Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మెగాబాబు లేదా మెగాపాప… ఓహో, మంచిరోజు చూసే ప్రసవం ఫిక్స్ చేశారన్నమాట…

June 19, 2023 by M S R

టీవీ9 వాడికైతే మరీనూ… పిల్లొచ్చినా పిత్తొచ్చినా అపురూపమే… సమాచార సంచలనమే… హీరో రాంచరణ్, ఉపాసన దంపతులకు రేపు మార్నింగ్ 6.30 గంటలకు సంతానమట… ఇదొక మెగా ఈవెంట్ అన్నట్టుగా టీవీ9 వాడు ఎగబోసుకుంటూ వార్తల మీద వార్తలు ఇస్తున్నాడు… జనం రెండో ప్లేసులో కూర్చోబెట్టినా ఇంకా బుద్ధి ప్రసవించలేదు…సూపర్ ఎక్స్‌క్లూజివ్ అట… రెడీగా ఉండాలట… హాస్పిటల్ నుంచే ఉదయం నుంచే ప్రత్యక్ష ప్రసారమట… పాపం శమించుగాక… హాస్పిటల్ లోనికి వెళ్లకండిరా నాయనా… దీనిపై Abdul Rajahussain  సార్ రాసిన ఓ పోస్టు చదవండి ముందుగా…



*సెలబ్రిటీలు కూడా మనుషులే కదా! *సెలబ్రిటీల ఇంట బిడ్డపుడితే… మీడియా హడావుడి, హంగామా సమంజసమేనా? *సెలబ్రిటిలకు ప్రైవసీ అక్కర్లేదా? *చరణ్, ఉపాసనకు ఏ బిడ్డ పుడతాడు? మెగా ఫామిలీలో ఉత్కంఠ? అంటూ గోల… *రేటింగ్ కు ఇంత కక్కుర్తా..?
మెగా హీరో చరణ్, ఉపాసనకు హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్ లో రేపు ఉదయం 6.30 గం.కు బిడ్డ పుట్టబోతున్నాడు. ఇది పూర్తిగా ఆ .. కుటుంబ వ్యవహారం.. కానీ దీన్ని ఓ మెగా…ఈవెంట్ చేసి మీడియా (టివి9) నానా హడావుడి చేస్తోంది. చరణ్, ఉపాసన, వారి కుటుంబసభ్యులు హాస్పిటల్ కు వస్తున్న దృశ్యాల్ని ‘సూపర్ ఎక్స్ క్లూజివ్ ‘ అంటూ లైవ్ లో చూపిస్తూ హంగామా చేశారు..
పైగా రేపు ఉదయం 6.30 గం.కు రెడీగా వుండండి. ఆస్పత్రి నుంచి లైవ్ వుంటుందన్న ప్రకటన కూడా జారీ చేశారు. (ఇంకా నయం ఉపాసనకు ఏ బిడ్డ పుడతారు? అన్నదానిపై ప్రత్యేక చర్చ పెట్టలేదు) దీన్ని అందుకొని ఇతర టీవీ ఛానెళ్ళు రేపు ఉదయం నుంచీ అపోలో ఆస్పత్రి వద్ద చేయ
బోయే ‘రచ్చ’ ను ఊహించుకుంటేనే అదోలా వుంది..!
సెలబ్రిటీలు కూడా మనుషులే. అందరికీ మల్లే వాళ్ళకూ సెంటిమెంట్స్ వుంటాయి..సెలబ్రిటీ పబ్లిక్ ఆస్తి కాదు.. ఈ చిన్న లాజిక్ మిస్ అయి.. రేటింగ్ కోసం మీడియా హద్దులు దాటడమే ఆశ్చర్యం. బిడ్డపుట్టాక ఎలాగూ వార్త తెలుస్తుంది. అప్పటివరకు ఆపకుండా .. మినిట్ టు మినిట్ వార్తలు ప్రసారం చేయడమే విడ్డూరం.!

సో… వ్యక్తుల జీవితాలు వారి సొంతం.. సెలబ్రిటీల జీవితాలు కూడా వారి సొంతమే.. అన్న స్పృహ లేనంతకాలం మీడియా హంగామాలు తప్పవేమో?



సరే, చదివేశారు కదా… సెలబ్రిటీ అంటే మీడియాకు తుమ్మినా పిత్తినా అపురూపం అని ముందే అనుకున్నాం కదా… అది మన మీడియా స్థాయి… దాని గురించి చర్చను వదిలేస్తే… ఓ చిన్న డౌట్… ముందుగా ఒక పంచాంగంలో ఈ పేజీ చూడండి…

Ads

panchangam

రేపు వీళ్లకు బిడ్డో కొడుకో పుడితే… జనం అశుభాలుగా భావించే మూల, అశ్లేష, జ్యేష్ట నక్షత్రాలు మాత్రం కాదు… అఫ్‌కోర్స్, బిడ్డో కొడుకో వాళ్లకు క్లారిటీ ఉంది… అంత పెద్ద హాస్పిటల్స్‌లో అది తెలుసుకోలేదా వాళ్లు… దాన్నలా పక్కన పెట్టేస్తే… ఆమధ్య ఓ పంచాంగం సిజేరియన్లకు కూడా ముహూర్తాలు ఫిక్స్ చేసి పబ్లిష్ చేసింది… దాని ప్రకారం ఈ జూన్‌లో 2, 12, 16, 30 తేదీలు శుభం… 2, 12, 16 తేదీలు ఎలాగూ అయిపోయాయి… ఎలాగూ 6.30 ముహూర్తం అని ఫిక్స్ చేశారు కాబట్టి సిజేరియనే అని లెక్క…

ఇక ఈ నెలలో మిగిలింది 30… కానీ వీళ్లు 20వ తేదీనాడే ప్రసవ ముహూర్తం పెట్టేశారు… కోసేసి బయటికి తీస్తారు… ఇంకా సుమూహూర్తం కోసం ఆగాలంటే పదిరోజులు ఆగాలి… నెలలు నిండినట్టున్నాయి, ఆగలేరు… సో, ఉన్నంతలో మంచి రోజు చూసి ముహూర్తం పెట్టేశారు… అనగా సిజేరియన్… ఏమో… 20 వ తేదీ ఉదయం ఆరున్నరకే గనుక పుడితే… లేదా బిడ్డను బయటికి తీస్తే… కొడుకు పుట్టే పక్షంలో… కొణిదెల చిన బాబు అని టెంపరరీ పేరుతో గనుక జాతకం చూస్తే… పునర్వసు-2 నక్షత్రం, మిథున రాశి… మంచిదేనట… సో, అన్నీ చూపించే ప్రసవ ముహూర్తం ఫిక్స్ చేశారన్నమాట… పిల్లాడి జననకాలాన్ని బట్టి విపరీతంగా పుస్తక పఠనం అంటే ఆసక్తి ఉంటుందట… ఏమో బాబాయ్ 80 వేల పుస్తకాల రికార్డును బద్దలు కొడతాడేమో… పిల్లాడు కాదు, పిల్ల అయితే ఏమిటంటారా..? సేమ్, సేమ్… ఆల్ ది బెస్ట్ మెగా బాబూ ఆర్ చిన బాబూ ఆర్ చినతల్లీ…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions