మళ్లీ మళ్లీ అదే అదే… ఎన్టీయార్‌కు భారతరత్న ఇవ్వాలి… అదే డిమాండ్… నిజంగా మదిలో ఏదైనా మెసిలి మోడీ భారతరత్న ప్రకటిస్తే..? ఎన్టీయార్ భార్య లక్ష్మిపార్వతి వెళ్లి ఆ పురస్కారాన్ని తీసుకుంటే ఇదే చంద్రబాబు సహిస్తాడా..? ఇదొక ప్రశ్న… సరే, దాన్నలా వదిలేస్తే…
హైదరాబాద్ శతజయంతి ఉత్సవాలను ఆ కూకట్‌పల్లి పరిధిలోనే ఎందుకు నిర్వహించారు..? అక్కడైతే జనాన్ని సమీకరించడం సులభమనేనా..? ఇదీ కట్ చేయండి… తెలుగు తారాగణం వచ్చారు, కొందరు టాప్ హీరోలు, ఇండస్ట్రీ మీద పెత్తనాలు చేయాలనే ఆకాంక్షలు ఉన్నవాళ్లు ఎందుకు హాజరు కాలేదు..? ఇది అచ్చంగా ఓ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా మారిపోయిందనేనా..?
అబ్బే, అదేమీ లేదు… సీతారాం ఏచూరి, డి.రాజా కూడా వచ్చారుగా… అంతెందుకు దత్తాత్రేయ పేరు కూడా కనిపించిందిగా వార్తలో… అలా ముద్ర ఎలా వేస్తాము అంటారా..? నిజంగానే ఏచూరి, రాజా రావడం కాస్త విచిత్రంగానే కనిపించింది… సీతారాం ఏచూరి తెలుగువాడు అర్థం చేసుకుందాం… దత్తాత్రేయ కూడా అంతే… పురంధేశ్వరి సొంత బిడ్డ… మరి ఈ రాజా రాకకు కారణమేమిటబ్బా…? మామూలుగా ఇలాంటి కార్యక్రమాల్లో పెద్దగా కనిపించని లెఫ్ట్ కేరక్టర్లు ఇందులో కనిపించడం ఒకింత విస్మయకరమే…
Ads
ఇన్నాళ్లూ యుగపురుషుడు అని కీర్తించిన టీడీపీ క్యాంపు ఇప్పుడిక ఏకంగా శకపురుషుడు అని భజిస్తోంది… ఈనాడు వార్తలో సైతం… ఇది పస్ట్ పేజీ బ్యానర్ స్టోరీ… వావ్… వోకే, తెలుగు ఇండస్ట్రీలో కమ్మ ఆధిపత్యానికి బీటలు కొట్టిన ప్రముఖ కాపు కేరక్టర్లు, హీరోలు ఈ కార్యక్రమంలో ఎందుకు కనిపించలేదు… అదీ హైదరాబాదులో కార్యక్రమం జరుగుతుంటే..? సరే, అదీ పక్కన పెట్టేద్దాం… ఎన్టీయార్‌కు ఇప్పటికే నిజమైన నటవారసుడిగా, కాబోయే రాజకీయ వారసుడిగా చెప్పబడుతున్న మనమడు జూనియర్ ఎన్టీయార్ ఎందుకు రాలేదు..?
ఓ సమాచారం తెలిసింది… జూనియర్ ఎన్టీయార్ ఓ వీడియో సందేశం పంపిస్తానన్నా బాలకృష్ణ అంగీకరించలేదట… ఎందుకలా జూనియర్‌ను దూరం పెట్టినట్టు..? తన బర్త్ డే కార్యక్రమాల వల్ల దీనికి రాలేకపోతున్నాననే జూనియర్ ప్రకటన కేవలం ఓ మొక్కుబడి యవ్వారమేనా..? ఆ కుటుంబం ఈరోజుకూ జూనియర్‌ను మనస్పూర్తిగా విలీనం చేసుకోవడం లేదా..? లేక జూనియర్ గనుక రాజకీయాల్లో క్లిక్కయితే తన అల్లుడు లోకేష్‌కు నష్టమని బాలకృష్ణ భావిస్తూ, జూనియర్‌పై కుతకుతలాడుతున్నాడా..?
అసలే ఖమ్మం చెరువులో కృష్ణుడి వేషంలో ఎన్టీయార్ విగ్రహం పెట్టాలనుకుంటేనే తెలంగాణ సమాజం నుంచి తిరస్కరణ ఎదురవుతోంది… హైకోర్టు కూడా స్టాప్ అనేసింది… అలాంటిది హైదరాబాదులో ఏకంగా 100 అడుగుల విగ్రహం పెడతారట… పైగా ప్రతి ఇంట్లో ఎన్టీయార్ ఫోటోకు దండేసి, నివాళ్లు అర్పించాలని ప్రముఖ వెన్నుపోటుదారుడు చంద్రబాబు పిలుపు… అసలు విషయం చెప్పడం మరిచేపోయాను…
ఈ కార్యక్రమానికి తెలంగాణ టీడీపీ నేతలు చాలామంది వచ్చారు… హాజరైన సినీ ప్రముఖులు కూడా టీడీపీ కార్యక్రమంలా సాగుతున్న తీరు చూసి విస్తుపోయారట… ఇక్కడ పార్టీ కార్యవర్గాన్ని మార్చేసి, ఇక తెలంగాణలో మళ్లీ బలపడాలని చంద్రబాబు కోరుకుంటున్నాడు… కేసీయార్ కొట్టిన దెబ్బలకు కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ వదిలేసి, తెలంగాణ తెలుగుదేశాన్ని నట్టేట ముంచేసి వెళ్లిన చంద్రబాబుకు మళ్లీ తెలంగాణ తెలుగుదేశంపై ప్రేమ కుదురుతోంది… అఫ్ కోర్స్, ఒక్క చంద్రబాబేం ఖర్మ… షర్మిల, పవన్ కల్యాణ్‌కు కూడా తెలంగాణ అంటే అమితమైన ప్రీతి ఇప్పుడు…
‘‘ఎన్టీయార్ ఫ్యాన్స్ పేరిట టీడీపీ జనసమీకరణ, దాన్ని చూపించుకోవడం, ఒక పార్టీ పొత్తు కోసం వెంపర్లాట తప్ప ఇందులో ఎన్టీయార్ పట్ల నిజమైన సిన్సియారిటీ ఏముంది సార్..? అని ఓ మిత్రుడి విశ్లేషణ… అవునూ, టీడీపీ షో అయినందుకేనా బీఆర్ఎస్ పార్టీ దీన్ని పట్టించుకోలేదు..? హైదరాబాదులో జరిగినా బీఆర్ఎస్ నేతలు ఎవరూ వెళ్లలేదు..? మొత్తానికి చంద్రబాబు ప్లానింగు సక్సెసయినట్టేనా..? ! పోనీ, ఇంకా ఇలాగే సక్సెసవుతుందా..?
Share this Article