ఫాఫం… మంత్రి అజయ్ వచ్చి, మీ తాత విగ్రహం పెడుతున్నాం, నువ్వే చీఫ్ గెస్టు, నువ్వు తప్ప ఇంకెవరున్నారు, ఆయన నిజమైన వారసులు అనగానే జూనియర్ ఎన్టీయార్ పొంగిపోయాడు… ఆహా, ఎన్టీయార్ వారసుడిగా యావత్ ప్రపంచం నన్నే గుర్తిస్తోందనే ఆనందంతో… ఓసోస్, అదెంత పని… తాత శత జయంతి ఉత్సవాలకు ఎవరు ఎక్కడికి ఆహ్వానించినా వస్తాను, రావడానికి రెడీ అనేశాడు… ఖమ్మంలో ఎన్టీయార్ విగ్రహ ఆవిష్కరణకూ సై అన్నాడు…
అది ఓ కులచిహ్నంగా రూపుదాల్చుకుంటోందని తనకు తెలుసో లేదో తెలియదు… ఒక వ్యక్తిని దేవుడిగా చిత్రీకరిస్తూ, ఆ దేవుడికి ద్రోహం చేస్తున్నారు కదా అనే సోయి కూడా ఉందో లేదో తెలియదు… లేక ఎన్టీయార్ కుటుంబంలో అంత మంది ఉన్నా, చాలా ఏళ్లపాటు తనను ఆ కుటుంబం దూరంగానే ఉంచినా, ఇప్పుడు లోకం తననే తాత రక్తానికి వారసుడిగా చూస్తుందనే ఆనందమైకంలో తత్వం బోధపడనట్టుంది…
హైకోర్టు వాయించేసరికి ఆ విగ్రహం నుంచి ఇప్పుడు నెమలి పింఛం పీకేశారు… పిల్లనగ్రోవిని లాగేశారు… అంతెందుకు..? కృష్ణుడంటేనే నీలమేఘ శ్యామవర్ణం కదా, ఆ రంగే మార్చేస్తే సరి, ఇప్పుడిక ఆ విగ్రహం కృష్ణ విగ్రహం గాకుండా పోతుంది కదాని కోర్టు కళ్లకూ గంతలు కట్టడానికి, జనం చెవుల్లో పూలు పెట్టడానికి విగ్రహం రూపురేఖలే మార్చేస్తున్నారు… మరోవైపు జనంలో వ్యతిరేకత పెరుగుతోంది… ప్రత్యేకించి యాదవసంఘాలు అవసరమైతే ఆ విగ్రహం అంతు తేలుస్తామనీ బెదిరిస్తున్నాయి…
Ads
సదరు మంత్రి కులాభిరుచి పట్ల ఎలాగూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి… రాబోయే రోజుల్లో ఎలాగూ రాజకీయ రంగప్రవేశం చేయాలనే ఆకాంక్ష, ఆశలు ఉన్నవాడే కదా జూనియర్… ఈ స్థితిలో ఇప్పుడు జరుగుతున్న రచ్చ తనకు లాంగ్ రన్‌లో నష్టం చేకూరుస్తుందని జూనియర్ అర్థం చేసుకున్నాడో, లేక ఎవరైనా చెప్పారో గానీ కళ్లు తెరుచుకున్నాయి… ఈ పంచాయితీల్లోకి వెళ్తే… తన సినీ కెరీర్‌కూ నష్టం, తన రాబోయే పొలిటికల్ కెరీర్‌కూ నష్టం అనుకున్నట్టున్నాడు… 20న హైదరాబాదులో జరగబోయే ఎన్టీయార్ శతజయంతి ఉత్సవాలకూ డుమ్మా కొడుతున్నాడు… ఇదీ ఒక WhatsApp వార్త…
Official Information –
We regret to inform that Sri Jr NTR garu will not be able to attend the NTR Shatajayanthi Utsavalu event to be held on 20th May at Hyderabad due to prior family commitments as his 40th birthday falls on the same day. The organising committee was informed about the same at the time of invitation
అబ్బే, నా 40 వ బర్త్‌డే ఉత్సవాల కోసం ముందస్తుగా కొన్ని ఫ్యామిలీ కమిట్‌మెంట్స్ ఉన్నాయి… అందుకని రాలేకపోతున్నాను అంటున్నాడుట… వాట్సప్ వార్తలు ఇదే చెబుతున్నాయి… ప్రభాస్, కల్యాణరామ్, జూనియర్ తదితరులు ఈ ఉత్సవాలకు హాజరవుతున్నట్టు వార్తలు వచ్చాయిగా… ఇప్పుడు జూనియర్ నిర్ణయంతో ఆ ఉత్సవాల జోష్‌కు పంక్చర్ పడినట్టయింది… ఇక కల్యాణరామ్ కూడా వెళ్లకపోవచ్చు… అంతేకాదు, ఖమ్మం విగ్రహావిష్కరణకు కూడా జూనియర్ వెళ్లడం అనేది సందేహంలో పడినట్టే… అసలే హైకోర్టు కొరడా, జూనియర్ భయసందేహాలు, సమాజంలో రచ్చ… ఎన్టీయార్ విగ్రహంతో ఏదో లబ్ది పొందాలనుకున్న మంత్రి అజయ్‌కు ‘‘అనుకున్నది ఒకటి- అయినది ఒకటి’’ అన్నట్టుగా ఎదురుదెబ్బ…!!
Share this Article