ఫస్ట్ పేజీ మేకప్… ఇది ఎడిటోరియల్ టీం క్రియేటివిటీ, మేనేజ్‌మెంట్ టేస్ట్, పొలిటికల్ లైన్, సమస్య తీవ్రత వంటివెన్నో బయటపెడుతుంది ఫస్ట్ పేజీ… ఫస్ట్ పేజీ పత్రికకు గుండెకాయ… ఈ దిగువ క్లిప్పింగ్ చూడండి ఓసారి… ది టెలిగ్రాఫ్ అని కలకత్తా బేస్డ్ పత్రిక ఫస్ట్ పేజీ ఇది… ఈరోజు ఇది వైరల్… ఎందుకు..?
హెడింగ్ వేరే ఉండదు… ఒక మొసలి కన్నీళ్లు ఉంటాయి ఫోటోలో… పక్కన ఈ 56 ఇంచుల చర్మానికి బాధ తెలియడానికి 79 రోజులు పట్టింది… మణిపూర్ మహిళల్ని నగ్నంగా ఊరేగించిన అకృత్యంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా… సుప్రీంకోర్టు సైతం ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని ఈసడించుకుంది…
బీజేపీని తిట్టిపోయడానికి ఓ చాన్స్ దొరికిింది కదాని… యాంటీ మోడీ, యాంటీ బీజేపీ సెక్షన్స్ అన్నీ ఈ క్లిప్పింగ్‌ను వైరల్ చేస్తున్నాయి… ఆ కోణంలో గాకుండా… మీడియా ప్రొఫెషనల్ క్రియేటివిటీ కోణంలో చూసినా ఇది ఖచ్చితంగా ‘చెప్పుకోదగిన పీస్’… జాతీయ స్థాయిలో ఇలాంటి ప్రయోగాలు టెలిగ్రాఫ్ మాత్రమే చేయగలదు, చేస్తున్నది… మోడీకి పెట్టిన చురక మామూలుది కాదు…
Ads
చాలామంది పాఠకులు పొద్దున లేవగానే టెలిగ్రాఫ్ ఈ-పేపర్ ఓపెన్ చేస్తుంటారు… అది పక్కా యాంటీ బీజేపీ పత్రికే, డౌట్ లేదు… మోడీని ఏమైనా తిట్టాలంటే టెలిగ్రాఫ్ సిబ్బందిలోని క్రియేటివిటీ అగ్గిమండుతుంది… ఎందుకోగానీ మమత, టీఎంసీ అరాచకాల్ని పెద్దగా పట్టించుకోదు… సరే, ఆ పత్రిక పొలిటికల్ లైన్ అదీ అనుకుందాం… ఇక మణిపూర్ వంటి ఇష్యూ దొరికాక టెలిగ్రాఫ్ ఊరుకుంటుందా…? ఇలా బజారులో నిలబెట్టి కడిగేసింది…
ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… మన తెలుగు పత్రికలకు చేతనవుతుందా..? పార్టీల రంగులు పూసుకుని… ఐతే కీర్తనలు, లేదంటే బురద జల్లడం… అదే పేలవంగా… రంగూరుచీవాసనచిక్కదనం ఏమీ ఉండవు మన ఫస్ట్ పేజీలకు… ఐనా ఈమధ్య యాడ్స్ కక్కుర్తితో ఒక్కోరోజు ఏడెనిమిది ఫస్ట్ పేజీలను కూడా ఇస్తున్నాయి… అదీ మనకు తెలిసిన క్రియేటివిటీ, కొత్తదనం, ప్రయోగం…
లోపల పేజీల వార్తలకు సంబంధించిన పదిహేను పదిహేడు ఇండికేషన్లను మొదటి పేజీలోనే కుక్కేస్తారు… ఒక్కటంటే ఒక్కటీ ఫుల్ వార్త ఉండదు… అన్నీ కంటిన్యూయేషన్లే… ఈ ఇండికేటర్లలో కనీసం కాస్త చెప్పుకోదగిన హెడింగులు పెట్టడం కూడా చేతకాదు… కొంతలోకొంత ఆంధ్రజ్యోతి నయం… ఇలా ప్రజెంటేషన్ ప్రయోగాలు చేతకాకపోయినా సరే, కంటెంటులో అప్పుడప్పుడూ నిప్పులు చిమ్ముతుంది… అఫ్‌కోర్స్, అదీ జగన్‌పై ఎక్కువగా… జాతివైరం…
అత్యంత నాసిరకపు ఫస్ట్ పేజీ అంటే ఈనాడుదే… ఊ అంటావా ఊఊ అంటావా పాటను కూడా శివరంజని రాగంలో ప్రజెంట్ చేయగలదు అది… మన వాళ్లకు ఓ భ్రమ ఉంది… ఎర్రటి అక్షరాలతో పెద్ద లెటర్స్ పెడితే చాలు, స్టాల్స్‌లో పాఠకుల్ని అవే ఆకట్టుకుంటాయి అని… మరి టీవీలు… అది మరీ దరిద్రం… అప్పుడప్పుడూ టీవీ9 కొన్ని ప్రయోగాలు చేస్తుంటుంది… విచిత్రంగా ఆ క్రియేటివిటీలో మెరిట్ లేక అన్నీ బెడిసికొట్టి చానెల్ నవ్వుల పాలవుతూ ఉంటుంది… మిగతా టీవీలకు ఇదీ చేతకాదు…!!
Share this Article