సీమా హైదర్… ఈమె గురించి ఇప్పుడే చెప్పుకున్నాం కదా… పాకిస్థానీ జాతీయురాలు… పబ్జీ ఆడుతూ ఆడుతూ ఓ ఇండియన్ ప్రేమలో పడి, సీమ హద్దులు దాటి, నేపాల్ గుండా పిల్లలతో సహా ఇండియాలోకి వచ్చేసింది… ఆమె కథ విదితమే… సచిన్ మీనా అనే యువకుడితో ఈ ప్రేమకథ 2019లోనే చిగురించి, పెరగసాగింది… ప్రస్తుతం ఆమె కథను యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ జల్లెడ పడుతోంది… ఐఎస్ఐ ఏజెంట్ కావచ్చుననేది ఆమెపై సందేహం…
జనవరిలో ఇలాంటిదే ఓ కథ… బెంగుళూరులో అక్రమంగా నివసిస్తున్న పాకిస్థానీ జాతీయురాలు అంటూ పోలీసులు ఇక్రా జీవని అనే యువతిని అరెస్టు చేశారు… గత ఏడాది ఆమె కూడా ఇండో-నేపాల్ హద్దుల నుంచే ఇండియాలోకి ప్రవేశించింది… 25 ఏళ్ల యువకుడు, ములాయంసింగ్ యాదవ్ అనే ఓ సెక్యూరిటీ గార్డ్‌తోొ లుడో గేమ్ ఆడుతూ ఆడుతూ ప్రేమలో పడింది… ఇండియాకు వచ్చేసింది… ప్రస్తుతం ఎఫ్ఆర్ఆర్ఓ (Foreigners Regional Registration Office ) అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, ఆమె నిజమైన ప్రేమికురాలేనా..? ఏమైనా కుట్రలో భాగస్వామా..?
ఇంకో కథ ఉంది… అదీ రీసెంటుదే… 49 ఏళ్ల పోలాండ్ యువతి, పేరు బార్బరా పోలక్… ఆల్రెడీ ఆరేళ్ల బిడ్డ కూడా ఉంది… పేరు అనన్య… సేమ్, పైన చెప్పిన రెండు కేసుల్లాగే ఈమె కూడా ఇన్‌స్టా ద్వారా జార్ఖండ్‌లోని హజారిబాగ్‌కు చెందిన షాదాబ్ మాలిక్‌తో ప్రేమలో పడింది… ఇంకేం, ఇండియాలోకి వచ్చేసింది… టూరిస్ట్ వీసా మీద… 2027 వరకు వేలిడిటీ ఉంది… ఈ లవ్వుకు కులం, మతం, ప్రాంతం, దేశమే కాదు, వయస్సు కూడా అడ్డంకి కాదు… తరువాత..?
Ads
ఈ మూడు కేసులూ దాదాపు ఒకేతరహా… అయితే గేమింగ్ యాప్ ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా పరిచయాలు, తరువాత ప్రణయాలు, తరువాత ఇండియాలోకి వచ్చేసి కాపురాలు… రెండు కేసుల్లో ఆల్‌రెడీ పిల్లలున్నారు ఆ యువతులకు… ఐతేనేం… ఇండియన్ యువకులు పీకల్లోతు పడిపోతున్నారు… రమ్మంటున్నారు… వాళ్లు వచ్చేస్తున్నారు… అఫ్‌కోర్స్, ఇలాంటి కేసులు గతంలో కూడా ఉన్నాయి…
Share this Article