పార్ట్-2 లోకి వచ్చేశాం కదా… కేటీయార్ అర్హత గురించి…! సీఎం పగ్గాలు చేపట్టేందుకు కేటీయారే ఎందుకు అర్హుడు అనేది ప్రశ్నే… కానీ ఒక కుటుంబ పార్టీలో దానికి భిన్నమైన జవాబు వచ్చే చాన్సే, భిన్న ఆచరణ కనిపించే అవకాశమే లేదు… పైగా కేసీయార్ వారసత్వం అనేది తనకు అనర్హత కాదు… కాబోదు… అది పార్టీ ఇష్టం… ఒక నాయకుడు వైదొలిగినప్పుడు మరో నాయకుడిని సహజంగానే పార్టీ ఎంచుకుంటుంది… ఈ దిశలో మిగతా అందరిలాగా కేటీయార్ కూడా పోటీదారే అవుతాడు… పైగా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంటు… అంటే తన నాయకత్వాన్ని పార్టీ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసినట్టే కదా… సేమ, రేప్పొద్దున కేసీయార్ ఆదేశిస్తాడు… పార్టీ కార్యవర్గాలు తనకు మ్యాండేట్ ఇస్తాయి… పార్టీ ఎమ్మెల్యేలు తనను లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నుకుంటారు… ఖేల్ ఖతం… గవర్నర్ తనతో ప్రమాణస్వీకారం చేయించాల్సిందే కదా… ఇదంతా కేసీయార్ దగ్గరుంచి మరీ పర్యవేక్షిస్తాడు… (రేప్పొద్దున రాజకీయాలు ఎలా మారతాయో, రాజు ఎవరో, బంటు ఎవరో… తన పొలిటికల్ కెరీర్‌లోని చివరి అధ్యాయం బాగుండాలి, తెలంగాణ తీసుకొచ్చిన నేతగా నిలిచిపోవాలి, కెరీర్ పీక్స్‌లోనే రిటైర్ అయిపోవాలి అని కేసీయార్ బలంగా అనుకుంటేనే ఇవన్నీ జరుగుతాయి…)
ఇక ప్రతిపక్షాలేమంటాయి..? ప్రజలేమంటారు..? ఇవీ ప్రశ్నలే… నిజానికి ఇందులో ప్రతిపక్షాల వ్యాఖ్యలకు, విమర్శలకు పెద్ద విలువ ఉండదు… ఎందుకంటే… ఎవరు తమ నాయకుడిగా ఉండాలనేది అధికారంలో ఉన్న పార్టీ ఇష్టం… కాకపోతే పొలిటికల్‌గా కొన్నీ ఈకలు పీకడానికి ట్రై చేయడం తప్ప బీజేపీ, కాంగ్రెస్‌కు పెద్ద స్కోప్ ఏమీ ఉండదు… సీఎంలను తరచూ మార్చడం, వారసత్వ రాజకీయాల కోణంలో కాంగ్రెస్‌కు అసలు మాట్లాడే నైతికార్హతే లేదు… శాసనసభలో బీజేపీ బలం నామ్కేవాస్తే… ఓ రాజకీయ పార్టీగా ఇంకో రాజకీయ పార్టీ ఆంతరంగిక వ్యవహారాల్ని అది ప్రశ్నించలేదు… ‘‘అబ్బే, ప్రజలు కేసీయార్‌ను చూసి ఓటేశారు… కేటీయార్‌ను కుర్చీ ఎక్కించడం అనైతికం, ప్రజాతీర్పుకు విరుద్ధం… ప్రజలు హర్షించరు…’’ అని బహుశా ప్రతిపక్షాలు కామెంట్స్ చేయవచ్చు… కానీ..?
Ads
నిజమే… ప్రజలు కేసీయార్‌ను చూసే వోట్లేశారు… తను ఉంటేనే తెలంగాణకు సుస్థిరత అని నమ్మి వోట్లేశారు… కానీ తనే తప్పుకోవాలని అనుకున్నప్పుడు, ఇక నావల్ల కాదు, సెలవు ఇవ్వండి… అని కేసీయారే ప్రజలకు చెప్పుకున్నప్పుడు… నా బదులుగా ఎవరు సీఎంగా ఉండాలో మీరు వోట్లేసి గెలిపించిన టీఆర్ఎస్ పార్టీయే నిర్ణయం తీసుకుంటుంది అని సమాధానపరిచినప్పుడు…ఇక వాళ్లకు హరీష్ అయినా ఒకటే, కవిత అయినా ఒకటే… కేటీయార్ అయినా ఒకటే… ఈటల రాజేందర్ అయినా ప్రజలకు వోకే… కాకపోతే ఎవరు పార్టీని ఇప్పుడున్న స్థితిలో నడిపిస్తారు అనేదే తలెత్తే ప్రశ్న… కేసీయార్ కొడుకుగానే గాకుండా ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంటుగా, డిఫాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నందున, మొగ్గు కేటీయార్ వైపే ఉంటుంది… మరి తన్నీరు హరీష్ రావు పరిస్థితి ఏమిటి..? తను పార్టీలోనే ఉంటాడా..? కేటీయార్ వారసత్వాన్ని అంగీకరిస్తాడా..? అసలు హస్తినలో గాయిగత్తర అని వీరంగం వేసిన కేసీయార్ అకస్మాత్తుగా కత్తీడాలు ఎందుకు కిందపడేశాడు..? (పార్ట్-3లోకి వెళ్దాం పదండి…)
Share this Article