కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది… కానీ ఎప్పుడు..? మరో మూడునాలుగు నెలల్లో టరమ్ ముగిసిపోతుండగా…! తప్పుడు వివరాలతో ప్రజలందరినీ తప్పుదోవ పట్టించి, మన ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసిన నేరానికి జస్ట్, 5 లక్షల జరిమానా సరిపోతుందా..? ప్రజల్ని వంచించడం కాదా ఇది..? ఈ ప్రశ్నలు ప్రజల మెదళ్లను వేధించాయి…
వనమా కొడుకు అరాచకాలు ప్రజలందరికీ తెలుసు… తనకు తండ్రి మద్దతు కూడా అందరికీ తెలుసు… అలాంటివాళ్లను కేసీయార్ జనం మీద రుద్దాడు… అప్పట్లో రాజీవ్‌గాంధీని ఎవరో అడిగారుట, ఎవరైనా మీ ఎంపీల్లో పద్ధతిగా ఉన్నవాళ్లు ఉన్నారా అని… ఎందుకు లేరు..? మా కోట్ల విజయభాస్కరరెడ్డి లేడా అన్నాడట ఆయన… కేసీయార్ ప్రజలపై రుద్దిన ప్రజాప్రతినిధుల గురించి ఎవరైనా అడిగితే జవాబు ఏమని వస్తుందో..? అవునులెండి, అన్ని వ్యవస్థలనూ ఎమ్మెల్యేల పరిధిలోకి తీసుకొచ్చి, వాళ్ల చెప్పుచేతల్లోకి తీసుకొచ్చిన నిర్వాకం దొరవారిదే కదా…
Ads
వనమా కేసు కాసేపు పక్కన పెట్టండి… చెన్నమనేని కేసు ఎన్నేళ్లుగా నానుతోంది కోర్టులో… చివరకు ఆయన పౌరసత్వం మీద కేంద్రం కూడా స్పందించినా సరే కోర్టులు ఇంకా ఏదీ తేల్చిచెప్పడం లేదు… ప్రజాప్రతినిధుల కేసుల్లో సత్వర విచారణను సుప్రీం కూడా కోరుతోంది… ప్రజాప్రతినిధుల కేసుల సత్వర విచారణకు కోర్టులూ ఉన్నాయి… కానీ జరుగుతున్నదేమిటి..? సుదీర్ఘజాప్యం… సకాలంలో వెలువడని న్యాయం కూడా అన్యాయమే కదా…
ఇదంతా పక్కన పెడితే… ఎంపీ బీబీ పాటిల్‌కు కూడా ఇలాంటి కేసులోనే సుప్రీంలో చుక్కెదురు… సేమ్, ఇలాగే హైకోర్టుకు వెళ్లిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కూ హైకోర్టులో చుక్కెదురు… అందరూ గులాబీలే… అంతెందుకు..? సీఎం మీద కూడా కేసు ఉందని, తుమ్మల శ్రీనివాస్ అనే వ్యక్తి పెట్టిన కేసు పెండింగ్‌లో ఉందని ఆంధ్రజ్యోతి గుర్తుచేసింది… ఇద్దరు మంత్రులే కాదు, ఏకంగా 15 మంది ఎమ్మెల్యేల మీద ఎన్నికల అక్రమాలు, తప్పుడు అఫిడవిట్లు అనే కేసులు నడుస్తున్నాయనీ చెప్పింది…
వీటిల్లో నిజంగానే ఎమ్మెల్యేలందరూ తప్పుడు వివరాలు ఇవ్వకపోవచ్చు, కేసులు నిలవకపోవచ్చు, కానీ కోర్టులు వాటిని సత్వరం పరిష్కరించాలి కదానేది ప్రజల అభిమతం… తమను పాలిస్తున్న నేతల వ్యవహారధోరణి ఏమిటో ప్రజలకు తెలియాలి కదా… సరే, వీటినీ కాసేపు పక్కన పెడదాం…
సోషల్ మీడియాలో, టీవీ మీడియాలో ఎప్పటికప్పుడు (దాదాపుగా రియల్ టైమ్) వార్తలు వచ్చేస్తున్నాయి… వార్త కనిపించిన గంటలో విశ్లేషణలు, అభిప్రాయాలు, స్పందనలు కూడా వచ్చేస్తున్నాయి… ఆ పాచివార్తలను పబ్లిష్ చేసే బదులు ప్రింట్ మీడియా వార్తలకు ఎక్స్‌క్లూజివ్ వాల్యూ యాడిషన్ చేయాలి… అది ఏ పత్రికకూ చేతకావడం లేదు… కానీ ఈ ఎన్నికల అక్రమాలకు సంబంధించి మంచి వాల్యూ యాడిషన్ చేసింది… గుడ్…
ఎంతమంది ఎమ్మెల్యేలపై ఇలాంటి కేసులున్నాయో పేర్లు, నియోజకవర్గాలతో సహా పబ్లిష్ చేసింది… టైమ్‌లీ, ఆప్ట్ ఐటమ్… ఈనాడు తన పాత్రికేయానికి ఏనాడో స్వయంగా ఉరి బిగించుకుంది, ఏదో ఈనాడు అనే బ్రాండ్ పేరుతో నడుస్తోంది అది… సాక్షికి ఎలాగూ ఈ టేస్టు లేదు, అంత ప్రొఫెషనలిజం లేదు, చేతకాదు కూడా… ఇలాంటి వార్తలకు చంద్రబాబు, జగన్‌లతో సంబంధం లేదు కదా, మరి సాక్షికి ఎందుకు ఇలాంటి వాల్యూ యాడెడ్ స్టోరీలు ఎందుకు చేతకావు..? ఒక్క చంద్రబాబు పట్ల విధేయత, జగన్ మీద విద్వేషం అనే కోణాలు తీసేస్తే… మిగతా వార్తలకు సంబంధించి ఆంధ్రజ్యోతి ఈమధ్య ప్రొఫెషనల్‌గా ఉంటోంది… ప్రత్యేకించి కేసీయార్ మీద రాస్తున్నది
Share this Article