Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బడి మారుతోంది… తెలుగు మందబుద్ధులకే పాఠాలు ఎక్కడం లేదు…

June 29, 2023 by M S R

ఏమిటయ్యా, చిన్న పిల్లల కార్యక్రమంలో నా పెళ్లిళ్లు, వ్యక్తిగత అంశాల్ని మాట్లాడతావ్, అసలు నీకు తెలుగే రాదు, తెలుగు రాని సీఎం మా దౌర్భాగ్యం, నేను కుర్చీ ఎక్కగానే వయోజన పాఠశాల పెట్టి నీకు తెలుగు నేర్పిస్తా అని జనసేన పవన్ కల్యాణ్ తిట్టిపోశాడు, వెంటనే జ్వరం వచ్చి పడుకున్నాడు…

నువ్వు అందరికీ అమ్మఒడి అన్నావు… ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒక్కరికే ప్రభుత్వ పథకం పైసలు ఇస్తున్నవ్… ఇది వివక్ష కాదా..? అన్యాయం కాదా..? ఇంత దుర్మార్గమైన పాలన ఎన్నడైనా చూశామా..? అని చంద్రబాబు ఏడుపు, కోపం, ఫ్రస్ట్రేషన్ గట్రా ఫీలింగ్స్ అన్నీ కలబోసి విమర్శలు చేస్తున్నాడు…

నాకు బూతులు తిట్టడం రాదు, నాలుగేసి పెళ్లిళ్లు చేతకాదు… ఆవేశంతో ఊగిపోవడం తెలియదు… అంటాడు జగన్… ఇక ఆయా పార్టీల సోషల్ మీడియా యాక్టివిస్టులు, దురభిమానులు ఒకరినొకరు తిట్టేసుకుంటారు ఫేస్‌బుక్కులో, ట్విట్లర్‌లో… కానీ ప్రాథమిక, ప్రభుత్వ విద్యకు సంబంధించి ఏపీలో గుర్తించదగిన ఓ మార్పు కనిపిస్తోంది…ఇంగ్లిష్ మీడియం, స్కూల్ రూపురేఖల మార్పు, తాగునీరు, ఫర్నీచర్ తదితర మౌలిక సౌకర్యాల కల్పన, మెరుగైన యూనిఫామ్, అమ్మఒడి డబ్బులు, సీబీఎస్ఈ సిలబస్ గట్రా నిజానికి చర్చనీయాంశాలు కావాలి…

ఆమధ్య తెలుగు మీడియంపై తెలుగుదేశం అండ్ కో రచ్చ చేసింది… కొందరు మేధావులు గొంతు చించుకున్నారు… అక్కడికి తెలుగు భాష అర్జెంటుగా మాయమైపోతున్నట్టు గోల… ఆ గొంతుల పిల్లలు చదివేది మాత్రం ఇంగ్లిషు మీడియమే…ఇలా చెబుతూ పోతే బోలెడు… ఎవరైనా రాస్తే పేటీఎం బ్యాచ్ అని ఎగతాళి… (నిజానికి జగన్ సోషల్ మీడియా ఖర్చుకూ కొన్ని కుల, ప్రాంత, వర్గ లెక్కలుంటయ్… జగన్ కోటరీకి ఇదేమీ పట్టదు…)

Ads

ఈ నేపథ్యంలో రచయిత, దర్శకుడు Prabhakar Jaini  రాసిన ఓ పోస్టు ఆసక్తికరం అనిపించింది… (సాక్షిలో ఇలాంటి రాతలు ఎందుకు కనిపించవు..? కనీసం సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ విషయం ఎందుకు పట్టదు..?) సరే, ఆ పోస్టు ఇదీ…



విద్యారంగం మీద ఎంత ఖర్చు చేసినా అది ఒక గొప్ప పెట్టుబడిగానే మిగిలిపోతుంది. సమాజ ఉన్నతికి విద్య చాలా ముఖ్యం. ఇటువంటి వసతులు కల్పించడం వలన, విద్యార్థులలో ఒక ఆత్మ స్థైర్యం కలుగుతుంది. భవిష్యత్తులో ఎన్నో సాధించగలమనే నమ్మకం ఏర్పడుతుంది.ఈ వసతులు కల్పించడంతో పాటు, ఉత్తమ మానవీయ విలువలు కూడా బోధించాలి. మానవీయ విలువలు బోధించడం ప్రభుత్వ బడులలో మాత్రమే సాధ్యమవుతుంది.

సంపూర్ణ వ్యక్తిత్వం కల సమాజ సభ్యులుగా ఎదుగుతారు. ఈ విలువలు లేని చదువుల వల్లనే ప్రస్తుత సమాజంలోని వికృత పరిణామాలు, విద్యార్థి స్థాయిలోనే హత్యలు, మానభంగాలు, ప్రేమలు, భగ్న ప్రేమలు, దాడులు, ఆత్మహత్యలు చూస్తున్నాము. అందుకే కేవలం చదువే కాదు చదువుతో పాటు ఉత్తమమైన, ఉన్నతమైన విలువలు, పెద్దల పట్ల మర్యాద, గౌరవం; దేశం పట్ల ప్రేమ; తమ మతం పట్ల భక్తి, గౌరవం పెంపొందిస్తూ, ధైర్యాన్ని నూరిపోస్తూ, వినమ్రంగా, humility తో ప్రవర్తించే యువతరాన్ని తయారు చేయగలిగితే, ఒక అద్భుతమైన భారతదేశాన్ని భవిష్యత్తులో చూడవచ్చును

మంచి తనం కూడా, ఒకరిని నుంచి ఒకరికి సుగంధంలా వ్యాపిస్తుంది. రాజకీయ పార్టీలు కూడా, ఎన్నికలయిపోయిన తర్వాత రాజకీయాలు చేయడం మానేసి, పిల్లలకు జరుగుతున్న మంచిని అభినందించాలి. ఒక జాతి పునర్నిర్మాణానికి అన్ని పార్టీలు కలిసి కృషి చేయాలి. కార్పొరేట్ విద్యలో విద్యార్థులు నలిగిపోతున్నారు. యాంత్రికమైన నిబంధనల వల్ల రోబోలుగా తయారవుతున్నారు. వారిని కూడా ప్రభుత్వం ఒక కంట కనిపెడుతూ, తగు చర్యలు తీసుకోవాలి.

జగన్ రెడ్డి

వీటన్నింటికన్నా ముఖ్యమైనది, ఉపాధ్యాయులలోని నిబద్ధత. అధికారంలోని పార్టీలు మారుతుంటాయి. విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని వెళ్ళిపోతుంటారు. కానీ, టీచర్లు మాత్రం అదే గురు స్థానంలో ఉంటారు. ఒక మంచి గంధం చెట్టులా వారు తరతరాల విద్యార్థులకు పాఠాలతో పాటు తమ సౌజన్యాన్ని, వ్యక్తిత్వాన్ని పంచుతూ, ఒకే చోట నిలబడిపోతుంటారు. వారి ద్వారా, వారి ప్రతిరూపాలుగా, విద్యార్థులు ప్రపంచమంతటా, పరిమళాలు వ్యాపింప చేస్తుంటారు.

కాబట్టి, టీచర్లు ఆదర్శమూర్తులై, స్వార్థ ప్రయోజనాలకు, స్వలాభాపేక్ష కోసం కాకుండా, ఒక విద్యారణ్యాన్ని సృష్టించే మహాకార్యంలో భాగస్వాములుగా, తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి. ఈ ఫోటో – ఒక గొప్ప ఆత్మ విశ్వాస ప్రతీక…. అన్నట్టు… నాకు రాజకీయాలతో సంబంధం లేదు. నాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కాదు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions