టీవీ సీరియళ్ల తాజా రేటింగులేమిటి సర్ అనడిగాడు ఓ మిత్రుడు… నిజమే, కార్తీకదీపం సీరియల్ ఆగిపోయాక నిజంగానే టీవీ సీరియళ్ల రేటింగుల మీద అందరికీ ఇంట్రస్ట్ తగ్గిపోయింది… పైగా తెలుగు టీవీ సీరియళ్లన్నీ చెత్త, చెత్తన్నర… అవి రాసేవాళ్లకు, తీసేవాళ్లకు, చూపించేవాళ్లకు టీవీ ప్రేక్షకులంటే హౌలాగాళ్లతో సమానం…
అన్నట్టు కార్తీకదీపం సీరియల్‌తో ప్రతి తెలుగు ఇంటికి పరిచయమైన ప్రేమి విశ్వనాథ్ మళ్లీ ఏ సీరియల్‌లోనూ కనిపించలేదు… అదేమిటో మరి, అంతటి పాపులర్ నటిని ఏ ఒక్క సీరియల్‌లోనూ భాగస్వామిని చేయలేదు… ఆశ్చర్యమే… డాక్టర్ కార్తీక్ పాత్ర పోషించిన నిరుపమ్ మాత్రం అదేదో సీరియల్‌లో కనిపిస్తున్నాడు…
Ads
టీవీ రేటింగుల్లో కార్తీకదీపం ఓ రికార్డు… అఫ్ కోర్స్, దానికీ సగటు తెలుగు టీవీ సీరియల్‌కు ఉన్నట్టే బోలెడన్ని అవలక్షణాలు ఉన్నా సరే… అసలే స్టార్ మాటీవీ, అదసలే రేటింగుల్లో దిట్ట, పైగా ప్రైమ్ టైమ్, అంతకుమించి ప్రేమి విశ్వనాథ్… అందుకే ప్రతిసారీ కార్తీకదీపం రేటింగ్స్ హైరేంజులో ఉండేవి… తరువాత సీరియల్ కథలో చెత్తామార్పులు చేసి, దాన్ని నాశనం చేశారు, ఆ తరువాత సీరియలే క్లోజ్ చేశారు… అదో కథ…
స్టార్ మాటీవీ ఎంత ప్రయత్నించినా సరే కార్తీకదీపం రేంజుకు మరే సీరియల్‌నూ తీసుకురాలేకపోయింది… కాస్తోకూస్తో ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్స్ సాధిస్తోంది… ఇందులో మానస్ కథానాయకుడు… ఇది బెంగాలీ సీరియల్ గట్చోరాకు తెలుగు వెర్షన్… తరువాత అదే టీవీ చానెల్‌లో వచ్చే నాగపంచమి కూడా రెండో స్థానంలో ఉంటోంది… ఇది కూడా ఒక బెంగాలీ పాపులర్ సీరియల్, పేరు పొంచోమికి తెలుగు వెర్షన్… నటీనటులు అంత పెద్ద పాపులర్ కాదు…
మూడో ప్లేసు కృష్ణా ముకుందా మురారి… ఇది కూడా ఒక బెంగాలీ సీరియల్‌కు తెలుగు వెర్షన్… దాని పేరు కుసుమ్ డోలా… (అంటే పూలపల్లకి..?) నటీనటులు పెద్దగా తెలుగు ప్రేక్షకులకు పరిచితులేమీ కానట్టుంది… సో, తెలుగు టీవీ సీరియళ్లలోని ప్రథమ మూడు సీరియళ్లు బెంగాలీ సీరియళ్లకు రీమేకులు… అంతేకాదు… ఈ మూడు సీరియళ్ల తరువాత స్థానం… జీతెలుగులో వచ్చే త్రినయని, ప్రేమ ఎంత మధురం సీరియళ్లు…
నిజానికి గతంలో టాప్ 30 ప్రోగ్రాముల్లో అన్నీ స్టార్ మాటీవీ ప్రోగ్రాములే ఉండేవి… అప్పుడప్పుడూ త్రినయని, ప్రేమ ఎంత మధురం సీరియళ్ల పేర్లు కనిపించేవి… ఇప్పుడు ఈ రెండూ మంచి రేటింగులు పొందుతున్నయ్… త్రినయని కూడా అదే పేరున్న పాపులర్ బెంగాలీ సీరియల్‌కు తెలుగు రీమేక్… ఈ సీరియల్‌కు ప్రధాన ఆకర్షణ ఆషిక పడుకోన్… ప్రేమ ఎంత మధురం సీరియల్ మాత్రం మరాఠీ సీరియల్ తులా పహతేరే కు తెలుగు రీమేక్… అంటే మొదటి నాలుగు టాప్ సీరియళ్లు బెంగాలీ సీరియళ్లకు అనుకరణలే… వాటిల్లో ప్రధాన తారాగణం కన్నడం… అంటే వేటిల్లోనూ ఒరిజినల్ తెలుగుదనం లేదు… అవునులెండి, ఆ సీరియళ్ల పోకడలు చూస్తేనే తెలుస్తుంది…!! కనీసం ఆసక్తికరంగా తెలుగీకరించుకోవడం కూడా తెలియని దద్దమ్మలు..!!
Share this Article