Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అబ్బే, మేం రామాయణం తీయలేదు….. ఆదిపురుష్ టీం తలతిక్క వివరణ…

June 18, 2023 by M S R

గుడ్డ మీ నాన్నదే… నూనె మీ నాన్నదే… నిప్పు మీ నాన్నదే… కాలేది కూడా మీ నాన్నదే… ఇదే కదా, ఆదిపురుష్‌లో లంకను కాల్చేముందు హనుమంతుడి డైలాగ్…. ఛిఛీ… ఇది భక్తి సినిమా అట… ఇది చూడకపోతే జన్మకు పుట్టగతులు ఉండవట… తిడితే రౌరవాది నరకాలకు పోతారట… ఏదేదో చెబుతూ సినిమాకు సపోర్ట్ డైలాగులు చెబుతున్నారు… జాతీయ వాదులట… సినిమాలో ఇలాంటి చెత్తా అంశాలు ఎన్నో… ఎన్నెన్నో…

నిజానికి ఇలాంటి సినిమాల్ని నెత్తిన పెట్టుకోవడమే రామద్రోహం అనీ… ఓం రౌత్ వంటి దర్శకుల్ని ఎంకరేజ్ చేయడమే పుట్టగతులు లేని పాపమనీ వాళ్లకు తెలియడం లేదు… దేవుడిని ఆరాధించకపోయినా పర్లేదు, నీచంగా చూపించకు… అదీ అసలైన ద్రోహం… ఆ ద్రోహి పేరు ఓం రౌత్… తనకు బకరాలు సదరు నిర్మాత, సదరు హీరో…

ట్రెయిలర్ సమయంలోనే బూతులు తిట్టింది దేశం… దిద్దుకున్నారా, లేదు… మరో వంద కోట్లు పెడుతున్నాం అంటూ వాయిదా వేసి, కథలు పడ్డారు… గ్రాఫిక్స్ మారిందేమీ లేదు… ప్రేక్షకులకు హౌలాగాళ్లను చేశారు టీసీరిస్ నిర్మాతలు… ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా…? అలాంటి కొన్ని డైలాగులను ప్రేక్షకుల మనోభావాల దృష్ట్యా మార్చేస్తారట… సినిమా రిలీజుకు ముందు చూసుకునే సోయి లేదా..? సిగ్గు లేదా..?

Ads

మనోజ్ ముంతాశిర్ అనే గీత రచయిత చెబుతున్నాడు ఇప్పుడు…. ‘‘అబ్బే, మేం రామాయణం తీయలేదు… జస్ట్, రామయణం నుంచి ప్రేరణ పొందాం… పైగా సంపూర్ణ రామాయణం కాదు, ఏదో యుద్ధకాండలోని కొన్ని అంశాలు మాత్రమే…’’ జనం బండబూతులు తిట్టాక సిగ్గొచ్చినట్టుంది… రామాయణం నుంచి ప్రేరణ అయితే రామాయణ పాత్రలే దేనికి..? ఆ మూల కథే దేనికి..?

హనుమంతుడికి ఓ స్పెషల్ సీటు దేనికి..? ప్రమోషన్లలో ఆ జైశ్రీరాం నినాదాలు దేనికి..? తిరుపతి సభలో చిన జియ్యరుడి ప్రవచనాలు దేనికి..? రామాయణాన్ని గొప్పగా తీశాడమనే ప్రశంసలు దేనికి..? ఇప్పుడు చెబుతున్నారా రామాయణం కాదని… కవరింగా..? కలరింగా..? దేన్ని మభ్యపెట్టడానికి ఈ మాటలు ఇప్పుడు..? అంటూ నెటిజనం మళ్లీ బూతులు తిడుతున్నారు… నిజానికి సినిమా చూసి తిట్టేవాళ్లకంటే ఇదుగో ఇలాంటి పిచ్చి డైలాగుల సినిమా బాధ్యులను ఇప్పుడు ఎక్కువ తిట్టేస్తున్నారు…

ఓం రౌత్

చివరగా… అప్పట్లో… అంటే 2015లో ఇదే దర్శకుడు ఓం రౌత్ ఓ పిచ్చి కూత కూశాడు ట్విట్టర్‌లో… ‘‘ఏం హనుమంతుడు చెవిటివాడా..? మా ఇంటి చుట్టూ జనం లౌడ్ మ్యూజిక్‌తో హోరెత్తిస్తున్నారు… ఇదా హనుమాన్ జయంతి…? పైగా ఆయన పాటలు కూడా కాదు… ఆయనకు వినిపించడం లేదా..?’’ ఇదీ ట్వీట్… అబ్బో, వీడికి బాగా ఎక్కువైంది అని అప్పట్లోనే జనం తిట్టిపోశారు… అదలాగే ఉంచేశాడు చాన్నాళ్లు… ఇప్పుడు ఆదిపురుష్‌తో హఠాత్తుగా రామభక్తుడయ్యాడు కదా… ట్వీట్ తీసేశాడు…

సేమ్, అన్నీ తిక్క చేష్టలే, ఆ ఆదిపురుష్ సినిమాలాగే… తిరుమలలో సీత పాత్రధారిణిని ముద్దుపెట్టుకున్నట్టే… ఈ తిక్కలోడిని నమ్ముకుని వాళ్లు ఓ పిచ్చి సినిమా తీస్తే…. సినిమాను సినిమాగా చూడకుండా కొందరు ఆ మాయలో పడిపోయారు… రాముడు అనగానే అది పవిత్రమైపోదు… రామాయణం అని పేరు పెడితే ఓ తిక్క సినిమాకు పవిత్రత చేకూరదు… సినిమా… జస్ట్, ఓ సినిమా… బాగా తీయకపోతే తిట్టడానికి అర్హులే… అసలు వాళ్లను తిట్టకపోతేనే రామద్రోహం…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions