Rohini Devi ఈ రోజు నేను పడిన అగచాట్లు ఏమని వర్ణించను ? ఎలా వర్ణించను ? ఉదయం లేచి పూజ చేసుకుని వంట అయ్యాక మొక్కలకి నీళ్లు పోసుకుని, మధ్యాహ్నం క్రికెట్ మ్యాచ్ కి వెళ్ళడానికి ఏమి చీర కట్టుకోవాలి అని ఆలోచిస్తుండగా మా బాబు ఆఫీస్ నుంచి మెసేజ్ పెట్టాడు…
అప్పుడే NTV లో వచ్చిన ఫ్లాష్ న్యూస్ చదువుతున్నాను ! ఇండియా non బాసుమతి బియ్యం ఇక ఎక్స్పోర్ట్ చేయదని , బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయని !
ఈలోగా మా అబ్బాయి మెసేజ్ చూసేను… అమ్మా, బియ్యం దొరకవు! కొన్ని కొని , స్టోర్ చేయమని ! అంతే ! గుండె దడ కొట్టుకోవడం మొదలయింది !ముందుగా మా గ్రోసరీ స్టోర్స్ నితిన్ కి ఫోన్ చేశాను ! (ఎప్పుడూ అమ్మ అమ్మ అని పలకరిస్తాడు) ఫోన్ తీసుకుని , తను వేరే బ్రాంచ్ తెరుస్తున్నానని, అక్కడ ఉన్నాను అని చెప్పాడు ! బియ్యం కావాలి అన్నాను !
Ads
ప్రొద్దుట నుంచి వచ్చి జనం తీసుకుని పోయారని చెప్పాడు ! స్టాక్ లేదు, వచ్చినపుడు ఇస్తాను అని చెప్పాడు ! మళ్ళీ హార్ట్ రేట్ పెరిగింది ! వెంఠనే మా నైబర్ కి ఫోన్ చేసి రమ్మన్నాను “భోజనానికి కూర్చున్నాను మళ్ళీ ఫోన్ చేస్తాను” అన్నాడు . 20 నిముషాలు అయ్యాక యిలాగా బియ్యం దొరకడం లేదు అంటున్నారు, Restaurent డిపో కి వెళదాము నడు అన్నాను ! అయిదు నిముషాలలో కార్ తెచ్చాడు
ఈ లోపులా మా కజిన్ కి ఫోన్ చేసి చెప్పాను… తను న్యూజెర్సీలో ఉంటాడు ! వెంఠనే వాళ్ళ కుక్ ని Indian స్టోర్స్ కి పంపాడు… కార్ లో కూర్చున్నాక మా అమ్మాయికి శానోజే ఫోన్ చేసి వెంటనే వెళ్లి బియ్యం కొనుక్కోమని చెప్పాను, అది కాల్ లో ఉన్నాను, అయ్యాక వెళ్తున్నాను అంటే నాలుగు కేకలేసి , వెంటనే వెళ్ళమన్నాను !
నేను రెస్టారెంట్ డిపోలోకి అడుగు పెడుతుంటే మన తెలుగు వాళ్ళు 40 పౌండ్స్ మసూరి బియ్యం 40 pounds బాసుమతి ఒక్కొక్కళ్ళు 20 , 30
బాగ్స్ పెట్టుకుని వాళ్ళ కార్లలోకి ఎక్కిస్తున్నారు. ఒక్క పరుగులో బియ్యం rack దగ్గరకు పరిగెత్తాను ! అయిపోయాయి అని ఎవరో చెప్పారు, వెనక్కి తిరిగి చూస్తే 5 కౌంటర్లలో ఒకొక్కళ్ళు 20 బాగ్స్ పెట్టుకుని ఉన్నారు !
ఒకతని దగ్గర 40 బాగ్స్ ఉన్నాయి. ఒక్క రెండు బాగ్స్ ఇవ్వమని అడిగాను. నల్ల మేకని బలి వేసినా ఇవ్వనని నిర్మొహమాటంగా చెప్పాడు. అప్పుడు వెళ్లి మేనేజర్ కి రెస్ట్రిక్షన్ పెట్టాలి అని complain చేశాను ! వాడు టెన్ బాగ్స్ per person అన్నాడు. మన వాళ్ళు మూడేసి బిల్స్ వేయించి తీసుకెళ్లిపోయారు ! అప్పుడు వాళ్ళ నిజరూపాలు తెలిసి అసహ్యం వేసింది ! అవి అన్ని బ్లాక్ లో అమ్ముకోవడానికి తీసుకుని పోయారు !
https://twitter.com/DeccanChronicle/status/1682607645407203328?t=hYcsBFRZsqdyqAzjPZ6hrQ&s=08
ఇంతలో ఒకతను నన్ను చూసి గుర్తు పట్టి , మా అబ్బాయి తెలుసునని, నాలుగు బాగ్స్ (20 పౌండ్స్ ఒక్కొక్క బాగ్ )సోనామసూరి ఇచ్చాడు. నేను రెండు తీసుకుని మాతో వచ్చిన వారికీ రెండు ఇచ్చాను. ఇంతలో మా బాబు దూరంలో ఉన్న Costco వెళ్లి , రెండు బాగ్స్ బాసుమతి తీసుకుని వస్తున్నాను అని చెప్పాడు…
ఇంటికి వచ్చి Dallas , Austin, Atlanta , Detroit , Cincinnati , Washington, మన శశికళకు, గిరిజారాణి గారికి ! శాన్ఫ్రాన్సిస్కో, new jersey , మా వూళ్ళో వాళ్ళకి 25 మందికి ఫోన్ చేసి , వాళ్ళని కూడా పరిగెత్తించాను ! రాత్రి పది గంటల దాకా ఫోన్స్ లోనే ఉన్నాను… రాత్రి పది గంటలకు మా ఫ్రెండ్స్ చెప్పినదేమిటంటే బియ్యం రేట్ పెంచేశారని , కొన్ని షాప్ ల వాళ్ళు వాళ్ళ స్టోర్స్ లో 100 డాలర్స్ పెట్టి సరకులు కొంటే 16 డాలర్ల బియ్యం ఒకటి, 30 రూపాయలకు, మనిషికి ఒకటి చొప్పున ఇస్తామని చెబుతున్నారు…
ఇదండీ “బియ్యం భాగోతం “! అమెరికా అంతా అట్టుడికిపోతోంది… చిత్రంగా కొన్ని చోట్ల గోధుమ పిండి కూడా “హుష్ కాకి “! (మన శాకాహార షడ్రుచులు) పేజీ నుంచి తీసుకున్న పోస్టు…) (భారతదేశం బియ్యం ఎగుమతుల్ని నిషేధిస్తున్నదనే వార్తతో ఈ కలకలం…) (బియ్యంపై నిర్ణయాన్ని సమర్థిస్తూ, అది దేశానికి ఎంత మేలో చెబుతూ కాషాయ పోస్టులు ఇంకా స్టార్ట్ కాలేదు…)
Share this Article