మొన్నొక వార్త బాగా చక్కర్లు కొట్టింది… తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్ట్రాటజిస్టుగా మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ కుమార్ రానున్నాడు అనేది ఆ వార్త సారాంశం… త్వరలోనే ఆయన తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ హెడ్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నాడనీ, 40 మందితో ఓ టీమ్ ఏర్పాటు చేసుకున్నాడట…
ఆయన ఎవరు..? పుట్టుక రీత్యా తమిళుడు… కానీ కర్నాటక కేడర్ 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి… అతని తండ్రి పి. షణ్ముగం రిటైర్డ్ జిల్లా జడ్జి, తల్లి అంబికా రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ అధికారిణి… రాబోయే రోజుల్లో ప్రజాస్వామిక ప్రమాణాలు మరింత పడిపోనున్నాయని చెబుతూ 2020లో రాజీనామా చేశాడు… బీజేపీ భారీగా ట్రోల్ చేసింది తనను… తను బీజేపీ వ్యతిరేకి…
2020లోనే తను కాంగ్రెస్ పార్టీలో చేరాడు… మొన్నటి కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల హామీలను సమర్థంగా జనంలోకి తీసుకుపోవడంలో గానీ, బీజేపీపై సోషల్ దాడిలో గానీ సక్సెస్‌ఫుల్‌గా పనిచేసిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ టీంలో సునీల్ కనుగోలుతో పాటు సెంథిల్ కూడా ప్రముఖుడు… ప్రత్యేకించి పేటీఎం తరహాలో పేసీఎం అనే ప్రచారాన్ని బలంగా తీసుకెళ్లింది సెంథిలే… బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్లు, అవినీతిమయం అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాడు… అఫ్‌కోర్స్, వీరి నడుమ సమన్వయాన్ని సూర్జేవాలా బాగా చేయగలిగాడు…
Ads
ఇప్పుడు సెంథిల్‌ను తెలంగాణకు తీసుకురానున్నారు… మరి సునీల్ కనుగోలు..? ఇక్కడ పోలీస్ కేసుల్ని ఎదుర్కొంటూ ఎంతోకొంత కాంగ్రెస్ వాణిని జనంలోకి తీసుకుపోయాడు తను… టీడీపీకి రాబిన్ శర్మ, జగన్‌కు ఐప్యాక్ టీంలాగా సునీల్ కనుగోలు టీం బాగానే పనిచేస్తున్నది… (కేసీయార్ తనే పెద్ద వ్యూహకర్త కాబట్టి ప్రత్యేకంగా ఎవరూ ఎన్నికల వ్యూహకర్తలుగా గులాబీ క్యాంపులో ఉండరు…)
కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సిద్ధరామయ్య సునీల్‌ను తన ప్రధాన సలహాదారుడిగా నియమించుకున్నాడు… అప్పట్లో ఐప్యాక్ పీకే పంజాబ్ ప్రభుత్వంలో చేరాడు ఇలాగే… కానీ తెలంగాణ వ్యవహారాలకు సంబంధించి సునీల్‌తో రేవంత్‌రెడ్డికి పడటం లేదు… తరచూ ఏదో ఓ మాటతో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను జనంలో లైవ్‌గా ఉంచుతున్నాడు… అఫ్‌కోర్స్, సీతక్క సీఎం, 3 గంటల కరెంటు వంటి వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా…
అవును, అక్షరాలా ఈ రెండు వ్యాఖ్యలతో సునీల్ కనుగోలుకూ రేవంతుడికీ నడుమ గొడవ జరిగిందట… రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలుపై నోరు పారేసుకున్నాడట… దాంతో సునీల్ అలిగి బెంగుళూరు వెళ్లిపోయాడని సమాచారం… దీనికితోడు ఈ రెండు వ్యాఖ్యల మీద కొందరు సీనియర్లు కూడా హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారట… రేవంతుడికి కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్ సపోర్టే కానీ సునీల్ కనుగోలు ఏమని నివేదిక పంపించాడో గానీ ‘‘రేవంత్ జీ ఏక్ బార్ ఢిల్లీ ఆవో’’ అన్నారట… ఈయన వెళ్లాడట… ఇప్పుడిక సునీల్‌ను పూర్తిగా కర్నాటకకు పరిమితం చేసి, తెలంగాణకు సెంథిల్ సేవల్ని అందిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి…
Share this Article