Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆదిపురుష్ డైలాగ్ రైటర్ బేషరతు సారీ… బేశరం సారీ అని మళ్లీ ట్రోలింగ్…

July 8, 2023 by M S R

మనోజ్ ముంతాషిర్… హిందీ సినిమాల్లో పాటలు, డైలాగులు రాస్తుంటాడు… ప్రతిష్టాత్మకమైన ఆదిపురుష్ సినిమాలో చెత్త డైలాగులు రాసింది ఇతనే… ప్రత్యేకించి హనుమంతుడికి తలతిక్క డైలాగులు రాశాడు… అదేమంటే, సమర్థించుకోవడానికి విఫల ప్రయత్నం చేశాడు… దేశమంతా తిట్టిపోస్తుంటే ఉల్టా వ్యాఖ్యలకు దిగాడు… నిజానికి ఆదిపురుష్ అట్టర్ ఫ్లాప్ కావడానికి ఈయన డైలాగులు కూడా ప్రధాన కారణమే… జనం ఛీకొట్టారు… అసలు ప్రభాస్ ఇలాంటి చెత్త టీమ్‌ను ఎందుకు నమ్మినట్టు..?

‘అసలు హనుమంతుడు దేవుడే కాదు, కేవలం భక్తుడు, మనమే దేవుడిని చేశాం..’ అని ఒకసారి… కావాలనే మాస్ డైలాగులు రాశానని మరోసారి… నా మాటల్లో తప్పేం ఉంది, ఈ తరానికి కనెక్టయ్యేలా రాశానంటూ ఇంకోసారి… సినిమాలోని అన్ని పాత్రలకూ ఒకే భాష మాట్లాడతాయా ఏం..? అని మరొక్కసారి… కానీ జాతీయ స్థాయిలో ప్రేక్షకులు ‘వీడు ఎక్కడ దొరికినా తన్నండిరా’ అనే స్థాయిలో వ్యతిరేకత పెరిగేసరికి… డైలాగులు మార్చారు… కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది… సినిమాను జనం తిరస్కరించారు… ఆ టీంలో అందరికన్నా ఎక్కువ నష్టపోయింది ప్రభాస్… పోగొట్టుకున్న ఇమేజీ రూపంలో…

మనోజ్ చివరకు ఆ సినిమాలో రావణుడి రూపాన్ని కూడా సమర్థించడానికి ప్రయత్నించాడు… తనపై విమర్శలు, భారీ ట్రోలింగు చూసి, ముంబైలో ఎవరైనా దాడికి దిగుతారనే భయం పట్టుకుంది… తనకు పోలీసుల రక్షణ కావాలంటూ ముంబై పోలీస్ కమిషనర్‌ను అభ్యర్థించాడు… జనం తన పాత వీడియోలను కూడా బయటపెట్టి మరీ ట్రోలింగుకు దిగారు… ఒక వీడియోలో, తన ఉర్దూ కలం పేరు ‘ముంతాషిర్’ని ఎంచుకోవడం వెనుక కథను వివరిస్తూ కనిపించాడు… “నేను శుక్లా నుండి ముంతాషిర్ అయ్యాను, అది నన్ను చాలా మార్చింది. మా నాన్నగారు శివ స్తోత్రం పాడినప్పుడల్లా నేను రసూల్ అల్లా అని పాడతాను..’’

Ads

ఒకవైపు ఆదిపురుష్ డిజాస్టర్ తననేమీ కదిలించలేదు… జాతీయ స్థాయిలో వ్యతిరేకతకూ భయపడలేదు… అలాగే మొండిగా వ్యాఖ్యలు, సమర్థనలకు దిగాడు… కానీ ఎప్పుడైతే సోనీ టీవీ ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ షో నుంచి జడ్జిగా తనను తీసిపారేసింది… అప్పుడప్పుడూ ఇతను ఇండియన్ ఐడల్ షోలో కూడా కనిపించేవాడు… ఇక తన మీద వ్యతిరేకత కాస్తా తన పొట్ట కొట్టబోతోందని ఎప్పుడైతే అర్థమైందో బుర్ర దారిలో పడింది… వెంటనే ఓ ట్వీట్ చేశాడు…

मैं स्वीकार करता हूँ कि फ़िल्म आदिपुरुष से जन भावनायें आहत हुईं हैं.
अपने सभी भाइयों-बहनों, बड़ों, पूज्य साधु-संतों और श्री राम के भक्तों से, मैं हाथ जोड़ कर, बिना शर्त क्षमा माँगता हूँ.
भगवान बजरंग बली हम सब पर कृपा करें, हमें एक और अटूट रहकर अपने पवित्र सनातन और महान देश की…

— Manoj Muntashir Shukla (@manojmuntashir) July 8, 2023

గౌరవనీయులైన రుషులు, శ్రీరాముని భక్తులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాడు, చివరకు ‘ఆదిపురుష్’ చిత్రానికి తాను రాసిన డైలాగ్‌లు అందరినీ బాధించాయని అంగీకరించాడు… చేతులు జోడించి మరీ క్షమాపణ వేడుకున్నాడు… చేతులు ముడుచుకున్న ఎమోజీని కూడా పోస్ట్ చేశాడు… టీవీ చానెళ్లు దూరం పెడుతుండటం, రాను రాను సినిమా అవకాశాలకు కూడా గండిపడే సూచనలు కనిపిస్తుండటంతో దిగివచ్చి క్షమాపణలు చెప్పాడే తప్ప తన క్షమాపణలో నిజాయితీ లేదనీ, తన ధోరణిలో మార్పేమీ లేదని ఆ ట్వీట్ మీద కామెంట్స్ కనిపిస్తున్నాయి… తిరుపతిలో జైశ్రీరాం నినాదాలతో ప్రమోషన్ సభ నిర్వహించి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ప్రభాస్ గానీ, దర్శకుడు ఓం రౌత్ గానీ, టీసీరిస్ నిర్మాతలు గానీ కిక్కుమనడం లేదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions