ఎన్టీవీ, టీవీ9 తెలుగు ప్రధాన చానెళ్లు బజారుకెక్కి మరీ డిష్యూం డిష్యూం అని మైకులు పట్టుకుని కొట్టుకుంటున్న తీరు చూశాం, చదివాం, వింటున్నాం… స్థూలంగా చెప్పాలంటే రెండు టీవీల యాజమాన్యాలు దాదాపు సేమ్… అయినా ఎందుకు తన్నుకుంటున్నయ్… అదో మిస్టరీ… సరే, ఎన్టీవీని పడగొట్టి, టీవీ9 తిరిగి తన పాత నంబర్ వన్ స్థానానికి చేరాక, ఏదో సాధించినట్టు, గిన్నీస్ రికార్డు ఏదో సంపాదించినట్టు దాదాపు 2 కోట్లతో రెండు రాష్ట్రాలవ్యాప్తంగా హోర్డింగులు, బిల్ బోర్డులతో ప్రచారం హోరెత్తించిన సంగతీ తెలిసిందే… ఆ ప్రచారసారాంశం ‘‘కుట్రతో ఎవరూ నంబర్ వన్ కాలేరు, సో, ఎన్టీవీ నంబర్ వన్ ప్లేసులో చాన్నాళ్లు ఉండలేకపోయింది, మళ్లీ మేమే వచ్చాం’’
మొత్తానికి కేకుల పండుగలు కూడా చేసి, రజినీకాంత్‌ను హీరోగా ప్రొజెక్ట్ చేశారు… తీరా రెండు వారాలకే ఆ నంబర్ వన్ గాలిలో కలిసిపోయి, మళ్లీ ఎన్టీవీ అగ్రస్థానానికి చేరాక… టీవీ9 బాధ్యులు మొహాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు… ఈ 2 కోట్లతో మైహోం రామేశ్వరరావు, మేఘ కృష్ణారెడ్డిల కళ్లుగప్పి, మభ్యపెట్టి సాగించిన ప్రచారానికి సార్థకత ఏమిటో తెలియక మొహాలు మాడ్చుకున్నారు… టీవీ9 నంబర్ వన్ స్థానానికి బాధ్యుడు రజినీకాంత్ నిజంగానే ఐనపక్షంలో… మరి అంతకుముందు ఆ ప్లేసు ఎగిరిపోవడానికి కూడా తనే కారణమని ఆయనే స్వయంగా ఈ ప్రచారంలో అంగీకరిస్తున్నట్టు భావించాలా..? ఇప్పుడు మళ్లీ ఆ అగ్రస్థానం ఎగిరిపోయింది… దానికీ ఈయనే కారణమని ఈ చానెలే కోట్ల ఖర్చుతో ఇన్‌డైరెక్టుగా చెప్పుకుంటోందా..?
పోనీ, కుట్రతో నంబర్ వన్ ఎవరూ కాలేరు అని చెబుతున్నారంటే… టీవీ9 తనకుతాను అన్యాపదేశంగా తననే కుట్రదారుగా చెప్పుకుంటున్నట్టా..? మొత్తానికి టీవీ9లో ఎవరూ తమ బుర్రల్ని సరిగ్గా వాడటం లేదని అర్థమవుతోంది… మరోవైపు ఎన్టీవీ సైలెంటుగా టీవీ9ను దెబ్బతీస్తూ పోతోంది… ఏ తలతిక్క ప్రచారం లేదు, పైసా ఖర్చు లేదు… అంతా సైలెంట్ ఆపరేషన్… దీనికి ఆధారం ఏమిటీ అంటారా..? టీవీ9 అనుకోకుండా మళ్లీ నంబర్ వన్ ప్లేసులోకి రాగానే ఎన్టీవీ మళ్లీ యాక్టివేట్ అయిపోయింది… (నిజానికి ఈ రేటింగ్స్, ర్యాంకింగ్స్ నిర్దేశించే బార్క్ రేటింగులే పెద్ద దందా… అది వేరే కథ)
Ads
ఈ టేబుల్ చూశారు కదా… 20 వ వారం స్వల్ప తేడా… 21వ వారం టీవీ9కన్నా ఎన్టీవీ 8 పాయింట్లు అప్… 22 వ వారం వచ్చేసరికి ఎన్టీవీ మరో 5 పాయింట్లు ఎగబాకి, టీవీ9 అయిదు పాయింట్ల జారిపోయింది… ఈ భారీ తేడాను అధిగమించి టీవీ9 మళ్లీ నంబర్ వన్ కావాలంటే కష్టసాధ్యమే… ఈలోపు రవిప్రకాష్ సారథ్యంలోని ఆర్‌టీవీ వచ్చేస్తే ఈచానెళ్ల పోటీ కథ మరింత రక్తికడుతుంది… ఆర్‌టీవీ ఇటు టీవీ9ను అటు ఎన్టీవీని టార్గెట్ చేయడం ఖాయం… దీనికి కారణాలు ఏమిటనేది మళ్లీ ఇంకో కథ…
ఇప్పట్లో టీవీ9 మళ్లీ భారీగా మెరుగుపడటం అసాధ్యం అని ఎందుకంటున్నామంటే… కారణాలు బోలెడు, అన్నీ ఇక్కడ చెప్పుకోలేం కానీ… అదే రజనీకాంత్‌కు కుడి, ఎడమ భుజాలుగా చెప్పుకునే దొంతు రమేష్, వేములపల్లి అశోక్ ఇద్దరూ టీవీ9 వదిలేశారు… ఏ రజినీకాంత్ ప్రధాన ఫాలోయర్స్ అన్నారో అదే రజినీకాంత్ ఈ నిష్క్రమణలకు కారకుడని టీవీ9 ఇంటర్నల్ ప్రచారం… వాళ్లిద్దరూ ముఖ్యస్థానాల్లో ఉన్నవాళ్లే… వాళ్లే కాదు, గణేష్, రాజశేఖర్ అనే కీలక జర్నలిస్టులు కూడా నిష్క్రమించారు… వీరిలో రమేష్ ఎన్టీవీ క్యాంపులో చేరిపోగా, అశోక్ కొత్తగా వస్తున్న మరో చానెల్‌లో చేరిపోయాడు…
త్వరలో మరికొందరూ వెళ్లిపోతారని గుసగుస… అప్పటికి ఆర్టీవీ లోగో వివాదం (రిపబ్లిక్ టీవీకి, రవిప్రకాష్ టీవీకి నడుమ ఈ ఆర్ అనే లోగో గోల ఒకటి నడుస్తోంది) ఓ కొలిక్కివస్తే టీవీ9 నుంచి మరికొందరూ ఆర్టీవీలోకి వెళ్లిపోవచ్చునట… మరిప్పుడు అక్కడ అంగీలు చింపుకుని పనిచేసే కేరక్టర్లేమీ కనిపించడం లేదు… అంతా చూస్తుంటే… మైహోం మేనేజ్‌మెంట్ అసలు ఈ టీవీ వ్యవహారాల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదనిపిస్తోంది…
సరే, వాళ్లకు వాళ్ల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం ప్రధానం కాబట్టి టెంపరరీగా టీవీ9 మీద కాన్సంట్రేట్ చేయడం లేదేమో… కానీ టీవీ బాధ్యుడు ఒక పీఏ, ఒక పీఆర్ఓ, ఓ బిజినెస్ అడ్వయిజర్, ఓ చీఫ్ అడ్వయిజర్… ఇలా వ్యక్తిగతంగా సిబ్బందిని టీవీ9 డబ్బుతో మెయింటెయిన్ చేయడం కూడా మేనేజ్‌మెంట్ గమనించడం లేదా..? ఏం అడ్మినిస్ట్రేషన్‌రా బాబూ… టీవీ9 పడిపోవడానికి ఇలాంటి చాలా కారణాలుంటయ్… ఇలాంటివి ఎన్టీవీ కుదరనివ్వడు దాని ఓనర్… అదీ తేడా…
Share this Article