షకీల్ బస్రా, అమర్‌ప్రీత్ సమ్రా, జగదీప్ చీమా, రవీందర్ సమ్రా, బరిందర్ ధలివాల్, గురుప్రీత్ ధలివాల్, సమరూప్ గిల్, సుఖదీప్ పన్సల్, సమదీష్ గిల్, ఆండీ పియెరె, రిచర్డ్ జోసెఫ్ విట్‌లాక్…. మొత్తం పదకొండు మంది… ఇందులో ఆండీ, రిచర్డ్ తప్ప మిగతా 9 మందివీ పంజాబ్ రూట్స్… అందరూ సిక్కులే… వీళ్లెవరో చెప్పలేదు కదూ… కెనడా బేస్‌గా మాఫియా వ్యవహారాల్ని ఓ రేంజులో నడిపిస్తున్న బడా గ్యాంగ్‌స్టర్స్…
కెనడాలో ఉన్న సిక్కులు 8 లక్షలు… అంటే కెనడా మొత్తం జనాభాలో 2 శాతం ఉంటుందని అంచనా… కెనడాలో వేగంగా విస్తరిస్తున్న మతస్థులు… బ్రిటిష్ కొలంబియా జనాభాలో ఏకంగా 6 శాతం వీళ్లే… ఒంటారియో, ఆల్బర్టా నగరాల్లోనూ సిక్కులు ఎక్కువే… నిజానికి కెనడాకు వెళ్తున్న వారిలో ముస్లిములు, హిందువులు, బౌద్ధులు కూడా అధికమే… కానీ సిక్కులు బలంగా ఆర్గనైజ్ అవుతున్నారు… తమ ప్రతినిధులను ఎన్నిక చేయించుకుంటున్నారు… కెనడా రాజకీయ చిత్రంలో సిక్కుల పాత్రా బలమైనదే…
ప్రత్యేకించి ఖలిస్థాన్ వాదానికి బలమైన అడ్డా ఇప్పుడు కెనడా… తరువాత బ్రిటన్, ఆస్ట్రేలియా… కెనడాలో ఖలిస్థాన్‌కు అనుకూలంగా ఓ పెద్ద రెఫరెండమ్ కూడా నిర్వహించారు ఆమధ్య… అయితే ఖలిస్థాన్ వాదనలో మంచీచెడూ సంగతి ఎలా ఉన్నా… అసాంఘిక శక్తులు కూడా తయారై, పెద్ద పెద్ద గ్యాంగులు పనిచేస్తున్నాయి… పైన చెప్పిన లిస్టు కెనడా ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది… దేశంలో ప్రమాదకరంగా మారిన 11 మంది గ్యాంగ్‌స్టర్ల జాబితా ప్రకటిస్తే వారిలో 8 మంది సిక్కులే…
Ads
మొదటి నుండీ వలస వచ్చిన సిక్కుల పట్ల కెనడా ప్రభుత్వానిది మెతక వైఖరే… కెనడా ఎకానమీలో కూడా సిక్కులదీ ప్రధాన పాత్రే… కష్టపడే తత్వం కావడంతో ప్రతి రంగంలోనూ అడుగు పెట్టారు, పాతుకుపోయారు… అది మాఫియా రంగంలోకీ విస్తరించింది… అదిప్పుడు కెనడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది… వీళ్ల పేర్లతో పబ్లిక్ సేఫ్టీ వార్నింగ్ కూడా జారీచేసింది…
2021లో కావచ్చు మెనెందర్ దలీవాల్‌ను వాంకోవర్ సిటీలో కాల్చిచంపారు… గ్యాంగుల నడుమ పోరాటాలే కారణం… అతని బ్రదర్ హరిప్రీత్ కూడా ఈ కాల్పుల్లో మరణించాడు… వీళ్ల సోదరుడు గుర్‌ప్రీత్ దలీవాల్ ప్రస్తుత గ్యాంగ్‌స్టర్ల జాబితాలో ఉన్నాడు… కెనడాలో ఆపరేట్ చేస్తున్న గ్యాంగుల వల్ల పంజాబ్‌లోనూ అశాంతి ప్రబలుతోందని కొన్ని ఉదాహరణలతో సహా ఇండియా కెనడా ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది… కానీ కెనడా ప్రభుత్వం చేతులెత్తేస్తోంది…
వాంకోవర్‌లో జరిగిన గ్యాంగ్‌స్టర్ హత్యకు ప్రతీకారంగా మరో రెండు హత్యలు… తాజాగా మొన్నటి మే చివరి రోజుల్లో టాప్-11 గ్యాంగ్‌స్టర్లలో ఒకడైన అమర్‌ప్రీత్ సమ్రాపై వాంకోవర్‌లోనే కాల్పులు జరిగాయి… ఈ పనికిపాల్పడింది తన ప్రత్యర్థి ‘గ్యాంగ్ బ్రదర్స్’… ఓ వివాహ వేడుకకు సోదరుడితో కలిసి హాజరైన అమర్‌ప్రీత్ తప్పించుకోకుండా తన ప్రత్యర్థి గ్యాంగ్ ముందుగా తన వాహనానికి నిప్పు పెట్టి, క్లోజ్ రేంజులో తనపై తూటాలు కురిపించారు… ప్లాన్డ్ మర్డర్… ముందే ఫంక్షన్ హాలులో పొంచి ఉండి, అమర్‌ప్రీత్ దొరకగానే ఆపరేషన్ కంప్లీట్ చేశారు… ఈ దాడి నుంచి తప్పించుకున్న రవీందర్ కూడా టాప్-11 గ్యాంగ్‌స్టర్స్ జాబితాలో ఉన్నవాడే…
ఇది పక్కా గ్యాంగ్ వారే అని బ్రిటిష్ కొలంబియా పోలీసులు చెబుతున్నారు… ఇతర ప్రాంతాల్లోనూ ఈ గ్యాంగుల నడుమ బహిరంగ యుద్ధాలు జరగవచ్చుననీ కెనడా ప్రభుత్వం చెబుతోంది… ఇలా ఖలిస్థాన్ శక్తులకు, మాఫియా గ్యాంగులకు అడ్డాగా మారిన కెనడా మన దేశానికీ తలనొప్పుల్ని క్రియేట్ చేస్తోంది… ఆప్‌కు సపోర్ట్ చేసి, పంజాబ్‌లో అధికారం చేజిక్కించుకున్న ఖలిస్థానీ శక్తులు ఒకవైపు, ఇలాంటి మాఫియా గ్యాంగులు మరోవైపు ఇంకెంతగా బలపడి, ఇంకెంత అశాంతిని రేకెత్తిస్తాయో చూడాల్సిందే…
Share this Article