బీజేపీయే ఓ స్ట్రాటజీగా ఈమె పేరును ప్రచారంలోకి తీసుకురావడానికి, తెలిసిన రిపోర్టర్లతో రాయిస్తోందా..? లేక బీజేపీని పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందా..? ఈ వార్త నేపథ్యం అస్సలు ఎవరికీ అంతుపట్టడం లేదు… బహుశా రాధాకృష్ణకు కూడా అంతుపట్టకపోవచ్చు… రామోజీరావులాగే తను కూడా ఈమధ్య తన పత్రికను తనే చదవడం లేనట్టుంది… అసలు విజయశాంతి నాగార్జునసాగర్ బరిలో పోటీకి ఎలా ఆప్ట్..? బీజేపీ వంటి ఓ జాతీయ పార్టీ అల్లాటప్పాగా ఏమీ ఆలోచించకుండానే విజయశాంతికీ జై అంటుందా..? ఇదీ సాగుతున్న చర్చ… ఒకవేళ నిజంగానే బీజేపీ గనుక విజయశాంతిని సాగర్ బరిలో నిలబెడితే జానారెడ్డి ఫుల్ ఖుష్… తన విజయం నల్లేరు మీద నడక… కాదు, నల్లేరు మీద పరుగు… ఎందుకంటే..?
- విజయశాంతి మొదట్లో బీజేపీలోనే ఉన్నా సరే, తరువాత ఎటెటో తిరిగి మళ్లీ బీజేపీలోకి వచ్చింది… బీజేపీలో ఇప్పటికిప్పుడు అమిత ప్రాధాన్యం రావాలని కోరుకున్నా ఆమెకు పెద్ద ఫాయిదా దక్కకపోవచ్చు… కేడర్ అంగీకరించకపోవచ్చు…
- ఆల్రెడీ సాగర్‌లో నివేదితారెడ్డి ప్రచారం చేసుకుంటోంది… ఇద్దరు యాదవ్ నాయకులు, మరో రెడ్డి కూడా టికెట్టు ఆశిస్తున్నారు…
- అక్కడ రెడ్లకు దీటుగా వోట్లున్నవి యాదవులకే… రెడ్లను ఓడించగలిగేది కూడా యాదవులే… గత ఎన్నికల్లోలాగా..! సో, విజయశాంతి కులం రీత్యా అభ్యర్థిత్వానికి స్ట్రాటజిక్‌గా సరిపోదు…
- కాంగ్రెస్ నుంచి ఆల్రెడీ జానారెడ్డే నిలబడతాడు… ఆయనకే మొగ్గు కనిపిస్తోంది ప్రస్తుతానికి… ఒకవేళ నాలుగు వోట్లు తగ్గే పరిస్థితులు కనిపించినా…. బీజేపీ గెలవకుండా ఉండటానికి అవసరమైతే టీఆర్ఎస్ తన వోట్లనూ మళ్లించగలదు… ఆ పార్టీ ఎలాగూ బలహీనంగానే ఉంది… సో, బీజేపీ నుంచి బలమైన అభ్యర్థిత్వం కావాల్సిందే….
- జానారెడ్డి నేను గతంలో ఇది చేశాను, అది చేశాను అని చెప్పుకోగలడు… విజయశాంతికి ఆ చాన్స్ ఉండదు…
- ఆమె జానారెడ్డి మీద విమర్శలు చేయడానికి కూడా పెద్ద స్కోప్ ఉండదు… తిడితే టీఆర్ఎస్ను తిట్టిపోయాలి… కానీ అది జానారెడ్డి మీద పోరు అనిపించుకోదు…
- అక్కడ మతం పాచికలు పనిచేయవు… రామజన్మభూమి ఎట్సెట్రా నినాదాలు, ఎమోషన్స్ విజయశాంతికి పెద్దగా ఉపయోగపడవు… ఎటొచ్చీ కులం అనే కార్డు మాత్రమే బీజేపీకి ఉపయోగకరం…
- విజయశాంతి ఒకప్పుడు పెద్ద హీరోయిన్, ఆ చార్మింగ్ ఒక గతం… ఇప్పుడు ఆమెకు అంతగా పాపులారిటీ లేదు… కాసింత ఉన్నా సరే, పల్లెల్లో పెద్దగా దాన్ని పట్టించుకోరు…
- పేరు గొప్ప అభ్యర్థిత్వాలు గ్రామీణ నియోజకవర్గాల్లో వర్కవుట్ కావు… ఆమె గనుక నిలబడితే ఒక్కటి మాత్రం రిలీఫ్… జానారెడ్డి ప్రసంగాలు ఎవరికీ అర్థం కావు… విజయశాంతి కూడా దాదాపు అంతే… సెటిలర్లు ఎటు మొగ్గుతారనేదీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం…
- దుబ్బాక, గ్రేటర్ ఫలితాలతో తత్వం బోధపడిన టీఆర్ఎస్ సాగర్‌లో బీజేపీని నిలువరించి, మూడో స్థానానికి నెట్టేసే ప్రయత్నం చేస్తుంది… పైగా జానారెడ్డితో కేసీయార్‌కు పెద్ద ప్రాబ్లమూ లేదు… ఉండదు… ఈ స్థితిలో బీజేపీ ఓ యాదవ్‌ను నిలబెట్టి, బీసీ వోటును బాగా ఆర్గనైజ్ చేయగలిగితే ఏమైనా ఫాయిదా ఉండొచ్చు… లేకపోతే ఆశలు వదిలేసుకోవచ్చు…!!
Share this Article
Ads