాడో అనేది పీఎస్ మీద విరక్తి…
కనీసం సినిమాలో సంగీతం, పాటలు బాగున్నా కొంత మేరకు మణిరత్నం టేకింగ్ గురించి థియేటర్‌కు వెళ్లేవాళ్లు… పీఎస్ విషయంలో స్క్రిప్టు కుదింపులో ఫెయిల్, సరైన ఎడిటింగులో ఫెయిల్, స్ట్రెయిట్‌గా ఓ సినిమా కథలా చెప్పడంలో ఫెయిల్, సంగీతంలో ఫెయిల్… కనీసం సెకండ్ పార్ట్ రన్ టైమ్ కుదింపులో కూడా ఫెయిల్… ఎంచక్కా మాంచి వెబ్ సీరీస్ తీస్తే పోయేది… కథను వివరంగా 10 భాగాలుగా చెప్పినా సరే, చల్తా… కుదింపు సమస్య ఉండదు… ఇప్పుడెలాగూ పెద్ద పెద్ద నటులు కూడా ఓటీటీ వైపు వచ్చేస్తున్నారు… సో, పొన్నియిన్ సెల్వన్ విషయంలో సమగ్ర వెబ్ సీరీస్ ఆలోచన చేయకపోవడం అతి పెద్ద ఫెయిల్యూర్…
Share this Article