నిజానికి ఇది పెద్ద సబ్జెక్టు… జరగాల్సినంత చర్చ కూడా జరగడం లేదు… జాతీయ పార్టీలు ఎలాగూ మాట్లాడవు… సౌతిండియాలోని ప్రాంతీయ పార్టీలకు ఇంకా జ్ఞానబుగ్గలు వెలిగినట్టు లేదు… ఇది సీరియస్ సబ్జెక్టే… కాస్త వివరాల్లోకి వెళ్తే… ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎంపీ సీట్ల డీలిమిటేషన్ 2026లో జరగనున్నట్టు ఢిల్లీ సర్కిళ్లలో ఓ ప్రచారం సాగుతోంది…
కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత పోకడ చూడబోతే ఇప్పట్లో జనగణన జరిగేట్టు లేదు… నిజానికి సెన్సెస్ జరిగితేనే, ఆ జనాభా వివరాలను బట్టి ఎంపీ సీట్ల పునర్వ్యవస్థీకరణ జరిగితేనే అది శాస్త్రీయం… ఐనాసరే 2026 డీలిమిటేషన్ జరుగుతుందీ అంటే పాత 2011 జనాభా లెక్కలను బట్టి చేస్తారా..? అదే జరిగితే అది అశాస్త్రీయం, లోెపభూయిష్టం అవుతుంది…
వాస్తవానికి జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా బెటర్… ఈ కోణంలో ప్రగతి చూపని బీమార్ రాష్ట్రాలను నిధుల పంపిణీ విషయంలో డిస్కరేజ్ చేయాల్సి ఉండింది… కానీ వెనుకబడిన రాష్ట్రాలు పేరిట ఆ రాష్ట్రాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చి, మెరుగైన ప్రగతి సూచికల్ని కనబరిచిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేశారు… ఇప్పుడు జరగబోయే అన్యాయం మరింత పెద్దది…
Ads
గతంలో ఎంపీ సీట్ల డీలిమిటేషన్ జరిగినప్పటికీ ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదలతో పోలిస్తే… తూర్పు, ఈశాన్య, ఉత్తర రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల చాలా ఎక్కువ… దీంతో జనాభాను బట్టి ఎంపీ సీట్ల డీలిమిటేషన్ జరుగుతుంది కాబట్టి సహజంగానే దక్షిణ రాష్ట్రాలకు తక్కువ ఎంపీ సీట్లు, ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీ సీట్లు అదనంగా రాబోతున్నయ్… తద్వారా పార్లమెంటులో, అంటే దేశంలో దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం ఘోరంగా పడిపోనుంది… ఎలా అంటే, ఇదుగో ఉదాహరణ…
State: Current Seats / Increased Seats
రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు డబుల్ కాబోతుండగా, యూపీలో సీట్ల సంఖ్య డబుల్‌కన్నా ఎక్కువ కాబోతున్నయ్… అంటే వాళ్లు చెప్పిందే పార్లమెంటులో చెల్లుబాటు… వాళ్లకే విలువ… ఉత్తరాదిపై ఎవరు ఎక్కువ పట్టు చూపిస్తే ఆ పార్టీకే అధికారం… అంటే రఫ్‌గా చెప్పాలంటే బీజేపికి ప్రయోజనకరం… దానికి దక్షిణాది అస్సలు కొరుకుడు పడటం లేదు… సో, దక్షిణాదిని పక్కన పెట్టేసినా, మిగతా దేశంలో సాధించే సీట్లతో అధికారం కైవసం చేసుకోవాలి… అంటే, దక్షిణాదిలో సీట్లు పెద్దగా పెరగకూడదు, మిగతా ప్రాంతాల్లో పెరగాలి… జరగబోతున్నదీ అదే…
Share this Article