‘‘తాత (అల్లు రామలింగయ్య) గ్రాండ్ చిల్డ్రన్‌లో నేను ఒక్కడినే క్వయిట్‌గా ఉండేవాడిని… వీడు మొద్దు, ఇతరులతో పోలిస్తే వీడి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమిటో అనుకున్నాడేమో… అప్పుడే నా పేరిట ఇన్స్యూరెన్స్ చేయించాడు… నేను నామినీగా ఆ 10 లక్షల డబ్బు వచ్చింది… క్వయిట్‌గా ఉన్న పిల్లల భవిష్యత్తు పట్ల పేరెంట్స్‌కు కూడా సందేహాలుంటయ్… కానీ వాళ్లలో హిడెన్ టాలెంట్‌ను బయటికి తీస్తే ఇక ఎదురు ఉండదు… తాత మనమలు, మనమరాళ్లలో ఫస్ట్ సంపాదన స్టార్ట్ చేసింది నేనే’’
….. అల్లు అర్జున్ బన్నీ షేర్ చేసుకున్న ముచ్చటే ఇది… తను చెబుతున్న తీరు బాగనిపించింది… ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్-2 విజేతను ప్రకటించడానికి ఫినాలేకు ముఖ్య అతిథిగా వచ్చాడు… తాత బీమా ముచ్చటే కాదు, తండ్రి గురించి చెప్పిన మరో ముచ్చట కూడా బాగనిపించింది… నిజానికి తన మాటల్లో సినిమావాళ్ల సహజలక్షణమైన హిపోక్రసీ ఏమీ కనిపించలేదు, వినిపించలేదు… చాలా నేచురల్ ఫ్లోతో చెప్పినట్టు అనిపించింది…
‘‘మేం చెన్నై నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన రోజులవి… టోటల్‌గా ఒకేసారి మా లైఫ్ టర్న్ తీసుకున్న రోజులవి… హైదరాబాద్‌కు మాకన్నా ముందే నాన్న షిఫ్టయిపోయాడు… మేం వచ్చాక ఓరోజు మేం ఇద్దరమే ఉన్నప్పుడు హఠాత్తుగా నన్ను హగ్ చేసుకుని, నువ్వు రాబోయే రోజుల్లో సెలబ్రిటీ అవుతావు, పేరు తెచ్చుకుంటావు అన్నాడు ప్రేమగా… తన గురించి చెబుతూ పోతే ఒక రాత్రి సరిపోదు…’’ అంటూ ఎమోషనల్‌గా చెబుతూ పోయాడు…
Ads
ఇండియన్ ఐడల్ షోకు వస్తే… ఫినాలే బాగానే నిర్వహించారు… కానీ సింగర్స్ పాడుతుంటే డాన్సర్లు డాన్సులు చేయడం అనేది ఎబ్బెట్టుగా ఉంది… హిందీ షోకు కాపీ అనుకుంటా… కానీ ఇలా చేస్తే ఇక జీతెలుగువాడి ఫ్లాప్ సరిగమప షోకు దీనికీ తేడా ఏమున్నట్టు..? ఓవరాల్‌గా చెప్పాలంటే ఫస్ట్ సీజన్‌కన్నా ఇది హిట్… జస్ట్, గీతామాధురి ఓవరాక్షన్ జడ్జిమెంట్లు, శ్రీముఖిని తలపించిన హేమచంద్ర హైపిచ్ యాంకరింగ్ తప్ప మిగతాది గుడ్…
అయిదుగురు ఫైనలిస్టుల్లో నిజానికి శృతి నండూరి, లాస్యప్రియలు విన్నర్‌కు పోటీపడతారని అనిపించింది… వాళ్లు ఎంచుకున్న పాటలు, వాయిస్ కల్చర్, పాటల్లో వైవిధ్యం, అన్నిరకాల జానర్ల పాటల్ని సేమ్ మెరిట్‌తో పాడటం బాగున్నయ్… కానీ మొదటి నుంచీ సౌజన్య ఎక్కడా రిమార్క్స్ బారిన పడలేదు… ప్రతిసారీ ముగ్గురు జడ్జిలు మెచ్చుకున్నారు… ఆ ప్రభావం కూడా వోటింగు మీద ఉన్నట్టుంది… చివరకు విజేత మాల ఆమె మెడలోనే పడింది… గుడ్, వోటర్ల సరైన ఎంపిక…
కొన్నాళ్లు అంటే దాదాపు పదేళ్లు సంగీతానికి దూరంగా ఉండి… అత్తామామలు, భర్త ప్రోత్సాహంతో, ఓ చంటిపిల్లను చంకనేసుకుని ఆడిషన్స్‌కు వచ్చి, అందరినీ మెప్పించి, చివరకు విజేతగా నిలవడం బాగుంది… ఆమె సోదరి కావచ్చు బహుశా భాగవతుల శిరీష హిందీ ఇండియన్ ఐడల్ టాప్ 12 స్థాయిదాకా వెళ్లింది… మంచి మ్యూజిక్ ఫ్యామిలీ… గీతామాధురికన్నా మళ్లీ నిత్యామేనన్‌ను పిలిచి, అదే థమన్, అదే కార్తీక్, హోస్ట్‌గా రామచంద్రతో మూడో సీజన్ వెంటనే స్టార్ట్ చేస్తే సంగీత ప్రియులకు ఆనందం… ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్‌కు ఆదరణ… ఏమంటవ్ అల్లు అరవింద్ భయ్యా… వోకేనా…
Share this Article