2009లో గుజరాత్ నుంచి మన సైన్యంలోకి చేరినవాళ్ల సంఖ్య 719… ఆ రాష్ట్రానికి అదే రికార్డు… 2008లో, 2007లో జస్ట్ 230 మాత్రమే… పది లక్షల మందికిపైగా ఉన్న భారతీయ సైన్యంలోకి గుజరాతీలు ఎందుకు చేరరు..? ఇదెప్పుడూ ఓ ప్రశ్నే… దేశరక్షణకు ఆ ప్రజలు ఎందుకు ముందుకు రారు..? ఇదెప్పుడూ ఓ విమర్శే… ప్రధాని పదవి దాకా ఎదుగుతారు, కానీ తుపాకీ ఎందుకు పట్టుకోరు..? ఇదెప్పుడూ ఓ పజిలే… గుజరాత్ జనాభాలో, విస్తీర్ణంలో సగం కూడా లేని నేపాల్, అదీ మన దేశం కూడా కాదు… అక్కడి నుంచి ఇప్పటికీ గుజరాతీలకన్నా చాలా ఎక్కువగా మన సైన్యంలోకి చేరతారు… ఇదెప్పుడూ ఓ మరకే…! ఈ ఒక్క రాష్ట్రాన్ని కాసేపు పక్కన పెడదాం… అసలు దేశంలోని ప్రతి ప్రాంతం నుంచీ సైన్యంలోకి ఎందుకు రాకూడదు..? ఈ సైన్యం మాది, ఈ దేశం మాది, దీన్ని రక్షించే బాధ్యతలో మేం కూడా అనే భావన ఎందుకు రాకూడదు..?
సరిగ్గా ఈ పాయింట్ మీద ఆధారపడి ఓ బిల్లు తీసుకురాబోతోంది కేంద్రప్రభుత్వం… ప్రస్తుతం డ్రాఫ్ట్ రూపకల్పన దశలో ఉన్న ఆ పాలసీ ఏం చెప్పబోతోందీ అంటే..? ఆర్ఎంపీ ఆధారంగా దేశంలోని ప్రతి ప్రాంతమూ సైన్యంలోకి పంపించాలి… ఆర్ఎంపీ అంటే రిక్రూటబుల్ మేల్ పాపులేషన్… అంటే జనాభాను బట్టి సైన్యంలో చేరదగిన పురుషుల సంఖ్య… ఇంకొన్ని వివరాలు చూద్దాం…
Ads
- వాయువ్య రాష్ట్రాలు… అంటే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, జమ్ము-కాశ్మీర్, చండీగఢ్ కలిపి మన దేశం మొత్తం జనాభాలో 7.47 శాతం ఉంటారు… కానీ సైన్యంలో వీటి వాటా 21.19 శాతం…
- ఉత్తరప్రదేశం విస్తీర్ణం ఎక్కువ, జనాభా ఎక్కువ… అందుకని అక్కడి నుంచి సైన్యంలో చేరికలు ఎక్కువే… ఉత్తరాఖండ్ మిగతా వారందరితో పోలిస్తే… దాని విస్తీర్ణం, దాని జనాభాతో పోలిస్తే… సైన్యంలోకి చేరేవాళ్ల సంఖ్య చాలా ఎక్కువ…
- దాదాపు 13.5 లక్షల జవాన్లు, జేసీవోలు, ఎయిర్‌మెన్, సెయిలర్లలో వాయవ్య రాష్ట్రాల వాళ్లు 2.85 లక్షలు…
నిజానికి ఏ ప్రాంతం నుంచి సైన్యంలోకి ఎక్కువ మంది చేరతారు అనేది ప్రభుత్వం కోణం నుంచి కాదు… ఆయా ప్రాంతాల జనాభా, సంస్కృతిని బట్టి పరిశీలించాలి… ఉదాహరణకు పంజాబ్, హర్యానా… సిక్కుల్లోని కొన్ని వర్గాల వాళ్లు సైన్యంలో ఉండటాన్ని గొప్పగా చెప్పుకుంటారు… అవి పోరాడే కులాలు… నేపాల్‌లోని గూర్ఖాలు కూడా అంతే… ప్రతి ప్రాంతంలోనూ ఈ జాతులుంటయ్… గుజరాత్‌లోనూ లేరని కాదు… క్రమేపీ వాళ్లు ఇతర వృత్తుల వైపు మళ్లారు… ఒక్కసారి ఈ చార్ట్ చూడండి… అధికారిక లెక్కలే… ఆర్ఎంపీ మేరకు చేరికలు ఉండటం లేదు… దాన్ని సైన్యం పెద్ద సీరియస్‌గా ఏమీ పరిగణించదు… ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలు పెడుతూ పోతుంది… అర్హులను చేర్చుకుంటుంది… ఏ ప్రాంతాల్లోనైతే చేరికలు సంప్రదాయికంగా ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువ ఫోకస్ పెడుతుంది… మరి అవసరాలు తీరుతున్నప్పుడు… రాబోయే రోజుల్లో సైన్యం కుదింపు అనేది ప్రధానం కాబోతున్నప్పుడు… అన్ని ప్రాంతాల నుంచీ సైన్యంలో చేరికలు ఉండాలనే పాలసీ, ప్రయత్నం అవసరమా అనేది పెద్ద ప్రశ్న…
Sl. No. | Name of States & UTs | Recruiting Year | ||
2016-17 | 2017-18 | 2018-19 | ||
Vacancies | 54815 | 52839 | 57266 | |
1 | Andhra Pradesh | 1389 | 1431 | 1301 |
2 | Telangana | 515 | 643 | 693 |
3 | Tamil Nadu, A&N Islands & Puducherry | 1886 | 1875 | 1539 |
4 | Arunachal Pradesh | 156 | 217 | 195 |
5 | Assam | 829 | 900 | 631 |
6 | Bihar | 2932 | 2726 | 2199 |
7 | Chathisgarh | 817 | 606 | 372 |
8 | Delhi | 798 | 166 | 167 |
9 | Goa | 16 | 1 | 02 |
10 | Gujarat, Dadar Nagar Haveli & Daman & Diu | 1257 | 728 | 1346 |
11 | Haryana | 3538 | 3634 | 3210 |
12 | Himachal Pradesh | 2174 | 2376 | 4202 |
13 | Jammu & Kashmir | 1954 | 1817 | 3672 |
14 | Jharkhand | 687 | 925 | 663 |
15 | Karnataka & Lakshadweep | 1157 | 1417 | 1693 |
16 | Kerala | 1584 | 1278 | 865 |
17 | Madhya Pradesh | 2281 | 2352 | 1570 |
18 | Maharashtra | 3980 | 3836 | 4050 |
19 | Manipur | 247 | 400 | 311 |
20 | Meghalaya | 86 | 75 | 89 |
21 | Mizoram | 200 | 108 | 184 |
22 | Nagaland | 112 | 103 | 122 |
23 | Odisha | 642 | 737 | 474 |
24 | Punjab & Chandigarh | 4618 | 4991 | 5846 |
25 | Rajasthan | 4658 | 4298 | 4172 |
26 | Sikkim | 39 | 109 | 227 |
27 | Tripura | 89 | 55 | 69 |
28 | Uttar Pradesh | 6245 | 6339 | 6322 |
29 | Uttarakhand | 3360 | 2384 | 3222 |
30 | West Bengal | 2116 | 1862 | 1471 |
31 | Nepal | 1724 | 1049 | 2502 |
Total | 52086 | 49438 | 53378 | |
Recruitment Intake Percentage | 96 | 95 | 94 |
Share this Article