పార్ధసారధి పోట్లూరి …….. May 9,2023, మాస్కో, రష్యా! విక్టరీ పెరేడ్ పేరుతో ప్రతి సంవత్సరం ఈ రోజున రష్యా భారీ స్థాయిలో మిలటరీ పెరేడ్ నిర్వహిస్తూ వస్తున్నది ! నాజీ జర్మనీ మీద విజయం సాధించిన రోజు May 9 ని ఘనంగా జరుపుకుంటుంది రష్యా ! కానీ నిన్న జరిగిన విక్టరీ పెరేడ్ ని కనుక చూస్తే ఉత్తర కొరియా చాలా బెటర్ అని అనిపించేవిధంగా జరిగింది !
ప్రతి సంవత్సరం ఈ రోజున జరిగే విక్టరీ పెరేడ్ లో తన అత్యాధునిక ఆయుధాలని ప్రదర్శిస్తుంది జస్ట్ రిపబ్లిక్ డే రోజున మన సైన్యం ఎలా చేస్తుందో అచ్చం అలాగే అన్నమాట !
కనీసం గంట 45 నిముషాల పాటు మిలటరీ ఆయుధాల పెరేడ్ జరుతుంది ప్రతి సంవత్సరం ! కానీ నిన్న జరిగిన పెరేడ్ కేవలం 4.30 [నాలుగు నిముషాల ముఫై సెకన్ల లో ] ముగిసిపోయింది !
Ads
ఎలాంటి ఆయుధాలని ప్రదర్శించింది రష్యా ?
1. ఒక T-34/85 యుద్ధ టాంక్. ఇది హెవీ టాంక్ గా పరిగణిస్తారు. 1945-47 ల మధ్య అప్పటి సోవియట్ యూనియన్ ఈ టాంక్ ని సైన్యంలోకి ప్రవేశ పెట్టింది. జర్మనీ టైగర్ టాంక్ ని ఎదుర్కోవడానికి గాను దీనిని ప్రవేశ పెట్టింది సోవియట్.
2. ఒక అరడజను ఇన్ఫాంట్రీ మొబిలిటీ వెహికల్స్ [IMV].
3. కొన్ని ఆర్మూర్డ్ పర్సనల్ వెహికల్స్ [APV].
4. ఒకే ఒక్క ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్ [IFV].
5. కొన్ని ICBM [Inter Continental Ballistic Missile ] సిస్టమ్స్. వీటిని ఖండాంతర క్షిపణులు అంటారు. వీటిని ఉక్రెయిన్ మీద వాడే అవసరం ఉండదు కనుక ఇవి పెరేడ్ లో పాల్గొన్నాయి.
6. వీటి ప్రదర్శన కేవలం 4 నిముషాల 30 సెకన్లలో జరిగిపోయింది.
T-34/85 టాంక్ అనేది మ్యూజియంలో మాత్రమే కనపడే వస్తువు కానీ దానిని పెరేడ్ లో ప్రదర్శించారు. సెల్ఫ్ ప్రొపెల్లేడ్ ఆర్టీలరీ గన్స్ లేవు. టోవ్డ్ ఆర్టీలరీ గన్స్ లేవు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేవు. ఆంఫీబియస్ [నీళ్ళలో, నేల మీద నడవగల ] వెహికల్స్ లేవు. బ్రడ్జింగ్ [అప్పటికప్పుడు నీళ్ళలో తాత్కాలిక బ్రిడ్జ్ లాగా ఉండగలిగే ] వెహికల్స్ లేవు. ఎలక్ట్రానిక్ వార్ ఫెర్ వెహికల్స్ లేవు. కౌంటర్ రాడార్ వెహికల్స్ లేవు. ఇంజినీరింగ్ వెహికల్స్ లేవు. స్కోట్ వెహికల్స్ లేవు.
అంటే దీనర్ధం రష్యా దగ్గర స్పేర్ ఆయుధాలు లేవు. ఇప్పటివరకు వెస్ట్రన్ దేశాలు చెప్తున్న లెక్కలు అటూ ఇటుగా కరెక్ట్ అనే అనుకోవాల్సి ఉంటుంది !
OK! ఉక్రెయిన్ విక్టరీ పరేడ్ మీద దాడి చేస్తుంది అనే భయం ఉండడం వలన అధునాతన ఆయుధాలని ప్రదర్శించలేదు అనుకుందాము ! కానీ మాస్కో నగరాన్ని రక్షించుకోలేనంత దీన స్థితిలో ఉందా ? ఉక్రెయిన్ సరిహద్దుల నుండి ఆర్టీలరీ కానీ హిమార్స్ రాకెట్స్ కానీ ప్రయోగించినా అవి మాస్కో దాకా చేరలేవు !
పైగా అమెరికా ఇచ్చిన హిమార్స్ మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్స్ ని పని చేయకుండా చేసింది రష్యా ! హిమార్స్ రాకెట్స్ GPS ఆధారం చేసుకొని నిర్దేశించిన లక్ష్యాన్ని కొట్టగలదు కానీ రష్యా గత నెల నుండి హిమార్స్ GPS పని చేయకుండా జామింగ్ చేస్తున్నది దాంతో అవి మధ్యలోనే కూలిపోతున్నాయి. ఈ విషయం ఉక్రెయిన్ స్వయంగా ప్రకటించింది. అమెరికా ఇచ్చిన హిమార్స్ MLRS GPS వ్యవస్థని రష్యా జామ్ చేస్తున్నది కాబట్టి ఇంకా ఆధునాతన మయిన రాకెట్ లాంచర్స్ కావాలి అని అడుగుతున్నది ! హిమార్స్ రాకెట్ 40 కిలోమీటర్లు మాత్రమే వెళ్లగలదు కానీ మాస్కో దాకా వెళ్లలేవు కాబట్టి రష్యాకి ఎలాంటి భయం లేదు.
ఇక అధునాతన యుద్ధ టాంక్ ల విషయానికి వస్తే తన T-15 ఆర్మత [Armata] MBT లని మొదటి సారిగా 2015 విక్టరీ పరేడ్ లో ప్రదర్శించింది కానీ ఆ పరేడ్ లో ఒక T-15 బ్రేక్ డౌన్ అయ్యింది అవమానకరంగా ! దాంతో ఆ పరేడ్ లో ఇంకో యుద్ధ టాంక్ కి దానిని కట్టేసి తీసుకెళ్లాల్సి వచ్చింది. అఫ్కోర్స్ అవి ప్రోటో టైపు కాబట్టి టెక్నికల్ గా ఏదో ఇబ్బంది వచ్చి ఉండవచ్చు అనుకున్నారు అప్పట్లో ! 2016 లో పుతిన్ మొత్తం 2,300 T-15 Armata ల తయారీ కోసం ఆర్డర్ చేశాడు కానీ 2020 డెడ్ లైన్ పెట్టాడు పూర్తి చేయడానికి. తరువాత ఆ డెడ్ లైన్ ని 2025 కి పొడిగించారు. ప్రస్తుతం T-15 Armata లు కేవలం 20 మాత్రమే ఉన్నాయి అవీ పూర్తి స్థాయి కాదు కేవలం ప్రోటో టైపువి మాత్రమే ! ఉక్రెయిన్ యుద్ధంలో రెండు T-15 Armata లు కనపడ్డట్లుగా ఉక్రెయిన్ సైనికులు రిపోర్ట్ చేశారు కానీ అవి క్షేమంగా తిరిగి వెళ్లాయా ? కనీసం ఒక్కటన్నా T-15 Armata ని ఎందుకు ఈ విక్టరీ పరేడ్ లో ప్రదర్శనకి తీసుకురాలేదు ? ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే T-15 Armata అనేది అమెరికన్ Abrams-A1M2 కి సరి తూగగల యుద్ధ టాంక్ అని నిపుణులు చెప్పడం వల్లనే !
పుతిన్ తాను మొదలుపెట్టిన యుద్ధం వలన తీవ్రంగా నష్టపోయాడు అని తెలిసిపోతున్నది ! ఆధునిక యుద్ధం అనేది సంవత్సరాల తరబడి కొనసాగితే అది ఆర్ధికంగా తీవ్ర నష్టాలని కలుగచేస్తుంది ! ఈ రోజు పరేడ్ లో ఒక్క హెలీకాప్టర్ కానీ జెట్ ఫైటర్ కానీ కనపడలేదు అంటే అర్ధం చేసుకోవచ్చు రష్యా రిజర్వ్ ఆయుధాలని కూడా ఉక్రెయిన్ లో వాడుతున్నది అని. పుతిన్ తన పూర్తి స్థాయి సైనిక పాటవాన్ని ఇంకా రంగంలోకి దించలేదు అన్న వాదన పస లేనిది !
సగటున రోజుకి 100 క్రూయిజ్ మిస్సైళ్ళని ప్రయోగిస్తూ వచ్చింది రష్యా ! ఈ లెక్కన ఎన్ని వేల క్రూయిజ్, షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్ళని ప్రయోగించి ఉండవచ్చు ? అవేవీ కూడా మిఠాయిలు కాదు వారంలోనో నెల రోజులలోనో తయారుచేయడానికి. అన్ని స్పేర్ పార్ట్ లు ఒకే చోట ఉంచి రాత్రింబవళ్ళు కష్టపడ్డా నెలకి 100 క్రూయిజ్ మిస్సైళ్ళు తయారుచేయగలడం కష్టం ! పైగా అన్నీ రష్యాలోనే తయారు చేసినా కొన్ని ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఆంక్షల వల్ల అవి సులభంగా దొరకడం లేదు రష్యాకి.
ఒక్క క్రూయిజ్ మిస్సైల్స్ మాత్రమే కాదు యుద్ధ టాంకులలో కూడా ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి. అవి కూడా కొన్ని దిగుమతి చేసుకొని తీరాల్సిందే ! అందుకే వేగంగా యుద్ధ టాంకులని తయారుచేయలేకపోతున్నది రష్యా ! ఎస్, రష్యా దగ్గర ఇంకా 3000 లకి పైగా యుద్ధ టాంకులు మూలన పడి ఉన్నాయి కానీ అవి అసెంబ్లింగ్ కి రావాలంటే చాలా విడి భాగాలు విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలి. కొన్నింటిని చైనా ఇస్తున్నా ఇంకా విదేశాల నుండి కొనాల్సినవి ఉండనే ఉంటున్నాయి!
పశ్చిమ దేశాల లెక్కల ప్రకారం మహా అయితే ఇంకో నెల మాత్రమే పుతిన్ యుద్ధం చేయగలడు. పుతిన్ కనుక చేతులు ఎత్తెస్తే నాటో అమెరికాలు కలిసి రష్యాని 7 దేశాలుగా విడగొట్టి తమకి అనుకూలురు అయిన వాళ్ళని అధ్యక్షులుగా నియమించి సహజ వనరులని దోచుకోవాలి అనే ప్లాన్ ! పుతిన్ చేతులు ఎత్తేసే దాకా వస్తే అణు బాంబులు ఉక్రెయిన్ మీదనే కాదు యూరోపు మీద కూడా వేస్తాడు. అంతే కానీ తేలికగా లొంగడు…
Share this Article