Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పోయిందే… ఇట్స్ గాన్… పొయిపొచ్చి… గాయబ్… ఆదిపురుష్ గురించే…

June 26, 2023 by M S R

ప్రభాస్ నటించిన ప్రాజెక్టు కె సినిమాలో అమితాబ్ ఆల్‌రెడీ ఓ పాత్ర అంగీకరించాడు… తను హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్టుల్లో ఒకడు… తాజాగా కమల్‌హాసన్ కూడా నటిస్తున్నట్టు సినిమా టీం వెల్లడించింది… తనూ పాపులర్ ఆర్టిస్టే… తనకూ భారీ పారితోషికం కావాలి… ప్రభాస్ సరేసరి… వెరసి ఎన్ని వందల కోట్ల ప్రాజెక్టు అవుతుందో ఇప్పుడప్పుడే ఓ తుది అంచనాకు రాలేం… ఇవి చదువుతుంటే ఆదిపురుష్ గుర్తొచ్చింది…

నిజానికి భారీ సినిమా అంటే, భారీ తారాగణం ఉంటే వసూళ్లు బాగుంటాయని, సినిమా విజయవంతం అవుతుందని అనుకోవడం ఓ భ్రమ… సినిమా లెక్కలు పూర్తిగా వేరు… ముందుగా ప్రేక్షకులకు కనెక్ట్ కావాలి… బాగుందనే మౌత్ టాక్ వ్యాపించాలి… అప్పుడుగానీ సినిమా వసూళ్లు ఓ రేంజుకు రావు… ఆదిపురుష్‌కు త్రీడీ, విజువల్ ఎఫెక్ట్స్, రాముడి కథ, ప్రభాస్ హీరో, సైఫ్ విలన్ వంటివి థియేటర్ కోణంలో ప్లస్ పాయింట్స్ కావాలి నిజానికి… కానీ..?

గబ్బిలం వాహనం దగ్గర నుంచి… రావణుడి తలల దగ్గర నుంచి… నాసిరకం గ్రాఫిక్స్ దాకా… డైలాగుల దగ్గర నుంచి పాటల దాకా… మొత్తం నాసిరకమే… సో, ప్రభాస్ ఇమేజీ ఒక్కటే ఏం కాపాడగలదు..? ఎస్, అందుకే డిజాస్టర్ అయిపోయింది… ఒకట్రెండు విశేషాలు చెప్పాలి…

Ads

prabhas

  1. కేవలం ప్రభాస్ ఇమేజీ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కాస్తో కూస్తో నడుస్తోంది… తమిళం, మలయాళం భాషల్లో అయితే డిజాస్టర్‌కన్నా ఘోరం… మలయాళంలో 10 రోజుల్లో కేవలం 85 లక్షల నెట్ షేర్ వచ్చింది… తమిళంలో 2.6 కోట్లు… కర్నాటక కాస్త నయం… 12 కోట్ల దాకా షేర్ దక్కింది… మలయాళం, తమిళం భాషల్లో సినిమా ఎప్పుడో ఎత్తిపోయినట్టే… మరీ 2 లక్షలు, 3 లక్షల షేర్‌కు పడిపోయింది… అదీ వీకెండ్‌లో…
  2. అయితే… తెలుగులో 120 కోట్ల వసూళ్లు గొప్పగా అనిపిస్తున్నా… 80 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్… ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ కలిపి (సౌత్) 175 కోట్లకు వ్యాపారం జరిగితే జస్ట్ 85 కోట్లే వసూలు… అంటే ఆదుకుంటుంది అనుకున్న సౌత్ మార్కెటే ఆదిపురుషుడిని బాగా దెబ్బతీసిందని లెక్క… వీకెండ్ వసూళ్లు కూడా పెద్దగా ఏమీ పెరగలేదు…
  3. పోనీ, అందరూ నార్త్ ఆర్టిస్టులు, 24 క్రాఫ్ట్స్ కాబట్టి హిందీలో ఏమైనా బాగుందా అంటే… అదీ లేదు. పేరుకు 143 కోట్ల వసూళ్లు కనిపిస్తున్నా డిస్ట్రిబ్యూటర్ షేర్ జస్ట్ 62 కోట్లు… మొత్తానికి ఓవర్సీస్ కూడా కలిపితే 341 కోట్ల భారీ వసూళ్లు కనిపిస్తున్నాయి… కానీ నెట్ షేర్ 179 కోట్లు… ఈ సినిమా నిర్మాణ వ్యయం 550 కోట్లు అని చెబుతున్నారు కదా… అంటే అది మొత్తం రికవరీ కావాలన్నా సరే ఆదిపురుష్ బాగా పుంజుకోవాలి… కానీ రోజురోజుకూ వసూళ్లు పడిపోతున్నయ్…
  4. పోనీ, నాన్-థియేటరికల్ రైట్స్ ద్వారా 200 కోట్ల దాకా వస్తాయి అనుకుంటే… ఇప్పుడు ఫ్లాప్ అనే టాక్, థియేటరికల్ రిజల్ట్ చూశాక అంత భారీగా డబ్బు వచ్చే సీన్ కనిపించడం లేదట…
  5. ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… ప్రాజెక్టు కె వ్యయం అత్యంత భారీగా ఉండబోతోంది… పాపం శమించుగాక… ఏమాత్రం లెక్క తేడా కొట్టినా ఇంతే సంగతులు… 600 కోట్లుగా ప్రాథమిక అంచనా… అఫ్‌కోర్స్, కమల్ హాసన్ ఇమేజీ తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో, అమితాబ్ హిందీ మార్కెట్‌కు, ప్రభాస్ తెలుగు ప్లస్ ఇతర భాషలకు ఉపయోగకరం… కానీ ఇంత వందల కోట్ల భారీ బడ్జెట్ సరైనదేనా అనేదే అసలు ప్రశ్న… సాలార్ కూడా భారీ బడ్జెటే అయినా మరీ ప్రాజెక్టు కె స్థాయి కాదు… సో, ఇక చూడాలి, సాలార్ ప్లస్ మారుతి సినిమాలు ఓ మోస్తరుగా నడిస్తేనే ప్రాజెక్టు కె సినిమాకు మోక్షం… లేకపోతే ప్రభాస్ కెరీరే ప్రమాదంలో పడుతుంది… ప్రస్తుతం మబ్బుల్లో ఉన్న ప్రభాస్ డిమాండ్ అలాగే ఉండాలంటే రాబోయే ఒక్క సినిమా అయినా సూపర్ హిట్ కొట్టాల్సిందే… అసలే అనారోగ్యం… ఈ సినిమాల్ని ఎలా గట్టెక్కిస్తాడో చూడాలి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీ రామజ్ఞానం ఎంత..? 108లో కనీసం 80 జవాబులు తెలిస్తే మీరు గొప్పే..!
  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions