Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వెండి తెరపై వెలగబోయే సితార… తల్లి వేయించే అడుగులు అటువైపేనా..?!

July 18, 2023 by M S R

మిత్రుడు Rajasekhar Reddy…   రాసిన ఓ పోస్టు చదువుతుంటే… అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల సినిమాల్లోకి రాకుండా, హీరోయిన్‌గా చేయకుండా అభిమానులు అడ్డుపడిన తీరు గుర్తొచ్చింది… ఫ్యాన్స్ అభిప్రాయానికి తలొగ్గిన కృష్ణ బిడ్డను సినిమాల్లోకి రానివ్వలేదు… కానీ ఓ హీరోయిన్‌ నమ్రతను తన కొడుకు మహేశ్ పెళ్లి చేసుకోకుండా మాత్రం కృష్ణ అడ్డుకోలేదు… ఇష్టమో, అయిష్టమో గానీ మహేశ్ నిర్ణయానికి సమ్మతించాడు… ఫ్యాన్స్ కూడా పెద్దగా వ్యతిరేకించలేదు…

ఇప్పుడు మహేశ్ కూతురు సితారను భావి హీరోయిన్‌గా అప్పుడే తీర్చిదిద్దుతోంది నమ్రత… షార్ట్ వీడియోస్‌తో మొదలై అప్పుడే బ్రాండింగ్ స్టార్ అయిపోయింది… అదేదో నగల యాడ్ చేసేసింది… తెరపై వెలగడం స్టార్టయింది… ఇంకేముంది..? క్రమేపీ అందులోకి పూర్తిగా దిగిపోవడమే… అంతా నమ్రత ప్లానింగే అంటున్నారు… ఇప్పుడు ఇంకా చిన్న పిల్ల… భవిష్యత్తులో ఆమె ఇష్టం ఎలా మారిపోతుందనేది ఇప్పుడే చెప్పలేం కానీ ఇప్పుడే సంపాదన అనే మాయలోకి జారిపోతుంటే జాలేస్తుంది… ముందుగా రాజశేఖర్‌రెడ్డి పోస్టు చదవండి…



బాల్యాన్ని ఎంజాయ్ చేయడానికి కూడా చాలా అదృష్టం ఉండాలి… రోడ్డు మీద తిరగడం, ఫ్రెండ్స్‌తో స్కూల్ కు వెళ్లడం… birthday పార్టీలకు వెళ్లడం…హోమ్ వర్క్లు ఎగ్గొట్టి స్కూళ్ళలో దెబ్బలు తినడం… పుట్టింది పెరిగింది గ్రామాల్లో అయితే చెరువుల్లో, బావుల్లో, కాలువల్లో ఈతకు వెళ్లడం… స్పోర్ట్స్ డేల్లో దెబ్బలు తగలడం ఇలాంటివన్నీ లేని బాల్యం వ్యర్థం…
మహేష్ బాబు కూతురు సితారను చూస్తుంటే ఈ అమ్మాయి బాల్యాన్ని అసలు ఎంజాయ్ చేస్తుందా అనిపిస్తుంది… పదేళ్ల వయసున్న అమ్మాయి ఒక ప్రకటనలో నటించి , వచ్చిన సంపాదన అంత డొనేషన్ ఇచ్చేసా అని ముసిముసిగా చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది… చదువుకునే వయసు, మంచి చెడు ఇంకా అర్ధం కాని వయసులో ఉండగానే మార్కెటింగ్ అనే సంపాదనలోకి తోయబడుతుంది అనిపిస్తుంది… పదేళ్ల వయసున్న అమ్మాయి చుట్టూ బ్రాండింగ్ అనే కొత్తపదం మనం రాబోయే రోజుల్లో వినబడే అవకాశం ఉంది.. ఒక్క సీతారనే కాదు మిగతా హీరోల పిల్లలకు కూడా కొత్త మార్కెటింగ్ మొదలవుతుంది…
సంపాదన పట్ల పిల్లలకు అంత మోజు కల్పిస్తున్న తల్లిదండ్రులు ఎక్కువయ్యే అవకాశం ఉంది… ముఖ్యంగా సినిమా ఫీల్డ్‌లో …ఇంకొంతమంది నమ్రత శిరోద్కర్లు ఉద్భవించే అవకాశం ఉంది… మిస్వరల్డ్, మిసిండియా కంపిటీషన్లకు ఇప్పటి నుండే సీతారను తయారుచేస్తారేమో… ప్రతీ దానికి లెక్కలు కట్టే నమ్రత శిరోద్కర్ కు ఇది పెద్ద సమస్య కాదు అనిపిస్తుంది… ఈ సమస్య గురించి గొల్లపూడి మారుతీరావు ఏదో వ్యాసంలో రాస్తారు… ఫేమ్, సంపాదన, బ్రాండింగ్‌తో పసి మనసులు ఎలా అల్లాడిపోతాయో చక్కగా వివరిస్తారు… చాప్లిన్ ఆత్మకథలో ఒక example కనబడుతుంది…
chaplin


