పాకిస్థాన్‌కు వాచిపోయింది… పాకిస్థాన్ పరువు పోయింది… పాకిస్థాన్‌ను చూసి అంతర్జాతీయ సమాజం పడీ పడీ నవ్వుతోంది… అది చైనా జేబులో దేశం……… ఇలాంటివి చదివీ చదివీ అది సిగ్గుపడటం కూడా మానేసింది… అది ఉన్న సిట్యుయేషన్ అది… దివాలాకన్నా దిగువన ఉంది… మరీ నవ్వులపాలైన సంఘటన తాజాగా ఏం జరిగిందంటే..? అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటయ్ ఇలాంటివి… పాకిస్థానీ ఇంటర్నేషనల్ ఎయిర్‌లెన్స్ (పీఐఏ)కు చెందిన ఓ బోయింగ్ విమానాన్ని మలేషియా అధికారులు కౌలాలంపూర్‌లో జప్తు చేసేశారు… ఆల్రెడీ ప్రయాణికులు ఎక్కారు, ఈలోపు అక్కడికి వచ్చేసిన అధికారులు అందరినీ దింపేసి, 18 మంది విమాన సిబ్బందిని క్వారంటైన్‌కు పంపించేసి, విమానాన్ని గోదాముకు తరలించారు… ఈ వార్తల్ని చదివిన ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ సర్కిళ్లలో ఒకటే నవ్వులు, పాకిస్థాన్ పట్ల జాలిచూపులు…
విషయం ఏమిటయ్యా అంటే..? పాకిస్థాన్ 2015లో ఒక వియత్నామీ కంపెనీ నుంచి పాకిస్థాన్ రెండు విమానాలను అద్దెకు తీసుకుంది… అవును, అది అద్దెకు తీసుకుని అంతర్జాతీయ ప్రయాణాల్ని ఆపరేట్ చేస్తుంటుంది… ఆ అద్దెనైనా సరిగ్గా చెల్లిస్తే సరిపోయేది కదా… డబ్బుల్లేవు, ఎయిర్‌లైన్స్ నష్టాల్లో ఉంది… పైగా కరోనా దెబ్బ పడింది… చెల్లించాల్సిన అద్దె తడిసి మోపెడైంది… చెల్లింపులు ఆపేసింది… మన మలేషియా దేశమే కదా, మనకేమీ కాదులే అనుకుందేమో… అడిగీ అడిగీ ఆ కంపెనీ మలేషియా అధికారులకు ఫిర్యాదు చేయడం, వాళ్లు విమానాన్ని జప్తు చేయడం చకచకా జరిగిపోయాయి…
Ads
అసలు ఇది కాదు ఇమ్రాన్‌ఖాన్‌కు తలవంపులు… పాకిస్థానీ చట్టసభ సభ్యుడు మోలానా అబ్దుల్ గఫూర్ హైదరీ వేసిన చెణుకులు ఫాఫం, ఇమ్రాన్‌కు భరించలేకుండా ఉన్నయ్… ఆయన జమయిత్ ఉలేమా పార్టీ సభ్యుడు… తొమ్మిది నిమిషాల ఓ వీడియోలో ఆయన వెక్కిరింపు ఏమిటంటే..? ‘‘చెల్లింపుల సమస్య వచ్చి, అక్కడెక్కడో మన విమానాన్ని జప్తు చేసుకున్నారు, రేప్పొద్దున ఇంకేదో ఎయిర్‌పోర్టులో మన ప్రధానమంత్రిని కట్టేస్తే ఏమిటీ పరిస్థితి..?’’ ఇది వ్యంగ్యం దట్టించిన కామెంటే కాదు… ఆ దేశ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది…
Share this Article