పార్ధసారధి పోట్లూరి ……… మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేని రాజీనామా చేయమని ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది సుప్రీం కోర్ట్ ! గత సంవత్సరం మహారాష్ట్రలోని శివసేన పార్టీ రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే ! ఏకనాథ్ షిండే మహారాష్ట్ర శాసనసభలో మెజారిటీ నిరూపించుకొని ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే ! అయితే గత సంవత్సరం ఉద్ధవ్ ధాకరే తన పార్టీ ఎంఎల్ఏ లని మభ్యపెట్టి ఏకనాథ్ షిండే తన పార్టీని చీల్చి బిజేపితో కలిసి కుట్ర పన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాడంటూ సుప్రీం కోర్టు తలుపు తట్టాడు.
ఈ రోజు ఆ కేసు మీద సుప్రీం కోర్టు తుది తీర్పుని వెల్లడించింది !
1. సుప్రీంకోర్టు ప్రధానంగా ఒకే ఒక్క అంశం మీద ఉద్ధవ్ థాకరేకి తలంటింది.
Ads
2. ఉద్ధవ్ థాకరేకి చెందిన శివసేన పార్టీ సభ్యులు విడిపోయి ఏకనాథ్ షిండేతో కలిసినప్పుడు ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర శాసన సభ సమావేశాన్ని ఏర్పాటు చేసి, బల నిరూపణ కోసం స్పీకర్ ని అడగాల్సి ఉంది, కానీ ఆపని చేయలేదు, ఎందుకు అని ఉద్ధవ్ థాకరేని ప్రశ్నించింది !
3. ఉద్ధవ్ థాకరే కనుక శాసనసభలో బల నిరూపణని ఎదుర్కొని ఉంటే అది బాగుండేది. ఒకవేళ విశ్వాసతీర్మానంలో ఓడిపోయినా అప్పుడు తన పార్టీ నుండి చీలిపోయి బయటికి వెళ్ళిన ఎంఎల్ఏ లు అనర్హతకి గురయ్యేవాళ్ళు, కానీ మీరు ఆపని ఎందుకు చేయలేదు అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
4. ఎప్పుడయితే తన పార్టీ నుండి శాసన సభ్యులు బయటికి వెళ్ళి ఏకనాథ్ షిండేతో చేరిపోయారో అప్పుడే మీరు వోటమిని అంగీరించి రాజీనామా చేశారు కానీ అలా చేయకుండా ఉండాల్సింది అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
5. ఎలక్షన్ కమిషన్ తన బాధ్యతని తాను నిర్వర్తించింది : శివసేన ఉద్ధవ్ ఠాక్రె కే ‘కాగడా గుర్తుని ‘ ఇచ్చి ఏకనాథ్ షిండేకి అసలయిన శివసేన ఎన్నికల గుర్తు ‘బాణం ‘ ని ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రక్రియని మేము వెనక్కి తీసుకోమని చెప్పలేము అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
6. అయితే అప్పటి మహారాష్ట్ర గవర్నర్ అయిన భగత్ సింగ్ కోషియారీ చర్యని తప్పుపట్టింది సుప్రీం కోర్టు. గవర్నర్ ఏకనాథ్ షిండేని బల నిరూపణ చేయమని అడగడం తప్పు అంది. కానీ యుద్ధం చేయకుండానే ఉద్ధవ్ థాకరే కత్తి కింద పడేసిన తరువాత ఎవరయినా చేయగలిగేది ఏముంటుంది ? సదరు న్యాయమూర్తులు ఒక పక్క ఉద్ధవ్ ని రాజీనామా చేయకుండా ఉండాల్సింది అంటూనే గవర్నర్ చర్యని తప్పు పట్టడంలో ఆంతర్యం ఏమిటో అంతుపట్టదు.
7. అయితే మహారాష్ట్ర శాసన సభ స్పీకర్ నిర్ణయం మీద ఎలాంటి వ్యాఖ్య చేయకపోగా ఒక స్పీకర్ గా ఆయన అధికారాలని ప్రశ్నించలేము అంటూ ఆయనకి ఆ అధికారం ఉంది అని వ్యాఖ్యానించింది.
8. సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం మొత్తం 8 పిటీషన్ల ని కలిపి విచారించింది. మొత్తం 5 గురు న్యాయమూర్తులతో ఏర్పాటు చేసిన ఈ ధర్మాసనంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి YV చంద్రచూడ్ అధ్యక్షతన విచారణ జరిగింది.
9. ఇక ఉద్ధవ్ థాకరే తరుపున న్యాయవాది కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ లు వాదించారు.
10. ఏకనాథ్ షిండే తరపున ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే , నీరజ్ కౌల్, మహేష్ జెఠ్మలానీ వాదించారు.
అసలు దీనికంతటికీ ప్రధాన కారకుడు అయిన వృద్ధ జంబూకమ్ శరద్ పవార్ ని తలుచుకోకుండా ముగిస్తే మహా పాపం అవుతుంది! శరద్ పవార్ కి తన కుటుంబం నుండే భవిష్యత్తులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలి .. అది సుప్రియా సూలే అన్న సంగతి అందరికీ తెలుసు. శివసేనని అడ్డు తొలిగించుకోవాలి అంటే పార్టీని చీల్చడం ఒక్కటే పరిష్కారం ! శివసేనని అడ్డుతొలగించుకుంటే భవిష్యత్తులో తన కుటుంబానికి పోటీ ఉండదు మహారాష్ట్ర లో.
ఉద్ధవ్ కి ఎంత రాజకీయం తెలుసో పవార్ కి బాగా తెలుసు, కానీ వారసుడు బేబీ పెంగ్విన్ ఒకడు ఉన్నాడు కాబట్టి వారసత్వం అనే దానిని తెగగొట్టాలి అంటే ఒక్కటే మార్గం ఉంది , అది పార్టీని చీల్చడం ! వెనుక వెనుక ఉంటూనే అ పని కానిచ్చేశాడు. లేకపోతే ఎవరి సలహా తీసుకొని ముందే ఉద్ధవ్ థాకరే రాజీనామా చేశాడు ? ఈ పాయింట్ ఎవరి దృష్టికీ ఎందుకు రాలేదు ? అదే తలపండిన రాజకీయం అంటే !
నెల క్రితం సుప్రీం కోర్టు ఒక వ్యాఖ్య చేసింది : కేసు విచారణ సందర్భంగా గవర్నర్ కి అ అధికారం ఎక్కడ ఉంది ?అనే సరికి అందరూ సుప్రీం కోర్టు ఏకనాథ్ షిండేకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నది అంటూ ఊహాగానాలు చేశారు. అఫ్కోర్స్ అందరి దృష్టి అజిత్ పవార్ మీదకి వెళ్ళింది, ఒకవేళ షిండే ప్రభుత్వం కూలిపోతే అజిత్ పవార్ NCP ని చీల్చి బిజేపికి మద్దతు ఇస్తాడు అని. కానీ అలా జరగలేదు !
ఇంత జరిగినా సంజయ్ రౌత్ నైతికంగా విజయం మాదే అని అరిగిపోయిన రికార్డ్ పెట్టాడు ! ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడే కాదు, ఎప్పటికీ తెలుసుకోలేడు, తనని ముంచింది ఇంకా ముంచుతున్నది సంజయ్ రౌత్ మరియు శరద్ పవార్ లు అని.
So ! అలా ఏకనాథ్ షిండే ముందు ముందు అధికారంలో కొనసాగబోతున్నాడు అన్నమాట! ఇక వచ్చే ఎన్నికల్లో ఏకనాథ్ షిండేకి ఎన్ని సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి కాలేడు ! ఆ అవకాశం ఇప్పటికే బిజేపి ఇచ్చేసింది ! చాలామంది ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి ఏమిటీ ? ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి ఏమిటీ అని నొసలు చిట్లించారు గుర్తుందా? ఇప్పటికీ అయినా అర్ధం చేసుకోగలుతారా ?
Share this Article