ఆ చార్జీ చాప్లిన్ కథ సంక్షిప్తంగా తెలుగీకరిస్తే, అదెలా ఉంటుందంటే…

Ads


చిన్నప్పటి నుంచే చదరంగంలో నిష్ణాతుడు, తోపు అయిన శామ్యూల్ రెషెవ్‌ స్కీతో చార్లీ చాప్లిన్ తన అనుభవాన్ని తన ఆత్మకథలో చాప్లిన్ ఇలా రాస్తాడు.., “శామ్యూల్ రేషెవ్ స్కీ, ఏడేళ్ల వయసులో, బాయ్ ఛాంపియన్, చెస్-ప్లేయర్ ఆఫ్ ది వరల్డ్, నా స్టూడియోని సందర్శించాడు. … అతను సన్నగా ఉన్నాడు, లేత ముఖం, పెద్ద కళ్లు… జనంలోకి వస్తే నిర్వేదంగా చూస్తుంటాడు… సిగ్గరి అనుకుంటాం, కానీ తనలో ఏదో బాధ… తను ఎవరితోనైనా ఆనందంగా కరచాలనం చేయడం అత్యంత అరుదు…
అతని మేనేజర్ తనకు నన్ను పరిచయం చేసి కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత, అబ్బాయి మౌనంగా నా వైపు చూస్తూ నిలబడ్డాడు. నేను ఫిల్మ్ స్ట్రిప్స్‌ని చూస్తూ నా తనను పరిశీలించసాగాను… కాసేపాగి నేను అతని వైపు తిరిగాను. `నీకు పీచెస్ ఇష్టమా?’ (ఓరకం పళ్లు) అనడిగాను… ‘అవును’ అని సమాధానమిచ్చాడు.
`సరే, మన తోటలో అవి విరగకాసిన ఓ చెట్టు ఉంది; నువ్వు ఎక్కొచ్చు, పళ్లు కోసుకోవచ్చు… వెళ్లు, అన్నట్టు నాకు కూడా ఒకటి తీసుకురా…’ అని చెప్పాను… అతని ముఖం వెలిగిపోయింది… హఠాత్తుగా ఓ పిల్లాడు కనిపించాడు నాకు…  ‘వావ్, ఆ చెట్టు ఎక్కడ ఉంది?’ అన్నాడు… నా పబ్లిసిటీ చూసే ఒకాయన్ని చూపిస్తూ… ‘ఆ చెట్టును ఈ కార్ల్ నీకు చూపిస్తాడు’ అన్నాను. పదిహేను నిమిషాల తర్వాత అతను చాలా పళ్లతో ఉల్లాసంగా తిరిగి వచ్చాడు. అది మా నిఖార్సయిన స్నేహానికి నాంది…
`నువ్వు చెస్ ఆడగలవా?’ అతను అడిగాడు. నాకు చదరంగం రాదని తప్పనిసరై నిజాన్ని ఒప్పుకోవలసి వచ్చింది. `నేను నీకు నేర్పిస్తాను. ఈ రాత్రి నేను ఆడటం చూడండి, నేను ఒకేసారి ఇరవై మందితో ఆడుతున్నాను” అతను గొప్పగా చెప్పాడు. ‘తప్పకుండా’ అని నేను తనకు వాగ్దానం చేసాను, తరువాత భోజనానికి తీసుకెళ్తానని కూడా చెప్పాను… పళ్లు కోయడం, చెట్లు ఎక్కడం, వాటిని చూసి ఆనందపడటం ఇలాంటి బాల్య మాధుర్యాల్ని ఎవరు కోరుకోరు..?
sitara


ఇది చార్లీ చాప్లిన్ ఉదాహరణ కావచ్చుగాక… బాల్యం ఓ అపురూపమైన ఘట్టం… సితార కూడా చదవాలి, ఎందుకొచ్చిన ఈ సినిమా ఫీల్డ్..? మంచి టెక్నీషియన్, మంచి డాక్టర్, మంచి సైంటిస్టు వైపు ఆమెను తీసుకువెళ్లొచ్చు కదా అంటారా..? నో, ఆమె తల్లి నమ్రత శిరోద్కర్‌దే ఆ ఇంట్లో పెత్తనం… ఆమె మాట, ఆమె కల, ఆమె వేయించే అడుగుల నుంచి సితార తప్పించుకోలేదు… మహేశ్ ఇదేమిటనీ అడగలేడు… మంజుల నాటికీ ఇప్పటికీ కాలం బాగా మారిపోయింది… సో, ఫ్యాన్స్ కూడా మౌనంగా అంగీకరిస్తారేమో…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions