Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆక్రందనలింకా ఆగనేలేదు… అప్పుడే పొలిటికల్ గద్దలు నోళ్లు విప్పినయ్…

June 3, 2023 by M S R

క్షుద్ర రాజకీయాలు మళ్లీ ఆరంభమయ్యాయి… బాలాసోర్ రైల్వే ప్రమాదంలో మృతుల శవాలు ఇంకా బోగీల కిందే ఉండిపోయాయి… తీవ్రంగా గాయపడిన వాళ్ల ఆక్రందనలు కొనసాగుతూనే ఉన్నాయి… రాష్ట్ర, కేంద్ర విపత్తు దళాలు అవిశ్రాంతంగా సహాయకచర్యల్లో శ్రమిస్తూనే ఉన్నాయి… అప్పుడే టీఎంసీ మొదలు పెట్టింది… మమతా బెనర్జీకి ఏమూలో బుర్రలో కాస్త గుజ్జు ఉందనే డౌటుండేది… అదీ లేదని ఇప్పుడు స్పష్టమైంది…

300 మందికి పైగా (ఇంకా ఎక్కువే ఉంటారు) మరణించిన ఘోర ప్రమాదం ఇది… నాలుగు రాష్ట్రాల ప్రయాణికులు… దేశం మొత్తం షాక్‌కు గురైంది… ఒక గూడ్స్, రెండు ఎక్స్‌ప్రెస్‌లు వేగంగా ఢీకొట్టిన ప్రమాదం కాబట్టి… క్షతగాత్రులు, మృతుల సంఖ్య, వివరాలు ఇప్పుడప్పుడే తేలవు… ఇప్పుడు జరగాల్సింది తక్షణ సహాయక చర్యలు… ఒడిశా ప్రభుత్వ బృందాలు చురుకుగా అన్నికోణాల్లోనూ సహాయక చర్యల్లో నిమగ్నమైంది… తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు చేసిన డిమాండ్ ఏమిటో తెలుసా..?

‘‘రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తక్షణం రాజీనామా చేయాలి… ప్రజలపై, ప్రతిపక్షాలపై నిఘా కోసం స్పైవేర్ మీద వేల కోట్లు వెచ్చిస్తుంది మోడీ ప్రభుత్వం… రైలు ప్రమాదాల్ని నివారించే టెక్నాలజీకి ఖర్చు పెట్టలేరా..?’’ ఇదీ టీఎంసీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ డిమాండ్… థూవీబచె… శవాలు కనిపిస్తే చాలు వాటి మీద గోచీలు, బట్టలు ఎత్తుకుపోయే బాపతు… (ఈ అభిషేక్ బెనర్జీ తెలుసు కదా… మమతా బెనర్జీ మేనల్లుడు)… అందులోనూ దరిద్రం… ఏకంగా మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేయొచ్చు కదా…

Ads

balasore accident

నిజానికి బ్యూరోక్రాట్‌గా ఉన్న అశ్విన్ వైష్ణవ్‌ను కావాలని కేబినెట్‌లోకి తీసుకొచ్చి, ఇంతటి ప్రధానమైన శాఖ ఇచ్చింది మోడీయే… (వృద్ధులు, జర్నలిస్టుల రాయితీలను ఎత్తేసింది ఈ అశ్విన్ వైష్ణవే…) ఈ మంత్రి పోకడల మీద చాలా ఆరోపణలు, విమర్శలున్నాయి… అది వేరే సంగతి… అవి బయటపెట్టి, హేతుబద్ధంగా విమర్శలు చేయడం చేతకాలేదు ఇన్నాళ్లూ… రైలు ప్రమాదం జరగ్గానే టీఎంసీ పిచ్చి కూతలు స్టార్ట్ చేసింది… మరోవైపు స్టాలిన్ హుందాగా వ్యవహరించాడు… ఒడిశా సీఎంకు ఫోన్ చేసి, క్షతగాత్రులకు అవసరమైన సాయాన్ని అభ్యర్థించాడు… రాహుల్ అనే రైలు అలవాటు ప్రకారం ఏం పిచ్చికూత కూయబోతున్నదో… (మంత్రి వైష్ణవ్ బేసిక్‌గా రాజస్థానీ అయినా ఒడిశా కేడర్… 1999 తుపాన్ల డేటా తీసుకుని, విశ్లేషించి, ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందిన ‘విపత్తు సన్నద్ధత ప్రణాళిక’ను రచించడంలో తన పాత్ర కూడా ఉంది…)

ఈ ప్రమాదం సంగతికొద్దాం… ప్రమాదకారణాన్ని ఇప్పుడే చెప్పలేం, విచారణ జరిగాక చెబుతాను అని మంత్రి అశ్విన్ వైష్ణవ్ (మాజీ ఐఏఎస్) అని ప్రమాదస్థలి వద్ద విలేకరులతో అన్నాడు… ఈ స్థితిలో ఎవరైనా చెప్పేది అదే… నిజంగా ఇది ప్రమాదమా..? విద్రోహ కుట్ర కోణం ఉందా..? ఇదీ ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్న ప్రశ్న… ఎందుకంటే..? రైలు ప్రమాదాలు కొత్త కాదు, కాకపోతే ఇది ఎక్కువ మందిని బలిగొన్న పెద్ద విపత్తు… ఎప్పటికప్పుడు లోపాలు సరిదిద్దుకుంటూ సాగిపోవడమే శరణ్యం…

అందరిలోనూ తలెత్తే మరో ప్రధాన ప్రశ్న… రైళ్లు గుద్దుకోకుండా కవచ్ అనే ఓ రక్షణ వ్యవస్థ ఏమైంది అని…! చాలా ఏళ్లు ప్రయోగాలు, పరీక్షలు జరిపి (మన వికారాబాద్ పరిసరాల్లోనే ఎక్కువ పరీక్షలు జరిగాయి) చివరికి కవచ్ పేరిట గత ఏడాది అందుబాటులోకి తీసుకొచ్చారు… రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తే కవచ్ వాటిని 400 మీటర్ల దూరంలోనే ఆటోమేటిక్ బ్రేక్స్ వేసి ఆపేస్తుంది… ఎక్కడైనా ట్రాక్ మీద వేరే రైలుకు ప్రమాదం జరిగినా.. మరో రైలు ఆ లైన్‌లోకి రాకుండా దూరంగానే ఆపుతుంది…

kavach

కానీ… దక్షిణ మధ్య రైల్వేల పరిధిలో ఈ ‘కవచ్’ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నది. ప్రస్తుతం హౌరా – ఢిల్లీ, ఢిల్లీ – ముంబై మార్గంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ఈస్ట్ కోస్టల్ రైల్వేలో ఈ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఒకవేళ ఈ వ్యవస్థ అందుబాటులో ఉండి ఉంటే.. ఈ ఘోర ప్రమాదం జరిగేది కాదు…

అసలు జరిగింది ఏమిటి..? ప్రత్యక్ష సాక్షుల కథనాల మేరకు… శుక్రవారం సాయంత్రం బెంగళూరు-హావ్‌డా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద పట్టాలు తప్పడంతో దాని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్ పై పడిపోయాయి. సాయంత్రం సరిగ్గా 6 గంటల 55 నిమిషాలకు 128 కిలోమీటర్ల వేగంతో షాలిమార్ – చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఆ బోగీలను ఢీకొట్టింది… ఇదేసమయంలో ఆ బోగీలు పడిపోయిన ట్రాక్ పైనే వస్తున్న యశ్వంత్ పూర్-హౌరా ఎక్స్ ప్రెస్ ఆ బోగీల్ని ఢీకొట్టింది… అధికారుల వెర్షన్ ఏదో కవర్ చేస్తున్నట్టుగా ఉంది… దాంతో సందేహాలు ప్రబలుతున్నాయి…

గూడ్స్ రైలు ఒకటి ఆగి ఉన్న లూప్ లైన్‌లోకి కోరమాండల్‌కు సిగ్నల్ ఇచ్చారనీ ఆరోపణలు వస్తున్నాయి… అంటే పూర్తిగా మానవతప్పిదమే… నిర్లక్ష్యం… లేదా ఉద్దేశపూర్వకంగా ఎవరో చేసిన తప్పు… కుట్ర… అది తేలాలి… మన దేశంలో ప్రమాదాల్ని సృష్టించే అసాంఘిక శక్తులు కొత్తేమీ కాదు… చాలా సీరియస్ విచారణ జరగాలి… అశ్విన్ వైష్ణవ్ సామర్థ్యం మీద చాలామందికి సందేహాలున్నాయి… మోడీకి ప్రియమైన మంత్రి కావడంతో ఈ విచారణ మీద, బాధ్యులకు శిక్షల మీద, కారకులను తేల్చడం మీద పెద్దగా ఎవరికీ నమ్మకాలు లేవంటే అబద్ధమేమీ కాదు…

accident

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions