మనం అప్పుడప్పుడూ టీవీ చానెళ్ల రేటింగుల గురించి మాట్లాడుకుంటున్నాం… ఇప్పుడిక ఎన్టీవీ స్థిరంగా ఫస్ట్ ప్లేసులో కూర్చుండిపోయింది… ఇప్పట్లో టీవీ9 దాన్నికొట్టేసే పరిస్థితి, సూచనలు కనిపించడం లేదు… ఆ రెండే… మిగతావన్నీ సోసో… మరి వినోదచానెళ్లు..?
మనకు ఉన్నవే నాలుగు ప్రధానమైన వినోద చానెళ్లు… అందులో జెమిని టీవీని పక్కన పెట్టాల్సిందే… ఒకప్పుడు టాప్… ఇప్పుడది ఆరో ప్లేసు… ఎప్పుడో ఓసారి ఏదైనా హిట్ చిత్రాన్ని టెలికాస్ట్ చేసినప్పుడు తప్ప ఆ చానెల్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు… యాజమాన్యానికి కూడా పెద్ద ఇంట్రస్టు లేదు… సో, దాని గతి అంతే…
Ads
చెప్పుకోవాల్సింది స్టార్ మాటీవీ గురించి… 21.72 పాయింట్లతో టాప్… అదెప్పుడూ టాపే… దాని సమీపంలోకి కూడా ఇతర చానెళ్లు వెళ్లలేకపోతున్నయ్… ఆమధ్య కొన్నాళ్లు జీతెలుగు మంచి పోటీ ఇచ్చినా సరే, ఇప్పుడు అదీ చేతులెత్తేస్తోంది… దాని పాయింట్లు కేవలం 14.29 మాత్రమే… రియాలిటీ షోలు చేతగాకపోయినా సరే… ఒకవైపు స్టార్ మా దూసుకుపోతుంటే, అంతోఇంతో రియాలిటీ షోలు బాగానే చేస్తున్న జీ తెలుగు రేటింగ్స్‌లో పోటీ ఇవ్వలేకపోతోంది…
మూఢనమ్మకాలు, అభూతకల్పనల తిక్క సీరియళ్లతో పోటీ ఇవ్వాలనుకుంటే ఎలా..? పైగా చానెళ్ల రేటింగ్స్ అనేవి ఎలా పెంచాలో, ఏం చేయాలో స్టార్‌మా, అంటే స్టార్ గ్రూపుకు బాగా తెలుసు… రీచ్ పెంచుకోవడానికి డబ్బులు ఖర్చు చేయాలి… ఎంఎస్‌వోలు, డీటీహెచ్ ఆపరేటర్లతో డీల్ చేయడం ఓ పెద్ద టాస్క్… ఫాఫం ఈటీవీ… ఇవేవీ చేతగాక మూడో ప్లేసుకు పడిపోయింది… మరీ ఘోరమైన రేటింగ్స్, స్టార్ మా రేటింగ్స్‌తో పోలిస్తే మూడో వంతు మాత్రమే…!!
రియాలిటీ షోలలో కొత్తదనం లేదు… క్రియేటివిటీ లేదు… సీరియళ్లు బాగుండవు, యాజమాన్యానికి ఏమీ పట్టింపు లేదు… పోనీ, కొత్త సినిమాల ప్రసారం ఉంటుందా అంటే అదీ ఉండదు… ఆలీ, ఆది, సుమ, రష్మి… ఎంతసేపూ వీళ్లేనా..? పోటీ ఇచ్చే మూడో చానెల్ లేదు కాబట్టి ఇది మూడో ప్లేసులో కనిపిస్తోంది… లేకపోతే జెమిని టీవీ గతే ఈటీవిది కూడా…
RANK | CHANNELS | WEEKLY AMA’000 {AVG.} |
---|---|---|
1 | STAR Maa | 2524.39 |
2 | Sun TV | 2433.53 |
3 | STAR Plus | 2340.32 |
4 | Goldmines | 1779.29 |
5 | Zee Telugu | 1707.08 |
6 | Dangal | 1704.79 |
7 | SONY SAB | 1672.53 |
8 | STAR Pravah | 1529.61 |
9 | STAR Vijay | 1518.82 |
10 | Colors | 1420.93 |
పైన టేబుల్ చూశారు కదా… జాతీయ స్థాయిలో టీవీ చానెళ్ల రేటింగ్స్ ఇవి… మన తెలుగు స్టార్ మా చానెల్ దేశంలోనే టాప్… అప్పుడప్పుడూ సన్ టీవీ టాప్‌లోకి వస్తుంది… కానీ స్టార్ గ్రూపు దాన్ని కూడా కొట్టేసింది… ఎక్కువ మంది చూసే హిందీ చానెళ్లను దాటి ఓ ప్రాంతీయ భాషా చానెల్ టాప్ వన్ ప్లేసులో ఉందంటే విశేషమే… కానీ స్టార్ గ్రూపు అన్ని భాషల్లోనూ డామినేషన్ చూపిస్తోంది…
టాప్ టెన్‌లో స్టార్ ప్లస్, స్టార్ మా, స్టార్ ప్రవాహ్ స్టార్ విజయ్… అంటే నాలుగు… బాగా ఆదరణ ఉన్నట్టు కనిపించే సోనీ ఏడో ప్లేసు… కలర్స్ టెన్త్ ప్లేసు… జీతెలుగు అయిదో స్థానం… అంటే టాప్ ఫైవ్‌లో మనవే రెండు… సో, తెలుగులో టీవీ వీక్షణం ఎక్కువ అని లెక్క… ఐతే ఈ అధిక వీక్షణాన్ని ఈటీవీ వినియోగించుకోలేకపోవడం దాని దౌర్భాగ్యం…
ఈటీవీ పరిస్థితే ఇలా ఉంటే… ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరు న్యూస్ చానెళ్లున్నయ్ దానికి… రెండూ శుద్ధ దండుగ చానెళ్లే… ఈటీవీ బొకేలో ఈటీవీ ప్లస్, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్, ఈటీవీ సినిమా చానెళ్లు కూడా ఉంటాయి… అసలు అవి ఎవడూ చూడటం లేదు… ఐనా మనకు అంటగడుతూనే ఉంటుంది ఈటీవీ… జెమిని, స్టార్ మూవీస్ చానెళ్లు బెటర్ పర్‌ఫామెన్స్ (Top four and five) చూపిస్తుంటే ఈటీవీ సినిమాకు ఎందుకు చేతకాదు..? ఎందుకంటే… అందులో ఇంట్రస్టింగ్ సినిమాలేవీ రావు కాబట్టి… తమకు హక్కులున్న పాత సినిమాలు వేస్తుంటారు తప్ప కొత్తవి కనిపించవు కాబట్టి…!
Share this Article