Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ నారాయణ అంత క్రూరుడా..? సొంత మరదలిపైనా శాడిజం నిజమేనా..?

July 30, 2023 by M S R

ముందుగా ఓ తాజా వార్త చదవండి…  మాజీమంత్రి టీడీపీ నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యం తనను వేధిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని హైదరాబాదులోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేసిన పొంగూరు కృష్ణప్రియ…. టీడీపీ మాజీ మంత్రి నారాయణ వేధింపులపర్వం… పోలీసులను ఆశ్రయించిన ప్రియ…

మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే… తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రియ గళమెత్తింది… ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని ప్రియా హైదరాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు… తనను వేధిస్తున్నారని రాయదుర్గం పీఎస్‌లో టీడీపీ మాజీ మంత్రి నారాయణపై ఫిర్యాదు…

సోషల్ మీడియా వేదికగా… టీడీపీ మాజీమంత్రి నారాయణ పెట్టిన హింసలను… ప్రియా ప్రజల దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే…. తాను వీడియోలు విడదుల చేసిన తరువాత టీడీపీ మాజీ మంత్రి నారాయణ నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని ప్రియ ఆవేదన వ్యక్తం చేశారు… ఈ క్రమంలోనే తాను పోలీసులను ఆశ్రయించినట్లు ప్రియా పేర్కొన్నారు…

Ads

నారాయణ మరదలు

ముందుగా ఒక డిస్‌క్లయిమర్…. నారాయణ ఆడపిచ్చి గురించి హైదరాబాద్ విద్యాసర్కిళ్లలో బోలెడు ఆరోపణలున్నయ్… తన విద్యావ్యాపారం తీరు గురించి, తను ఎదిగిన తీరు గురించి కూడా కథలుకథలుగా చెబుతారు… అమరావతి కేపిటల్ ల్యాండ్ స్కాం విషయంలో కూడా నారాయణ మీద బొచ్చెడు విమర్శలు… తన మీద ఉన్న నెగెటివిటీ కారణంగా కొడుకు యాక్సిడెంటులో మరణిస్తే పెద్దగా సానుభూతి కూడా కనిపించలేదు, పాపం శమించుగాక… ఆమె మొహంలో వీసమెత్తు విషాదఛాయలు కూడా కనిపించలేదు… వాస్తవానికి ఆమె వీడియోలు కూడా బహుళ చర్చనీయాంశాలు ఐఉండాలి…

సరే, ఈమధ్య మరణించిన శ్రీచైతన్య అధినేత బీఎస్ రావు, ఈ నారాయణ దాదాపు ఒకే పంథా… ఇద్దరూ బలమైన పోటీదారులు, కానీ ఒక దశలో ఇద్దరూ కలిసి చైనా పేరిట ఉమ్మడి దోపిడీ మొదలుపెట్టారు… తరువాత ఎందుకో చైనా గ్రూపు ఇచ్చుకుపోయింది… ఈ నేపథ్యంలో తన సొంత మరదలు తనపై లైంగికం సహా ఏ ఆరోపణలు చేసినా ఆమె మీద భారీ సానుభూతి రావాలి… కానీ రావడం లేదు… (అంత నమ్మబుల్‌గా లేక ఆమె వీడియోలను కూడా ఇక్కడ యాడ్ చేయడం లేదు…) వైసీపీ నేత సాయిరెడ్డి మినహా మిగతావాళ్లు కూడా పెద్దగా పట్టించుకోలేదు… (సాయిరెడ్డి ట్వీట్లకు పెద్దగా విశ్వసనీయత లేదనేది ఇక్కడ గమనార్హం…) (రాయదుర్గంలో ఆమె కంప్లయింట్ తీసుకుంటున్నది కానిస్టేబులా..? హోం గార్డా..? నారాయణను అమితంగా ప్రేమించే బీఆర్ఎస్ ఈ కేసును ముందుకు పోనిస్తుందా..? నారాయణ కొడుకు మరణించినప్పుడు ప్రభుత్వ ముఖ్యులు దగ్గరుండి వ్యవహారాలను చక్కబెట్టిన సంగతి తెలుసు కదా…)

కారణం :: ఆమె చెప్పిన అంశాల్లో నిజానిజాలేమైనా కానివ్వండి, సాక్షాత్తూ ఆమె ఆరోపణల్ని ఆమె భర్త సుబ్రహ్మణ్యం అలియాస్ మణి ఖండిస్తూ ఆమెను మెంటల్ కేసుగా కొట్టిపారేయడం కాదు… నిజానికి ఆమె తన బాధను వ్యక్తీకరించిన తీరే బాగాలేదు… నేను కష్టమ్మీద మొదటి భాగం చూశాను… అప్పుడే నవ్వుతుంది, ఏదో సరదాగా రీల్ లేదా షార్ట్ చేసినట్టుగా ఏదేదో చెబుతూ పోతుంటే, అసలు సమస్యలో తీవ్రత కనిపించకుండా పోయింది…

చిన్నప్పుడే తనకు అబద్ధాలు చెప్పి చిన్న వయస్సులోనే పెళ్లి చేశారనీ, ఇద్దరు భార్యలున్న నారాయణ ఎప్పుడూ తనను సహించకుండా వేధించేవాడని, తన మామ మాత్రమే సానుభూతితో అర్థం చేసుకున్నాడని చెప్పిందామె… మరి ఇన్నేళ్లూ బయటికి రాకుండా, ఏమీ చెప్పకుండా ఇప్పుడు హఠాత్తుగా తెర మీదకు రావడం వెనుక కారణం ఏముందో తెలియదు గానీ… నారాయణ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కోణంలో చూస్తే తన మీద మరదలు ప్రియ విషయంలో అంత తీవ్ర వ్యతిరేకత ఏమీ సోషల్ మీడియాలో వ్యక్తం కాలేదు… అంటే నారాయణ ఏదో శుద్ధపూస అని కాదు… ఈ కథనం తనకు మద్దతు కూడా కాదు… కానీ ప్రియ బలంగా నారాయణ వేధింపుల్ని, తన శాడిజాన్ని బలంగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది… అలాగని ఆమె చెబుతున్న అంశాలు అబద్ధాలని నేనేమీ చెప్పడం లేదు… నిజాలైనా సరే, బలంగా ప్రొజెక్ట్ చేయలేకపోయిందని మాత్రమే చెబుతున్నాను… let Rayadurgam police tell facts… after an impartial enquiry only…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions