తానా ఎన్నికలకు సంబంధించి ఫేస్‌బుక్‌లో Chennuri V Subba Row… పోస్ట్ ఆసక్తికరంగా ఉంది… అందులో ఆశ్చర్యపరిచిన వాక్యం ఏమిటంటే… మొన్నటిదాకా 36 వేల మంది సభ్యులున్న తానాలో ఇప్పుడు 70 వేల మంది ఉన్నారనేది… సరే, ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్గనైజేషన్ అని ఆ పోస్టులో రాయబడిన వాక్యం నిజమో కాదో తెలియదు గానీ తానా అంటే తానాయే… అమెరికాలో కులాల వారీ, ప్రాంతాల వారీ వేర్వేరు సంఘాలు పెట్టుకున్నారు…
వాటినీ తేలికగా తీసిపారేయలేం గానీ తానా ఇంపార్టెన్స్‌ను గుర్తించక తప్పదు… చాలామంది ఆరోపిస్తున్నట్టుగా తానా పర్టిక్యులర్‌గా ఒక కులం గుప్పిట్లో ఉన్నదనే విషయాన్ని కాసేపు విస్మరిస్తే, అమెరికాలోని మన ప్రవాసాంధ్రులకు ఈ ఆర్గనైజేషన్ సేవల్ని చులకనగా చూడలేం… ఈమధ్య 3 రోజులపాటు తానా 23వ మహాసభలు నిర్వహించారు కదా… దాదాపు 18 వేల మంది హాజరైనట్టు నిర్వాహకులు చెబుతున్నారు… చాలా పెద్ద సంఖ్య… ప్రవాసాంధ్రులు తానాను ఓన్ చేసుకున్న తీరుకు, మనవాళ్లు సంఘటితమవుతున్న తీరుకు ఆ సంఖ్యే ఓ ఉదాహరణ…
ఇళయరాజా పైత్యం గురించి కొంత చర్చ జరగడం మినహా స్థూలంగా తానా సభలు బాగా జరిగినట్టు లెక్క… తానా ఎన్నికల గురించి ఆయన తన పోస్టులో చెప్పిన వివరాలు ఇలా ఉన్నయ్… ‘‘ఈ సంవత్సరం జరగాల్సిన ఎన్నికల విషయంలో ఇరు వర్గాలు మేరీల్యాండ్ కోర్ట్ ని ఆశ్రయించటం, ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకోవటం, ఎన్నికలు జరగక పోవటం తానా సభ్యుల కు తెలిసిన విషయం. ఇంకా చెప్పాలంటే ఎన్నికలు జరగక పొతే.. కొత్త కార్య వర్గం రాక పొతే జరిగే పరిణామాలు ( రాజ్యాంగ సంక్షోభం ) గురించి సీనియర్ లేదా సీరియస్ తానా సభ్యులు మాత్రమే వర్రీ అవుతున్న సంగతి కొందరికే తెలుసు. తానా కు గత కొద్దీ నెలలు గా పట్టిన గ్రహాణం ఈ రోజు జరిగిన బోర్డు మీటింగ్ లో తీసుకొన్న తీర్మానాలతో పూర్తి గా విడిచింది అనే చెప్పాలి.
Ads
నిన్న రాత్రి ( 9 జులై న) బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు , కొత్తగా 2025-27 కి అధ్యక్షుడి గా వస్తున్న డా నరేన్ కోడాలి ఇద్దరు అందరికి తెలిసిన నాయకులు. ఇద్దరూ సౌమ్యులు గా పేరు పొందిన వారు. ఇద్దరూ కలిసి ఇరు వర్గాల నుంచి వచ్చిన కార్య వర్గ సభ్యులతో తానా ని ముందుకు తీసుకెళ్లాల్సిన భాద్యత ఇద్దరి మీద వుంది. ఇప్పటి వరకు 36000 మంది సభ్యులతో వున్న తానా ఇప్పుడు 70000 మంది సభ్యులతో ప్రపంచం లోనే అతి పెద్ద organisation గా మారిన తానా సంస్థ ను ముందుకు తీసుకెళ్లే అవకాశం , అదృష్టం వచ్చింది. తానా ను ముందుకు తీసుకెళ్ళాలి. అలా స్నేహ భావం తో ముందుకు వెళ్లాల్సింది గా మా కోరిక.. విన్నపం……
Share this Article