అప్పుడప్పుడూ తన తిక్క వ్యాఖ్యలు కొన్ని పత్రికల్లో కనిపిస్తుంటాయి… తన రాజకీయ అవగాహన మీద జాలి కలుగుతుంది… అలాగే బోలెడు మంది సహతారలతో అఫయిర్లు పెట్టుకోవడం, వదిలేయడం వార్తలు కూడా కనిపిస్తుంటాయి… తనలాంటి భావజాలమే కలిగిన ప్రకాష్‌రాజ్, కమల్‌హాసన్ అఫయిర్లు, పెళ్లిళ్ల సంఖ్య గుర్తొస్తుంది… అలాగని మిగతా హీరోలు శుద్ధపూసలని కాదు… కానీ హీరో సిద్ధార్థ్‌కు ఉన్న పేరు అలాంటిది… ఇప్పుడు అదితి హైదరితో ప్రేమాయణం సాగుతోంది… ఆమె కథ తన గత హీరోయిన్లలాగా ముగిసిపోకూడదని ఆశిద్దాం…
ఈ వార్తల నడుమ మొన్న ఎక్కడో సిద్ధార్థ్ చెబుతున్నాడు… ‘‘ప్రేమ కథలు చేసీ చేసీ బోర్ కొట్టింది… డిఫరెంటుగా ట్రై చేస్తాను… అందుకే టక్కర్ సినిమా ద్వారా కొత్త సిద్ధార్థ్‌ను చూస్తారు…’’ అంటూనే… ‘‘నాకేమో ఫుల్లు గడ్డం రాదు, యాక్షన్ హీరోకు సగం గడ్డం సరిపోదు… అందుకే ప్రేమకథలు తప్ప మాస్ పాత్రలు ఎవరూ ఆఫర్ చేయడం లేదు… నేనే తీసుకుంటున్నా ఓ సినిమాను…’’ అని వివరించాడు… నవ్వొచ్చింది… ప్రతి ఒక్కరికీ ఇప్పుడు గడ్డం పెంచడం ట్రెండ్… ఒక్కొక్కడు కణ్వమహర్షిలా కనిపిస్తున్నా సరే, ఒకడిని చూసి మరొకడు గడ్డం పిచ్చిలో పడిపోతున్నారు కదా…
ఫాఫం, సిద్ధార్థ్ గడ్డం బాధ ఆ కోణంలో అర్థం చేసుకుందాం… ఇప్పుడు టక్కర్ సినిమాలో తన వేషం, తన లుక్కు చూస్తే నిజంగానే జాలేసింది… అది పిల్లిగడ్డంలాగా కూడా లేదు… మీసాలు మొత్తం తీసేసి, సరిగ్గా నాలుగైదు వెంట్రుకల ఓ పిచ్చి గడ్డం… నిజానికి సినిమా చూడబుద్ధి కాలేదు… అప్‌కోర్స్, తన గడ్డమేమీ అడ్డుపడలేదు… కానీ లుక్కు వరస్టుగా ఉంది… సేమ్, ఈ తిక్క సినిమాలాగే…
Ads
నిజానికి ఇది తెలుగు సినిమా ఏమీ కాదు… తమిళంలో తీసి, తెలుగులోకి అడ్డదిడ్డంగా డబ్ చేసేసి, థియేటర్లలో ఎవడూ చూడకపోయినా సరే, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ పేరిట నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చుననే నయా ట్రెండ్… సినిమాలో అందుకే సిద్ధార్థ్ తప్ప తెలుగు వాసనల్లేవు, ఆర్టిస్టుల్లేరు… తమిళ సినిమా చూస్తున్నట్టుగానే ఉంది…
‘‘పేదవాడిగా పుడితే పుట్టావు, డబ్బున్నవాడిలా చావాలి…’’ ఈమధ్య సినిమా కథల కొత్త ట్రెండ్ కదా… ఇందులో కథ కూడా అదే… ఇంకా లోతుగా కథలోకి వెళ్లడం వేస్ట్… హీరోయిన్ సహా మిగతా ఆర్టిస్టుల నటన గురించి చెప్పుకోవడం కూడా వేస్ట్… యాక్షన్ సినిమా అనుకునే మొదలుపెట్టారు… కానీ మధ్యలో డౌటొచ్చినట్టుంది… రొమాన్స్ తీసుకొచ్చి కలిపారు కథకు… అది సరిపోదు అని మళ్లీ డౌటొచ్చినట్టుంది… కాస్త కామెడీ మిక్స్ చేశారు… దీంతో ఎటూ గాకుండాపోయింది సినిమా కథ… ఓ రుచీపచి లేని కిచిడీ వంటకంలా…
పాటల గురించి, సంగీతం గురించి చెప్పడానికి ఏమీలేదు… ఓటీటీ అయితే జస్ట్, అలా జంప్ చేయగలం, సినిమా థియేటర్లలో ఎలా మరి..? సెల్ ఫోన్‌కు అతుక్కుపోవడమే… మరీ పాటలు సమయం సందర్భం లేకుండా వస్తాయి… ప్చ్, ఫాఫం సిద్ధార్థ్ గడ్డం లుక్కు ఎంత బేకార్ అయిపోయిందంటే… హీరోయిన్ దివ్యాంశతో రెండుమూడు రొమాంటిక్ సీన్లున్నాయి… అవి ఎబ్బెట్టుగా ఉన్నాయి సరే, అక్కడ కూడా హీరో గడ్డమే చికాకు పెడుతూ ఆ రొమాంటిక్ సీన్లు కూడా దెబ్బతిన్నాయి… నాయనా సిద్ధార్థా… నువ్వు కూడా తెలుగు ప్రేక్షకుల మీద పగపడితే ఎలాగోయ్… చివరగా మిత్రుడు జోష్యుల చెప్పినట్టు,.. ‘‘అక్కరకు రాని చిత్రము, మ్రొక్కిన వరమీని తెర వేల్పు .. టక్కున విడువంగ వలయుఁ…
Share this Article