నిజానికి మంచి వార్త… సమాజంలో ఒకింత పాజిటివ్ వైబ్స్ నింపే వార్త… ఈనాడులో కనిపించింది… కాకపోతే ఇవ్వాల్సినంత ప్రయారిటీ ఇచ్చినట్టు అనిపించలేదు… నిజానికి ఇలాంటి వార్తలే హైలైట్ కావాలి… గతంలోలాగా పాఠకులు సోది సొల్లు రాజకీయ వార్తలను ఏమీ చదవడం లేదు… నేతల డప్పు వార్తలకు ఇప్పుడు విలువే లేదు… ఇదుగో ఇలాంటి పాజిటివ్ వార్తల్నే ఇష్టంగా చదువుతున్నారు… ఉదయమే పత్రిక తెరవగానే ఇలాంటి వార్తలు కనిపిస్తే పాఠకుల మానసికారోగ్యానికి కూడా మంచిది… అఫ్‌కోర్స్, మన టీవీలకు ఇలాంటివి పట్టవు… వాటి టేస్టే దరిద్రం కదా…
ఈ వార్త ఏమిటంటే… మహబూబ్‌నగర్ జిల్లా, గద్వాల ఏరియాకు చెందిన మమతకు 27 ఏళ్లు… రెండోసారి గర్భం… శరీరంలో నెత్తురే లేదు… రక్తస్రావం… పల్స్, బీపీ పడిపోయాయి… హీమోగ్లోబిన్ మరీ 3 శాతానికి పడిపోయింది… పూర్తి అపస్మారక స్థితిలోకి వెళ్లింది… మహబూబ్‌నగర్ హాస్పిటల్‌కు తీసుకెళ్తే వాళ్లు హైదరాబాద్ నీలోఫర్‌కు రెఫర్ చేశారు… నీలోఫర్ వైద్యుల అప్రమత్తంగా, జాగ్రత్తగా ట్రీట్ చేయడంతో ఆమె బతికింది… శిశువు కూడా సేఫ్…
ప్రసవానికి ముందు 32 యూనిట్లను ఎక్కించారు… సిజేరియన్ తప్పలేదు… విపరీతమైన రక్తస్రావం, ఆడపిల్ల పుట్టింది… పరిస్థితి చేయిదాటిపోతోంది… నీలోఫర్ వైద్యబృందం ఛాలెంజ్ స్వీకరించింది… మరో 30 యూనిట్ల రక్తం ఎక్కించారు… వెంటిలేటర్ పెట్టారు… అనుక్షణం పర్యవేక్షించారు… ఫలితం, తల్లీబిడ్డ క్షేమం… ఆ వైద్యబృందం, ఇతర హాస్పిటల్ సిబ్బంది మొహాల్లో వృత్తిపరమైన సంతృప్తి… ఇదండీ వార్త… ఎంత బాగుంది…
Ads
ఎక్కడో సిటీ పేజీలో ఓ మారుమూలో వేసి చేతులు దులుపుకోకుండా మెయిన్ పేజీలో వార్త పబ్లిష్ చేయడం వరకూ గుడ్… కాకపోతే ఇంకాస్త బెటర్ శైలి, ప్రజెంటేషన్, ప్రయారిటీ అవసరం అనిపించింది…
ఇలాంటి వార్తలే ప్రభుత్వ వైద్య వ్యవస్థ అనగా ప్రజావైద్యం మీద నమ్మకాన్ని పెంచుతాయి… అది సొసైటీకి కూడా మంచిది… ప్రజల్లో ఉన్న కార్పొరేట్ భ్రమల్ని తొలగించడానికి, కార్పొరేట్ దోపిడీ నుంచి రక్షించడానికి ఇది అవసరం…
హాస్పిటల్‌లో రక్తనిధి కేంద్ర సిబ్బందిని కూడా అభినందించాలి… ఏ కొర్రీలు పెట్టకుండా హాస్పిటల్ గైనిక్ విభాగం చెప్పగానే అవసరమైనన్ని యూనిట్ల రక్తం అందించడం విశేషమే…
నిజానికి ఇంతకన్నా చాలా సంక్లిష్టమైన కేసులెన్నో చూసి ఉంటారు వైద్యులు, 62 యూనిట్ల రక్తం ఎక్కించడం అసాధారణమే కానీ అరుదైన విశేషమేమీ కాదు… ఇక్కడ గుర్తించాల్సింది, అభినందించాల్సింది హాస్పిటల్ స్టాఫ్ కనబరిచిన డెడికేషన్, కమిట్మెంట్… ఈమేరకు డాక్టర్ అనిత, డాక్టర్ దామోదర్, డాక్టర్ నీలిమలకు అభినందనలు… ఎక్కడైనా సరే, ప్రజావైద్యంలో ఇలాంటి పాజిటివ్ స్టోరీలు కనిపిస్తే, నిజంగానే డాక్టర్లు, స్టాఫ్ అంకితభావాన్ని కనబరిస్తే మీడియాలో వాళ్లకు తగిన ప్రశంసలు దక్కడం న్యాయం… గుడ్ ఈనాడు… అన్నట్టు, ఈరోజు బ్లడ్ డోనర్ డే…
Share this Article