Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలుగు మినహా యావత్ ద్రవిడనాడు ఘోరంగా ఆదిపురుష్‌ను ఛీకొట్టింది…

June 23, 2023 by M S R

ఆదిపురుష్ కథ త్వరగానే ముగింపుకొస్తోంది… పాపం శమించుగాక… సర్వత్రా ఛీత్కారాలకు గురైన ఈ సినిమా ప్రభాస్‌కు మూడో భారీ ఫ్లాప్ అని ముద్ర వేయించుకుంటోంది… నిజానికి ఆదిపురుష్ సినిమాకు సంబంధించి తను ఎంచుకున్న టీందే తప్పు… ప్రభాస్ నమ్మి మోసపోయాడు… ప్రత్యేకించి ఓం రౌత్ ఈ ఫ్లాప్‌కు ప్రధాన బాధ్యుడు…

అసలు మొదట్లోనే ట్రెయిలర్ చూసి అందరూ సినిమాను బూతులు తిట్టినప్పుడే ప్రభాస్ జాగ్రత్త పడి ఉండాల్సింది… కొన్ని దిద్దుబాటు చర్యలైనా చేయించి ఉండాల్సింది… ఇతర హీరోల్లాగా గాకుండా దర్శకుడినే పూర్తిగా నమ్మాడు… పాటలు, మాటల రచయిత ఈ నిర్వాకానికి తోడు హనుమంతుడికి రాసిన తలతిక్క డైలాగ్స్ ఉద్దేశపూర్వకంగానే రాశానని ఒకసారి, అసలు మేం తీసింది రామాయణమే కాదని మరోసారి, అబ్బే, డైలాగులు మార్చేస్తున్నామని మరోసారి… తన పైత్యం మొత్తం ప్రదర్శించాడు…

దర్శకుడు కూడా తక్కువేమీ కాదు… రామాయణం ఎవరికీ అర్థం కాదనీ, ఎవరూ సంతృప్తికరంగా తీయలేరనీ వాగాడు… ఏ సినిమాకైనా మౌత్ టాక్ ప్రధానం… అసలు సినిమాయే ఓ చెత్తా… దీనికి తగినట్టు మౌత్ టాక్ ఘోరంగా దెబ్బతీసింది… మొదట్లో కాషాయ క్యాంపు సపోర్ట్ చేస్తుందని పిచ్చి భ్రమలు పెట్టుకున్నాడు దర్శకుడు… అందుకే జైశ్రీరాం నినాదాలు, హనుమంతుడికి ఓ సీటు కేటాయింపు వంటి చిట్కాలు ప్రయోగించాడు… కానీ అన్నీ దెబ్బతీశాయి… ఎంత అంటే..?

Ads

మొదట్లో క్రియేటైన హైప్ కారణంగా తొలిరోజే 30 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి… ఇదిలాగే కొన్నాళ్లు సాగితే 1000 కోట్ల వసూళ్లు గ్యారంటీ అని రాయించుకున్నారు… తీరా చూస్తే ఏమైంది..? ఏడు రోజుల్లో ఓవరాల్‌గా 350 కోట్లు… బాగానే ఉందనుకుంటున్నారా..? మొదటిరోజుతో పోలిస్తే దారుణంగా పడిపోయాయి వసూళ్లు… హిందీలో 37 కోట్ల తొలిరోజు వసూళ్ల స్థాయి నుంచి 3 కోట్లకు పడిపోయింది ఏడోరోజుకు… ఇక ఈ శని, ఆదివారాలపైనే నిర్మాతల ఆశ… అదీ దాటితే… రాముడే చెప్పాలిక…

నిజానికి చెప్పాల్సిన విశేషం మరొకటుంది… ఇది పాన్ ఇండియా సినిమా కదా… రాముడంటే దేశమంతా దేవుడే కదా… ఏడో రోజు కేరళలో ఈ సినిమా వసూళ్లు ఎంతో తెలుసా..? 5 లక్షలు… అంతకుముందు రోజు 7 లక్షలు… ఏడు రోజుల్లో జస్ట్, 1.22 కోట్లు… అంతేకాదు, తమిళంలో ఏడోరోజు వసూళ్లు 25 లక్షలు, అంతకుముందు రోజు కూడా అంతే… మొత్తం తమిళ వెర్షన్ వసూళ్లు 3.5 కోట్లు మాత్రమే… కన్నడ వెర్షన్ ఏడోరోజు 4 లక్షలు వసూలు కాగా, అంతకుముందు రోజు 5 లక్షలు… మొత్తమ్మీద 1.92 కోట్లు… అంటే తెలుగు మినహా మిగతా దక్షిణ భాషల్లో అట్టర్ ఫ్లాప్ సినిమా…

తెలుగులో బాగానే నడుస్తోంది… కారణం రాముడి మీద ప్రేమ కాదు… ప్రభాస్ తెలుగువాడు కావడం…! నిర్మాతలకు హిందీ వెర్షన్ మీద విపరీతమైన నమ్మకం ఉండేది… సినిమా తీయడమే హిందీలో తీశారు… దాన్ని తెలుగు సహా ఇతర భాషల్లోకి డబ్ చేశారు… ప్రభాస్ మినహా ఒక్క పరభాషా నటుడు లేడు సినిమాలో… మరి హిందీలో వసూళ్లు..? తొలిరోజు 37 కోట్లు కాగా, ఏడో రోజుకు 3 కోట్లు… మేం భారీగా 500 కోట్లు ఖర్చు చేశాం, చూడండి అని ఎంతగా చెప్పుకున్నా సినిమాలో దమ్ము లేకపోతే రాముడి పేరు చెప్పినా ఎవరూ చూడరు… ఈ ఆదిపురుషుడే అతిపెద్ద నిదర్శనం…

చిట్టచివరగా నిర్మాతలు హనుమంతుడి డైలాగ్స్ మార్చారు… గుడ్డ మీ బాబుదే, నూనె మీ బాబుదే, నిప్పు మీ నాన్నదే, కాలేది మీ నాన్నదే అనే చెత్త డైలాగ్ మార్చేసి ‘గుడ్డ లంకదే, నూనె లంకదే, నిప్పు లంకదే, కాలేది లంకదే’గా మార్చారు… టికెట్ ధరను 150కు తగ్గించారు… ఐనా ఫాయిదా లేదు… దారుణం ఏమిటంటే..? ఈ టికెట్ ధరల తగ్గింపు కేవలం దక్షిణ భాషల్లో, దక్షిణ రాష్ట్రాల్లో మాత్రమే… ఎందుకంటే..? భారీగా సొమ్ము చేసుకోవాలని ఈ నాలుగు రాష్ట్రాల్లోనే అడ్డగోలు టికెట్ ధరల్ని పెట్టారు… ప్రభుత్వాలు గుడ్డిగా ఆమోదించాయి… ఐనా ప్చ్… నో ఫాయిదా… చివరకు తామే తగ్గించుకోవాల్సి వచ్చింది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions