కాలం మారుతోంది… ఇప్పుడంతా డిజిటల్… పుస్తకం కావచ్చు, థియేటర్ కావచ్చు…. సినిమా అంటే, సీరియల్ అంటే ఓటీటీలో వీక్షణమే… అలాగే పుస్తకమూ ఈ ‘దారి’కొచ్చింది… ఇంగ్లిషులో అయితే డిజిటల్ పుస్తకం ఓపెన్ చేసి, రీడ్ ఇట్ అనే అప్షన్‌లోకి వెళ్లిపోతే… అరమోడ్పుగా కళ్లుమూసుకుని వెనక్కి వాలితే… అది కథ చదివి పెడుతుంది… ఇంకా మన తెలుగులో అది విస్తృతంగా రాలేదు… తెలుగు నవలారచనలో శైలికి, కంటెంటుకు సంబంధించి బోలెడు విజయవంతమైన ప్రయోగాలు చేసిన యండమూరి వీరేంద్రనాథ్ తొలిసారిగా పెయిడ్ డిజిటల్ ఆన్లైన్ సీరియల్ తీసుకొచ్చాడు… పేరు నిశ్శబ్ద విస్ఫోటనం… (డిజిటల్ బుక్స్ అమ్మకానికి, అద్దెకు చాలా ఏళ్లుగా వున్నవే… ఓ సీరియల్ బహుశా ఫస్ట్ టైం కావచ్చు…)
ఇంగ్లిషులో పాపులర్ పుస్తకాలు, ఇలాంటి సీరియల్స్ మీద రివ్యూలు బాగానే కనిపిస్తయ్… కానీ తెలుగులో చాలా తక్కువ… యండమూరి పెట్టిన ఒక ఫేస్బుక్ పోస్టులో ఓ కామెంట్లో ఓ చిన్నచర్చ… అందులో మిత్రుడు Neelayapalem Vijay Kumar కామెంట్ దాదాపుగా ఒక రివ్యూ… అది యథాతథంగా…
Ads
కానీ… నిన్న అర్ధరాత్రి నిశ్శబ్ద విస్ఫోటనం తర్వాత…. ఒక ఫక్తు లాజిక్ అనేది అర శాతం కూడా వుండని ఈ తరం యంగ్ హీరోల తెలుగు సినిమా గుర్తుకొచ్చింది….దీనిలో హీరోయిన్ అంతే…. అన్నట్టు….ఈ నవలలో, విలన్ ఎవరు సర్? మీసాల రాజు అని చెప్పరు మీరు. తెలుసు. కానీ ఇంకెవరు? చాణుక్య కానే కాదు..! మరి….? యండమూరి మార్క్ లేదా అంటే…. కాలేజీ పిల్లలు నేర్చుకొని విషయాలు చాలా వున్నాయి… కాలేజీ ఏంటి … కార్పోరేట్ లు, రాజకీయవాదులు కూడా తమ మీటింగుల్లో చెప్పుకోదగ్గ ఆణి ముత్యాలు ఉన్నాయి…”లౌక్యం” దగ్గర నుంచి… అడవిలో మృగరాజుని జంతువులు రాజుగా ఎన్నుకోలేదు దాకా… కొద్దిగా మార్చిన బర్బరీకుడు కధ దాకా…. కానీ అవేవీ కధలో ఇంటగ్రేట్ కాలేదు…. విడిగా చాలా బాగున్నాయి… మీరు రాసిన పాత పుస్తకాల్లో ఆణి ముత్యాల లాగా… కానీ ఇక్కడ ఈ నవలలో… ఏదో… నవల నిడివి పెంచడానికి రాసినట్టే ఉంది… అసలే 230 పేజీల నవల… దానిలో కథకు సంబంధం లేని విషయాలే 30 పేజీలు పైగా ఉన్నాయి… ఇక 200 పేజీల్లో ఇంత breadth ఉన్న కధని, “ఇన్సిడెంట్స్” లేకుండా చెప్పుకొంటూ వెళ్లారేమో అనిపించింది….
కోర్టు సీన్లు మరీ చప్పగా ఉన్నాయేమో అనిపించింది… ముఖ్యంగా ప్రత్యర్థి వైపు నుంచి కనీసం ఒక్కటైనా strategic move లేకపోవడం… హీరోయిన్ శ్రమ లేకుండా సునాయాసంగా గెలవడం… అదీ ఎలా గెలిచింది ఇన్సిడెంట్స్ లేకపోవడం…. plot పెద్దగా పండలేదేమో… “ఆర్ట్ ఆప్ వార్” ఇన్స్పిరేషన్ అన్నారు… కానీ అవతలి వైపు.నుంచి ఒక్క రేప్ ఘటన తప్పిస్తే, అదీ అనుకోకుండా జరిగింది….ఇక ఏమీ రెసిస్టన్స్ లేదు… సీఎం ని ఒక జోకర్ చేశారు…హోమ్ మినిష్టర్ ని ఒక సైడ్ యాక్టర్‌ను చేశారు… వాళ్ళ శక్తి యుక్తులు ప్రదర్శించి, దాన్ని హీరోయిన్ ఎలా ఎదుర్కొంది అని చెప్పేవి మీ ఇంతకు ముందు పుస్తకాలు… అతడే ఆమె సైన్యం లాంటివి… ఇక్కడ ఈ బుక్ లో it was lacking somehow…. హీరోయిన్ ఏమి అనుకొంటే అవి జరిగిపోతే, ఇక యుద్ధం ఎక్కడ ఉంది? ఈరోజు పొద్దున నాదే తప్పు అనుకోని ర్యాక్ లో నల్లంచు తెల్ల చీర మరొకసారి చదివాను… కానీ ఇప్పటికీ అది బ్రహ్మాండముగా ఉంది…. May be, మీ విషయంలో పాఠకులు ఎదగకుండా తొంభైలోనే ఆగిపోయారేమో… మేమింకా అప్పటి తరంలోనే ఉండిపోయామెమో… మాకు ఆ యండమూరి మాత్రమే కావాలి అనిపిస్తుందేమో… లేదా, ఆ రోజు పాఠకులు, ఈ రోజు అప్పటికంటే వయసు మీరే వుంటారు కాబట్టి… ఈ ఫిక్షన్ రుచించలేదేమో… ఏమో తెలియదు… ఇంకా గుర్తొస్తే వ్రాస్తాను…
The disclaimer is that Sir,….In no case this is meant to demean you in any way…We all have grown up reading and enjoying your books, in fact following many of your words… Your art of living motivational books were extremely good though the same are available even in english, the native touch and flavour you give makes it more convincing and appealing… In that background thus particular book as a fiction was not so appealing…. But some of the write ups on ways to deal issue in life, even in this book ate extremely good and worth sharing a thousand times.. Wondered for an hour, after writing, whether to share this or not…. I know I will have lot of bricks upon me… యండమూరికి చెప్పేంత వాడివా నువ్వు అని… In fact me too had that feeling exactly… But as you yourself said many times … You should say what you feel if your intention is right… I am doing that…
Share this Article