పాకిస్థాన్ ఇండియాను ఎన్నిరకాలుగా దెబ్బకొట్టాలో, అన్నిరకాల్లోనూ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉంటుంది… ప్రత్యేకించి ఐఎస్ఐ చేయని ప్రయత్నమంటూ లేదు… చివరకు తమ దేశానికి చెందిన డ్రగ్ డాన్‌ను కూడా వాడుతోంది ఇప్పుడు…
రెండు రోజుల క్రితం ఓ పాకిస్థానీ కార్టల్ నుంచి వచ్చే 2.5 టన్నుల మెథంఫెటమిన్ మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్న వార్త చదివారు కదా… నిజానికి మెయిన్ స్ట్రీమ్ దాని ఇంపార్టెన్స్ పట్టుకోలేకపోయింది కానీ కొన్ని ఇంగ్లిష్ సైట్స్ ఆసక్తికరమైన కథనాలు పబ్లిష్ చేశాయి… ఇష్యూ చాలా సీరియస్…
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ 25 వేల కోట్లు… ఇంత భారీగా డ్రగ్స్ సీజ్ చేయడం మన నార్కొటిక్స్ బోర్డు చరిత్రలో ఇదే ప్రథమం… అసలు ఇక్కడ ఆ డ్రగ్స్ విలువ కాదు, చెప్పుకోదగింది… సదరు డ్రగ్స్ ఆపరేటర్, కింగ్ పిన్… డాన్… ఐఎస్ఐకు చేస్తున్న సాయం గురించి…
Ads
ఈ కింగ్ పిన్ పేరు హాజీ సలీం… బోలెడు మంది హజీ మస్తాన్లకు దీటు… పాకిస్థాన్‌లోనే ఉంటాడు… పేరు మోసిన అంతర్జాతీయ డ్రగ్ డాన్… వెరీ నొటోరియస్ కొలంబియా డ్రగ్ లార్డ్ ఎస్కోబార్ తరహాలో సలీం కూడా ఎప్పుడూ ఓ స్థిరమైన స్థావరంలో ఉండడు… ఇరాన్, మాల్దీవులు, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ ల నుంచి తన వ్యాపారాన్ని నిర్వహిస్తుంటాడు…
ఏకే-47లు కలిగిన బాడీ గార్డులు ఎప్పుడూ తనకు రక్షణ… శాటిలైట్ ఫోన్లు మాత్రమే వాడుతుంటాడు… పాకిస్థాన్‌లో ఉన్నప్పుడు బెలూచిస్థాన్‌లో కాలం గడుపుతుంటాడు… ఇప్పటికే డీజీ స్థాయి అధికారుల భేటీలో ఇండియా ఇతని వివరాల్ని పాకిస్థాన్, ఇరాన్, అఫ్గనిస్థాన్‌లకు అందించింది… కానీ ఆ దేశాలన్నీ ఇతని పట్ల చూసీచూడనట్లు ఉండేవే కాబట్టి రిజల్ట్ కనిపించలేదు…
ఇతనికి దావూద్ ఇబ్రహీంతో బలమైన సంబంధాలున్నయ్… తనకు ఐఎస్ఐ సంబంధాలు జగమెరిగినవే… సో, ఐఎస్ఐ కొన్ని విషయాల్లో హజీ సలీం సాయం తీసుకుంటోంది… ప్రత్యేకించి ఇండియాలో డ్రగ్స్ వ్యాపార విస్తరణ మాత్రమే కాదు… ఇండియాకు వ్యతిరేకంగా ఎల్‌టీటీఈని బలోపేతం చేసే పనిలో ఉన్నాడు… అసలే ఖలిస్థానీ శక్తులు బలపడి, పంజాబ్‌ను కైవసం చేసుకుని, ఇండియా సార్వభౌమత్వానికి సవాళ్లు విసురుతున్న దశలో ఎల్టీటీఈ కూడా బలపడితే ఇండియాకు మరింత ప్రమాదం… అసలే తమిళనాడులో ఎల్టీటీఈ సానుభూతిపర ప్రభుత్వం ఉంది…
హజీ సలీం తరఫున పనిచేసే కొందరిని ఆమధ్య ముంద్రా పోర్టులో పట్టుకుని కోర్టులో హాజరుపరిచింది ఎన్ఐఏ… వాళ్ల నుంచి తెలిసిన వివరాలతో అధికారులే షాక్‌కు గురయ్యారు… డ్రగ్స్‌ను కార్టల్స్‌కు సరఫరా చేసేందుకు ముందుగా సొమ్ము తీసుకోడు సలీం… అప్పుగా ఇస్తాడు… అవి అమ్ముకుని డబ్బు చెల్లించవచ్చు… అదీ హవాలా పద్ధతిలో…
కార్టల్స్‌కు ఇచ్చే డ్రగ్స్‌కు సంకేత నామాలను వాడుతుంటాడు… పాకెట్లపై ప్రత్యేకంగా గుర్తులు కూడా ఉంటాయి… వాటి ప్రకారం ఏ కార్టల్స్‌కు వెళ్లాల్సిన డ్రగ్స్ వాళ్లకే వెళ్తాయి… 999, 777, రోలెక్స్, 555, తేలు, బిట్ కాయిన్, ఫ్లయింగ్ హార్స్, కింగ్ 21… ఇలా ఉంటాయి పేర్లు… ఎన్సీబీ, డీఆర్ఐ, ఎన్ఐఏ సంస్థలు ఇప్పుడు ఈ హజీసలీంపై కాన్సంట్రేట్ చేస్తున్నాయి… ఎందుకంటే..?
ఇతను శ్రీలంకలోని డ్రగ్ మాఫియా డాన్స్ సి.గుణశేఖరన్ అలియాస్ గుణ మరియు పుష్పరాజ్ అలియాస్ పూకుట్టి కన్నాలతో చేతులు కలిపాడు… వీళ్లంతా ఎల్టీటీఈని పునరుద్ధరించే పనిలో ఉన్నారు… ఇండియాలో స్థావరాల నిర్మాణం కోసం డబ్బు కావాలి కదా, డ్రగ్స్ ఇస్తారు… ఆయుధాలకూ అదే డబ్బు…
సలీం ఎక్కువగా శ్రీలంక పడవలే వాడుతుంటాడు తన డ్రగ్స్ రవాణాకు… ఏడు పొరల్లో ప్యాక్ చేసిన డ్రగ్స్‌పై కోస్ట్ గార్డ్ కన్నుపడితే వెంటనే శ్రీలంక, మాల్దీవులకు పారిపోతుంటారు… ఎక్కువగా 25, 30 కిలోల చొప్పున చిన్న చిన్న కన్‌సైన్‌మెంట్లలో డ్రగ్స్ తరలిస్తుంటారు… కేరళ తీరంలో ఇండియాకు వస్తుంటాయి పడవలు… ఇండియా, శ్రీలంక ఫిషర్‌మెన్ వీళ్లకు సమాచార వారధులు…
ఈ డ్రగ్స్ రాకెట్‌ను దెబ్బతీయడానికి ఇండియా ‘ఆపరేషన్ సముద్రగుప్త’ పేరిట కాన్సంట్రేట్ చేస్తోంది… ఇప్పటికి దాదాపు 40 వేల కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయంటే హజీ సలీం ఏ రేంజులో ఇండియాలోకి డ్రగ్స్ పుష్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు…!!
Share this Article