Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సంజయా ఇంకా సమజ్ కాలేదా… ముక్కుసూటిగా వెళ్లావు, నొగలు విరిగినయ్…

July 20, 2023 by M S R

నేను ఎవరికీ వ్యతిరేకంగా పని చేయలేదు…. అదే అనర్హత
ఎవరిపైనా అధిష్ఠానానికి ఫిర్యాదు చేయలేదు… అదే అనర్హత
వేదికపై కుర్చీ లేకుండా చేసినా పట్టించుకోలేదు… అదే అనర్హత
సీఎం పదవిని ఆశించబోనని ప్రకటించాను… అదే అనర్హత
అసెంబ్లీకి పోటీయే చేయబోనని చెప్పాను… అదే అనర్హత
అధ్యక్షుడిగా కొనసాగించి ఉంటే గెలిపించేవాణ్ని… అదే అనర్హత
ఇప్పటికీ రాష్ట్రంలో విజయావకాశాలు ఉన్నాయి… అదే అనర్హత
పార్టీ ప్రకటనలు ప్రొటోకాల్‌ ప్రకారమే ఇచ్చాం… అదే అనర్హత
అతిథుల ఫోటో తరువాత నా ఫోటో ఉండేది… అదే అనర్హత
చేసిన పనులు చెప్పుకోకపోవడమే తప్పయింది… అదే అనర్హత
.
అంతేకాదు, తెలుగు రాజకీయాల్లో బీజేపీ ఎదగాలని హైకమాండ్‌కు ఎప్పుడూ ఆసక్తిగా లేదనే బేసిక్ నిజాన్ని బండి సంజయ్ విస్మరించాడు… లేదా గమనించలేకపోయాడు… దశాబ్దాలపాటు టీడీపీకి బీజేపీని తోకపార్టీగా ఉంచి దెబ్బతీశారు… ఇప్పుడూ అంతే, చంద్రబాబు బలమైన వెన్నుపోటు పొడిచినా సరే, మళ్లీ తనతోనే అంటకాగడానికి రెడీ అంటున్నారు… ఇక్కడ బీఆర్ఎస్ కేసీయార్ ఏకంగా అమిత్ షానే ‘ఎమ్మెల్యేల కొనుగోలు స్కాం’లోకి లాగి, బజారులో నిలబెట్టి బదనాం చేయడానికి ప్రయత్నించినా సరే, ఇప్పటికీ కేసీయారే దోస్తుగా కనిపిస్తున్నాడు… తన పాదాలకే నమస్కరిస్తున్నారు పరోక్షంగా…

సొంతంగా బలం పెంచుకోవాలనీ, అధికార పార్టీల అక్రమాలపై పోరాడాలనీ అసలు ఢిల్లీ పాదుషాలకు ఉంటే కదా… ఫస్ట్ నుంచీ ఇంతే… నిజానికి బండి సంజయ్‌దే కదా తప్పు… తను కోవర్టుగా వ్యవహరించలేడు… ఢిల్లీలో పైరవీలకు మాత్రమే పరిమితం కాలేడు… అధికార పార్టీకి తెరవెనుక విధేయంగా ఉండలేడు… తనేదో తమిళ అన్నామలై అనుకున్నట్టున్నాడు… అధికార పార్టీపై దూకుడుగా వెళ్లాడు… ప్చ్, కేసీయార్‌కు బండి సంజయ్ మీద వైరాగ్యం వచ్చింది…

bjp

బయట ఎలా కనిపించినా సరే, లోలోపల కేసీయార్‌ పట్ల సాఫ్ట్ ధోరణితో లేకపోవడం హైకమాండ్‌కు నచ్చదు అని తెలుసుకోలేకపోయాడు ఫాఫం… దెబ్బతిన్నాడు… ఇప్పుడు నేను ఎంత పద్ధతిగా బిహేవ్ చేసినా, నన్నెందుకు పీకిపారేశారో సమజైత లేదు అని బాధపడటం దేనికి..? బండి సంజయ్‌ను ఎందుకు పీకేశారో సగటు బీజేపీ అభిమానికీ తెలియదు… కేసీయార్‌ మోడీకి సరెండర్ అయ్యాడా, మోడీయే కేసీయార్‌కు సరెండర్ అయ్యాడా అర్థం కాదు…

Ads

ఇటు బీఆర్ఎస్ గానీ, అటు ఎంఐఎం గానీ పరోక్షంగా మనకే సహకరిస్తాయనే సోయి బండి సంజయ్‌కు లేకుండా పోవడమే తన అనర్హత… కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్షాలు ఒక్కటి గాకుండా కేసీయార్ ఉపయోగపడుతూ ఉంటాడనే మార్మిక వాస్తవాన్ని తెలుసుకోలేకపోవడమే తన అనర్హత… మోడీ, అమిత్ షా నా పనితీరు మెచ్చుకున్నారని చంకలు గుద్దుకోవడమే గానీ వాళ్ల లెక్కలు వాస్తవంలో వేరేగా ఉంటాయని సమజ్ కాలేదు…

గుండె జబ్బున్నా పాదయాత్ర చేశానని చెప్పుకొని ఇప్పుడు బాధపడటం కాదు… మోడీ చేయమన్నాడా..? డాక్టర్ వద్దన్నా వినలేదని ఇప్పుడు చింతిస్తే ఏం ప్రయోజనం..? కాళ్లకు రక్తాలు కారుతున్నా చెప్పులు లేకుండా తిరిగానని ఆవేదనపడితే ఫాయిదా ఏమిటి ఇప్పుడు..? వీథి పోరాటాలు చేయాలని పార్టీ చెప్పి ఉండవచ్చుగాక… కానీ అలా నటించాలే తప్ప నిజంగా చేయకూడదు… అది పార్టీ హైకమాండ్‌కు నచ్చదు…

ఇప్పుడు చూడు… కాస్తోకూస్తో జోష్ ఆమధ్య కనిపించిన పార్టీ ఇప్పుడు ఎక్కడికో జారిపోయింది… జారిపోయినా హైకమాండ్‌కు పర్లేదు… రేప్పొద్దున అవసరమైతే కేసీయార్ సపోర్ట్ కావాలి… అందుకే నో అరెస్ట్ ఆఫ్ కవిత, నో కాలేశ్వరం కథ… ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేవైఎంల నుంచి ఎమర్జ్ కావడం కూడా అనర్హతే… ఏదో ప్రగతిశీల భావజాలం నుంచి ఎదిగి, ఫక్తు రాజకీయ నాయకుడిలా ఉండాలి… ఆ సోయి, ఆ లౌక్యం లేక ఫాఫం, బండికి నొగలు విరిగినయ్జ… ఇదంతా తెలంగాణ సగటు బీజేపీ కార్యకర్తల మనోభావాలే… సో వాట్… ఎవడిక్కావాలి..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions